Dried Flower Craft Business in Telugu: ఎండిన పూలతో Handmade Gifts తయారు చేసి ఇంటి నుంచే Online Income సంపాదించడం ఎలా?

Dried Flower Craft Business: ఎండిన పూలతో అందమైన గిఫ్ట్స్ తయారు చేసి ఇంటి నుంచే సంపాదించడం ఎలా?

Table of Contents

అమ్మలారా అక్కలారా తమ్ముళ్ళరా, చెల్లెళ్ళరా! Dried Flower Craft Business అంటే ఏంటీ? మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? మనం చాలా పెళ్లిళ్లు కి వెళ్తాము లేదు ఏదైనా గుడిలో ఒక పూజ చేయించుకోవడానికి, ఏదైనా బర్తడే ఫంక్షన్ కి, ఇంకా… పెద్ద మనిషి ఫంక్షన్లకి, ఇలా చాలా ఫంక్షన్స్ కి వెళ్తూనే ఉంటాం కదా! అక్కడ వాడి పడేసే పువ్వులు మీరు ఎప్పుడైనా గమనించి ఉంటే మీకు ఒక భయంకరమైన small business idea కనిపించి ఉండేది. నేను ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ ప్లాన్ విని మీకు మబ్బులు విడిపోతాయి. అదే ఈ Dried Flower Craft Business . అనేది ఇప్పుడు మార్కెట్ లో చాలా క్రేజ్ ఉన్న బిజినెస్. ఉదాహరణకు, ఒక పెళ్లి అయిపోయిన తర్వాత రోజే డెకరేషన్ కి వాడిన వేలాది రూపాయల పూలన్నీ డస్ట్ బిన్ లోకి వెళ్లిపోతాయి. అలాగే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు వేసుకునే ప్రత్యేకమైన కల్యాణ మాలలు (Wedding Varmala) కూడా ఎండిపోయి పాడైపోతాయి. కానీ, ఆ పెళ్లి పూలను అలా పాడవకుండా, వాటి రంగు పోకుండా జీవితాంతం ఒక అందమైన జ్ఞాపకంగా (Resin Frame or Keepsake) దాచుకునేలా మనం చేసి ఇస్తే, కస్టమర్లు ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో వర్మాల ప్రిజర్వేషన్ ఆర్డర్‌కు రూ. 5,000 నుండి రూ. 15,000 వరకు వసూలు చేస్తున్నారు.

ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీని చూసుకుంటూ, ఖాళీ సమయంలో ఒక మంచి హాబీలా చేసుకుంటూనే నెలకు వేలల్లో Online Income From Home సంపాదించుకోవడానికి ఇదొక వండర్ఫుల్ ఆప్షన్. బయట ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఎలాంటి పెద్ద పెద్ద మెషీన్లు కొనే పని లేకుండా కేవలం ఇంట్లోనే ఒక చిన్న టేబుల్ పై చేసుకునే ఈ Home based Business Idea ఆడవాళ్లకు చాలా బాగా సెట్ అవుతుంది. ఈ రోజుల్లో చాలా మంది హౌస్‌వైఫ్స్ రకరకాల small business ideas for women కోసం ఇంటర్నెట్ లో వెతుకుతుంటారు, అలాంటి వాళ్ళకి ఇది ఒక తిరుగులేని క్రియేటివ్ ఐడియా. అలాగే చిన్న చిన్న టౌన్లు లేదా ఊర్లలో ఉండేవాళ్ళకి ఈ వ్యాపారంలో ముడిసరుకు చాలా సులభంగా దొరుకుతుంది కాబట్టి, పెట్టుబడి కూడా చాలా తక్కువ అవుతుంది. అందువల్ల ఇదొక బెస్ట్ small town business idea అని చెప్పవచ్చు.

Dried Flower Craft Business in Telugu: ఎండిన పూలతో Handmade Gifts తయారు చేసి ఇంటి నుంచే Online Income సంపాదించడం ఎలా? Complete dried flower craft business plan in Telugu showing small business ideas for women to earn 50000 rupees per month from home.

ఇంట్లో ఖాళీగా ఉంటూ బోర్ కొట్టకుండా ఏదైనా కొత్తగా చేయాలనుకునే వారికి, క్రియేటివ్ గా ఆలోచిస్తూ సొంతంగా సంపాదించాలనుకునే మహిళలకు ఇది కరెక్ట్ ఛాయిస్. పిల్లల్ని స్కూల్ కి పంపించాక లేదా ఇంట్లో పనులు పూర్తి అయ్యాక రోజుకు 2-3 గంటలు కేటాయిస్తూ చేసుకునే Work From Home Business for Ladies కి ఇది పక్కా మ్యాచ్. ఈ ప్రాక్టికల్ గైడ్ లో అసలు పూలను ఎక్కడి నుండి సేకరించాలి, వాటిని ఎలా ఎండబెట్టాలి, గిఫ్ట్స్ ఎలా తయారు చేయాలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మన వాడుక భాషలో స్టెప్-బై-స్టెప్ తెలుసుకుందాం.

Dried Flower Craft Business కోసం పూలు ఎక్కడ దొరుకుతాయి?

మనసు పెడితే మార్గం ఉంటుంది అంటారు కదా! అలాగే మనకి ఏదో వేలు లక్షల ఖర్చు పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు తెలుసా? ఎందుకంటే మనకి పెట్టుబడి లేకుండానే ఈ వాడిపోయిన పువ్వులు పువ్వులు చాలా చోట్ల దొరుకుతాయి. దీనికోసం మనమంటూ కొత్తగా ఏమి Low Investment Business అని దీనికి పేరు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మనం ఈ Dried Flower Craft Business ముందుగా వెళ్లాల్సిన ప్రదేశాలు ఎలా ఉంటాయంటే, గుళ్ళు ఫంక్షన్ హాల్లో పూల షాపులు. కావలసి నన్ను పండగలు టైం లో దొరుకుతాయి. దీని కోసం మనం ఒక సెపరేట్ సీజన్ కోసం ఏమి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ….. ఎక్కడో ఒకచోట ఒక బర్తడే ఫంక్షన్, పెళ్లి, లేదా గుడిలో పూజ…. ఇలా ఏదో ఒక అకేషన్ మన కళ్ళ ముందు జరుగుతూనే ఉంటుంది కానీ మనమే పెద్ద పట్టించుకోము. ఈ బిజినెస్ ని మనం ఒక Work from home opportunity for women అని కూడా అనొచ్చు. దీనికోసం సపరేట్గా ఒక షాపు రెంటుకు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా గట్టిగా చెప్పాలంటే మనం పెట్టుబడి కూడా పెట్టకుండా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు.

నర్సరీలు మరియు తోటల యజమానులు

మీ చుట్టుపక్కల ఉండే నర్సరీల వాళ్ళతో మంచి సంబంధాలు పెట్టుకోండి. నర్సరీలలో కొన్ని పూలు కొద్దిగా వాడిపోయినా లేదా వాటి కాడలు విరిగిపోయినా కస్టమర్లకి అమ్మలేరు. అలాంటి పూలను వారు పక్కన పడేస్తుంటారు. వారితో ఫ్రెండ్‌షిప్ చేస్తే ఆ పూలను మనకి చాలా తక్కువ ధరకే ఇచ్చేస్తారు. అలాగే పూల తోటలు సాగు చేసే రైతులు లేదా తోటల యజమానుల దగ్గరకు వెళితే, మార్కెట్ కి పంపించగా మిగిలిపోయిన పూలను చాలా చౌకగా సొంతం చేసుకోవచ్చు. వారితో ఒకసారి మాట్లాడి పెడితే పూల కొరత అనేది మనకి అస్సలు ఉండదు.

పూలను రంగు, ఆకారం పాడవకుండా ఎండబెట్టడం ఎలా? (How to dry flowers for craft)

చాలా మంది క్రాఫ్ట్స్ లోకి అడుగుపెట్టేటప్పుడు చేసే పెద్ద తప్పు ఏంటంటే… పూలను ఎలా ఆరబెట్టాలి అనే బేసిక్ విషయం సరిగ్గా తెలుసుకోకపోవడం. ఏదో మామూలుగా పూలను కోసి ఎండలో పడేస్తే వాటిలోని రంగు పూర్తిగా నల్లగా మారిపోయి, రేకులు ముడుచుకుపోయి చండాలంగా తయారవుతాయి. ప్రతి పువ్వులోని తేమను పూర్తిగా లాగేస్తూనే, దాని అసలైన రంగు మరియు ఆకారాన్ని అలాగే లైఫ్ లాంగ్ కాపాడటానికి కొన్ని ప్రొఫెషనల్ పద్ధతులు ఉన్నాయి. ఈ డ్రైయింగ్ పద్ధతులను ఒకసారి సరిగ్గా నేర్చుకుంటే How to dry flowers for craft అనేది మీకు చాలా ఈజీగా మారుతుంది.

1. Silica Gel తో ఎండబెట్టే పద్ధతి (Silica Gel Drying)

పూల ఆకారం ఏ మాత్రం చెడకుండా, తోటలో ఇప్పుడే కోసిన పువ్వులాగా 3D లుక్ లోనే ఉంచడానికి Silica Gel పద్ధతి అత్యుత్తమమైనది. ముఖ్యంగా Resin Flower Preservation Business చేసేవారికి ఇది చాలా ముఖ్యం.

  • మొదట గాలి చొరబడని ఒక ఎయిర్‌టైట్ ప్లాస్టిక్ Container తీసుకోండి. గాలి లోపలికి వెళ్తే సిలికా జెల్ బయట ఉండే తేమను పీల్చుకుని త్వరగా పాడైపోతుంది.
  • ఆ డబ్బా అడుగున కనీసం ఒకటి లేదా ఒకటిన్నర ఇంచ్ మందంలో సన్నటి Silica Gel Crystals ను సమానంగా పోయండి.
  • ఇప్పుడు పూల కాండాలను (Stems) క్రాఫ్ట్ కి తగినట్లుగా చిన్నగా కట్ చేసి, ఆ పూలను నిటారుగా (పూల ముఖం పైకి ఉండేలా) ఆ Silica Gel పైన ఉంచాలి.
  • ఒక చిన్న స్పూన్ లేదా కప్పు సహాయంతో పూల రేకుల మధ్యలోకి కూడా Silica Gel వెళ్లేలా మెల్లమెల్లగా పైనుండి పోయాలి. రేకులు ముడతలు పడకుండా చాలా సున్నితంగా, ఓపిగ్గా ఈ పని చేయాలి. పువ్వు మొత్తం పూర్తిగా జెల్ తో కప్పబడిపోవాలి.
  • ఇప్పుడు డబ్బా మూతను గాలి వెళ్లకుండా గట్టిగా బిగించి, 3 నుండి 7 రోజుల పాటు కదపకుండా ఒక పక్కన పెట్టేయాలి. లాలీపాప్ లాంటి చిన్న పూలు 3 రోజుల్లో ఎండిపోతాయి, లావుపాటి గులాబీలు ఎండటానికి 7 రోజులు పడుతుంది.
  • సమయం పూర్తయ్యాక చేతికి గ్లోవ్స్ వేసుకుని, ఒక Tweezers సహాయంతో పూలను బయటకు తీయాలి. వాటిపై ఉన్న సన్నటి జెల్ దుమ్మును క్లీన్ చేయడానికి ఒక సాఫ్ట్ మేకప్ బ్రష్ లేదా పెయింటింగ్ బ్రష్ ని ఉపయోగించి చాలా మెల్లగా దులపాలి.

2. ప్రెస్ డ్రైయింగ్ పద్ధతి (Press Drying)

బుక్‌మార్క్‌లు (Bookmarks), గ్లాస్ ఫ్రేమ్స్ (Glass Frames) లేదా గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేయడానికి పూలను బల్లపరుపుగా (Flat) మార్చాల్సి ఉంటుంది. దీనికోసం ప్రెస్ డ్రైయింగ్ వాడతాం.

  • పూలను తీసుకొని బట్టర్ పేపర్ (Butter Paper) లేదా వాటర్ కలర్ పేపర్ మధ్యలో అమర్చాలి. సాధారణ న్యూస్ పేపర్ వాడితే ప్రింటింగ్ ఇంక్ పూల రేకులకు అంటుకునే ప్రమాదం ఉంది.
  • ఆ పేపర్‌ను ఒక లావుపాటి పుస్తకం (ఉదాహరణకు పాత డిక్షనరీ) మధ్యలో పెట్టి, ఆ పుస్తకం పైన మరికొన్ని బరువైన వస్తువులను ఉంచాలి.
  • ఒకవేళ ప్రొఫెషనల్ గా చేయాలనుకుంటే మార్కెట్ లో దొరికే Wood Flower Press బోర్డులను వాడవచ్చు. ఈ పద్ధతిలో పూలలోని తేమను పేపర్ నెమ్మదిగా పీల్చుకుంటుంది. పూలు పూర్తిగా ఆరి ఫ్లాట్ గా మారడానికి 2 నుండి 3 వారాల సమయం పడుతుంది.

3. గాలికి వేలాడదీయడం (Air Drying)

ఎలాంటి కెమికల్స్ వాడకుండా చాలా సహజ పద్ధతిలో Dried Flower Art and Craft డిజైన్లు చేయాలనుకుంటే ఈ పద్ధతి వాడుకోవచ్చు.

  • పూల కాండాలను ఒక దారంతో లేదా రబ్బర్ బ్యాండ్ తో గట్టిగా కట్టాలి.
  • సూర్యరశ్మి నేరుగా తగలని, గాలి బాగా ఆడే ఒక చీకటి గదిలో ఈ పూల కట్టలను తలకిందులుగా (కాడలు పైకి, పూలు కిందికి ఉండేలా) వేలాడదీయాలి.
  • నేరుగా ఎండ తగిలితే పూల రంగు వెలిసిపోతుంది. ఈ పద్ధతిలో పూలు పూర్తిగా ఎండటానికి కనీసం 15 నుండి 20 రోజులు పడుతుంది. ఇవి కాస్త వింటేజ్ (Vintage) లేదా పాతకాలపు లుక్ లో కనిపిస్తాయి.

కావలసిన వస్తువులు మరియు వాటి ఖర్చు (Materials & Tools Breakdown)

ఈ వ్యాపారం ప్రారంభించడానికి పెద్దగా ఖరీదైన సామాన్లు ఏవీ అవసరం లేదు. కేవలం ₹2,000 నుండి ₹10,000 బడ్జెట్‌తోనే ఈ బిజినెస్ ని మీ ఇంట్లోనే ఒక చిన్న గది నుండి చాలా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు.

వస్తువు పేరు (Material Name)ఉపయోగం (Purpose)అంచనా ఖర్చు (Approximate Cost in INR)
Fine Silica Gel Crystalsపూలలోని తేమను పూర్తిగా లాగేసి రంగు కాపాడటానికి₹400 – ₹700 / కేజీ
Epoxy Resin & Hardenerపూలను గట్టి ప్లాస్టిక్ లాంటి ఆకృతిలో భద్రపరచడానికి₹700 – ₹1,200 / లీటర్
Silicone MoldsCircle, Hexagon, Heart వంటి షేపుల్లో Resin పోయడానికి వాడే అచ్చులు₹200 – ₹800
Airtight ContainersSilica Gel లో వేసిన పూలను గాలి తగలకుండా ఉంచే డబ్బాలు₹150 – ₹400
Tweezersచేతి వేళ్లు తగలకుండా పూలను సున్నితంగా పట్టుకోవడానికి₹100 – ₹200
Mod Podge / Sealerపూల రేకులపై రక్షణ పొరను ఏర్పాటు చేయడానికి₹200 – ₹350
Double Glass Framesప్రెస్ చేసిన పూలను భద్రపరచడానికి వాడే ఫ్రేమ్స్₹250 – ₹600
Safety Gear (Mask & Gloves)Resin మిక్స్ చేసేటప్పుడు వచ్చే వాసనల నుండి రక్షణ కోసం₹300 – ₹500

ఈ వస్తువులన్నీ ఆన్‌లైన్ లో (Amazon, Flipkart) లేదా మీ సిటీలో ఉండే పెద్ద క్రాఫ్ట్ షాపుల్లో చాలా ఈజీగా దొరుకుతాయి. మొదట్లోనే ఎక్కువ క్వాంటిటీ లో సామాన్లు కొనకుండా, కేవలం ప్రాక్టీస్ చేయడానికి సరిపడా కొద్దిగా కొనుగోలు చేయడం చాలా మంచిది. ప్రాక్టికల్ గా ఆలోచించి తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టి, ఆర్డర్లు పెరిగే కొద్దీ సామాన్లు ఎక్కువగా కొనుగోలు చేయండి.

ప్రొడక్ట్స్ తయారు చేసే పూర్తి ప్రాసెస్ (Step-by-Step Crafting Process)

Dried Flower Art and Craft లో చాలా రకాల వెరైటీలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్ ని ఇంట్లోనే ఎలా చేయాలో స్టెప్స్ లేకుండా చాలా వివరంగా తెలుసుకుందాం.

రెసిన్ ఫ్లవర్ ప్రిజర్వేషన్ (Resin Flower Preservation)

ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ లో ఈ Resin Flower Preservation Business కి జనాలు బాగా ఆకర్షితులవుతున్నారు. పెళ్లి పూల మాలలను ఇలా దాచుకోవడానికి ముందే ఆర్డర్లు బుక్ చేసుకుంటున్నారు. దీని తయారీ విధానం చాలా జాగ్రత్తగా, ఓపికగా చేయాల్సి ఉంటుంది.

మొదటగా మీ Silicone Mold సైజ్ ని బట్టి ఎంత కెమికల్ కావాలో కొలవాలి. Epoxy Resin మరియు Hardener లను బాటిల్ పై రాసి ఉన్న రేషియో (ఉదాహరణకు 2:1 లేదా 3:1) ప్రకారం కచ్చితమైన డిజిటల్ వేయింగ్ స్కేల్ (Digital Weighing Scale) పై బరువు కొలిచి మాత్రమే తీసుకోవాలి. చాలా మంది కంటిచూపుతో లేదా కొలత కప్పులతో రఫ్ గా కొలుస్తుంటారు, అలా చేస్తే Resin అస్సలు గట్టిపడదు. అది ఒక జిగురు లాగా ఉండిపోయి మన సామాన్లు మరియు కస్టమర్ ఇచ్చిన పూలు కూడా వృధా అవుతాయి.

కొలిచిన రెండు ద్రవాలను ఒక ప్లాస్టిక్ కప్పులో పోసి, ఒకే దిశలో (Single Direction) చాలా నెమ్మదిగా కనీసం 3 నుండి 5 నిమిషాల పాటు కలపాలి. స్పీడ్ గా లేదా జిగ్‌జాగ్‌గా కలిపితే లోపల వేలాది గాలి బుడగలు (Air Bubbles) ఏర్పడతాయి. కలిపిన మిశ్రమాన్ని Silicone Mold లో సగం ఎత్తు వరకు నిదానంగా పోయాలి. పోసిన తర్వాత ఉపరితలంపై ఉండే బుడగలను తొలగించడానికి ఒక Heat Gun లేదా గ్యాస్ లైటర్ సహాయంతో దూరం నుండి వేడిని చూపించాలి. దీనివల్ల బుడగలన్నీ పగిలిపోయి నీరు లాంటి క్లియర్ లుక్ వస్తుంది.

ఈ మొదటి లేయర్ ని కనీసం 8 నుండి 12 గంటల పాటు దుమ్ము పడని ఒక గదిలో కదపకుండా వదిలేయాలి. అది కొద్దిగా గట్టిపడి జెల్లీ లాంటి రూపానికి రావాలి. ఇప్పుడు మనం ఎండబెట్టుకున్న పూలను చాలా జాగ్రత్తగా Tweezers తో పట్టుకుని డిజైన్ ప్రకారం అమర్చాలి. పూల అడుగు భాగంలో కొద్దిగా పచ్చి Resin ని అంటించి మోల్డ్ లో ఉంచితే, అవి పైకి తేలకుండా ఒకే చోట స్థిరంగా అతుక్కుపోతాయి.

పూలు అమర్చిన తర్వాత, మిగిలిన సగం మోల్డ్ ని కవర్ చేస్తూ రెండో లేయర్ Resin ని నెమ్మదిగా పోయాలి. పూల రేకుల కింద గాలి బుడగలు పేరుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక టూత్‌పిక్ (Toothpick) తో ఆ బుడగలను మెల్లగా పైకి లాగి క్లియర్ చేయాలి. ఈ మొత్తం ప్రొడక్ట్ పై దుమ్ము పడకుండా ఒక ప్లాస్టిక్ ట్రేని బోర్లించి కప్పి ఉంచాలి. కనీసం 24 నుండి 48 గంటల పాటు దాన్ని అస్సలు కదపకూడదు. పూర్తిగా గట్టిపడిన తర్వాత Silicone Mold నుండి మెల్లగా బయటకు తీయాలి. ఆ గ్లాస్ లాంటి ఫినిషింగ్, లోపల అమర్చిన పూల అందం చూస్తే ఎవరికైనా నచ్చాల్సిందే.

డబుల్ గ్లాస్ ఫ్రేమ్స్ (Double Glass Frames)

ఎవరికైనా బుక్‌మార్క్‌లు లేదా ఫోటో ఫ్రేములు గిఫ్ట్ గా ఇవ్వడానికి ఈ పద్ధతి చాలా బాగుంటుంది. తక్కువ ఖర్చుతో స్టార్ట్ చేసే Low Investment Business Ideas లో ఇది ఒక wonderful ఐడియా.

మొదటగా మీ Double Glass Frames ని గ్లాస్ క్లీనర్ సహాయంతో దుమ్ము, వేలిముద్రలు లేకుండా నీట్ గా తుడవాలి. గ్లాస్ పైన ముందుగా ప్రెస్ చేసిన పూలను అమర్చి ఒక మంచి డిజైన్ కాంబినేషన్ ని సెట్ చేసుకోండి. ఏ పువ్వు ఎక్కడ ఉంటే బాగుంటుందో ఒక మొబైల్ ఫోన్ లో ఫోటో తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఒకసారి గ్లూ అంటించిన తర్వాత వాటిని మార్చడం చాలా కష్టం. ఎవరికీ లేని ఒక కొత్త క్రేజ్ క్రియేట్ చేయడానికి ఈ Unique Gift Making Business చాలా బాగా ఉపయోగపడుతుంది.

చాలా తక్కువ పరిమాణంలో Mod Podge లేదా క్లియర్ క్రాఫ్ట్ గ్లూని పూల వెనుక భాగంలో Tweezers తో అప్లై చేసి గ్లాస్ పై చాలా సున్నితంగా అతికించాలి. ఎక్కువ గ్లూ వాడితే అది పక్కల నుండి బయటకు వచ్చి గ్లాస్ అంతా చండాలంగా కనిపిస్తుంది. గ్లూ ఆరిపోయిన తర్వాత, రెండో గ్లాస్ ని దానిపై ఉంచి ఫ్రేమ్ ని జాగ్రత్తగా ఫిక్స్ చేయాలి. గాలి చొరబడకుండా వెనుక భాగంలో సిలికాన్ సీలెంట్ వేసి సీల్ చేయడం వల్ల లోపల ఉన్న పూలు ఎప్పటికీ తేమ తగలకుండా, రంగు పాడవకుండా ఉంటాయి. ఇది కేవలం ఒక క్రాఫ్ట్ మాత్రమే కాదు, ఇంట్లో చేసుకునే ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా.

ఈ ఉత్పత్తులను ఎక్కడ మరియు ఎలా అమ్మాలి? (Where and How to Sell)

చాలా మంది ప్రొడక్ట్స్ ని చాలా అందంగా తయారు చేస్తారు కానీ How to sell handmade gifts online అనే మార్కెటింగ్ ఐడియా తెలియక అక్కడే ఆగిపోతారు. మనం తయారు చేసిన ప్రొడక్ట్స్ ని కస్టమర్లకి ఎలా అమ్మాలో కొన్ని ఈజీ టిప్స్ చూద్దాం.

Etsy మరియు Amazon Handmade ద్వారా అమ్మడం

ఈ ప్లాట్‌ఫారమ్స్ ద్వారా మన ప్రొడక్ట్స్ ని గ్లోబల్ మార్కెట్ కి పరిచయం చేయవచ్చు.

  • Etsy: ఇది హ్యాండ్‌మేడ్ మరియు వింటేజ్ వస్తువులకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ ప్లేస్. ఇక్కడ అమెరికా, యూరప్ వంటి విదేశీ కస్టమర్లు చేతితో చేసిన వస్తువులకు వందల డాలర్లు చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. మీకంటూ ఒక ఆన్‌లైన్ షాప్ క్రియేట్ చేసి, మీ ఉత్పత్తులను మంచి ఫోటోలతో లిస్ట్ చేయండి. హ్యాపీగా ఇంట్లో కూర్చుని ఈ Online Income From Home ద్వారా మంచి విదేశీ కరెన్సీ సంపాదించవచ్చు.
  • Amazon Handmade: సాధారణ అమెజాన్ లో కూడా హ్యాండ్‌మేడ్ వస్తువుల కోసం ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఉంది. మీరు అక్కడ కూడా మీ ఉత్పత్తులను అమ్మవచ్చు. అమెజాన్ కి కస్టమర్ బేస్ ఎక్కువ కాబట్టి, ఆర్డర్లు త్వరగా వచ్చే అవకాశం ఉంది.

Instagram లో ఆర్గానిక్ సేల్స్

ఈ కాలంలో సోషల్ మీడియాను సరిగ్గా వాడుకోవడమే బెస్ట్ “Handmade Flower Gifts marketing” tips కంటెంట్ కుడా చెయ్యచ్చు.

  • మీ ప్రొడక్ట్స్ ని తయారు చేసే విధానాన్ని (Behind the Scenes), ప్యాకింగ్ చేసే విధానాన్ని చిన్న చిన్న Reels రూపంలో రికార్డ్ చేసి పోస్ట్ చేయండి. మంచి ట్రెండింగ్ సాంగ్స్ ని బ్యాక్‌గ్రౌండ్ లో వాడితే రీల్స్ త్వరగా వైరల్ అవుతాయి.
  • ఫోటోలు ఎప్పుడూ పగటిపూట సహజమైన వెలుతురులో (Natural Light) మాత్రమే తీయాలి. కిటికీ పక్కన లేదా బాల్కనీలో వైట్ బ్యాక్‌గ్రౌండ్ పెట్టి ఫోటోలు తీస్తే ప్రొడక్ట్ చాలా లగ్జరీగా కనిపిస్తుంది.
  • మీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ బయో లో మీ వాట్సాప్ బిజినెస్ నెంబర్ లేదా మీ ఆన్‌లైన్ స్టోర్ లింక్ ఇవ్వడం మర్చిపోవద్దు. దీనివల్ల కస్టమర్లు డైరెక్ట్‌గా డీఎం (DM) ద్వారా కూడా ఆర్డర్లు ఇస్తారు.

ప్రభుత్వ పథకాలతో వ్యాపారాన్ని పెంచడం ఎలా? (Scaling with Government Schemes)

వ్యాపారం చిన్నగా మొదలుపెట్టి కొంచెం ఎక్స్ పీరియన్స్ వచ్చాక, దాన్ని పెద్ద బ్రాండ్ గా మార్చడానికి ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని మరియు సబ్సిడీలను ఎలా వాడుకోవాలో చూద్దాం.

PM Mudra Loan (పీఎం ముద్రా యోజన)

ఎలాంటి గ్యారెంటీ లేదా సెక్యూరిటీ లేకుండా వ్యాపార విస్తరణ కోసం ప్రభుత్వ బ్యాంకులు ఇచ్చే లోన్ ఇది. ఇందులో మూడు కేటగిరీలు ఉంటాయి:

  • శిశు (Shishu): కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి రూ. 50,000 వరకు లోన్ ఇస్తారు. మన బేసిక్ సామాన్లు కొనడానికి ఇది సరిపోతుంది.
  • కిషోర్ (Kishore): వ్యాపారాన్ని కొద్దిగా పెంచడానికి రూ. 50,000 నుండి రూ. 5 లక్షల వరకు లోన్ లభిస్తుంది.
  • తరుణ్ (Tarun): పెద్ద ఎత్తున షాప్ పెట్టడానికి లేదా విస్తరించడానికి రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది.

PMEGP (Prime Minister’s Employment Generation Programme)

గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో కొత్తగా సొంతంగా చిన్న పరిశ్రమలు పెట్టడానికి ఈ పథకం చాలా బాగా ఉపయోగపడుతుంది.

  • ఈ పథకం కింద ఉత్పత్తి రంగానికి (Manufacturing) రూ. 50 లక్షల వరకు లోన్ ఇస్తారు.
  • ఇందులో అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏంటంటే సబ్సిడీ! మీరు గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళ అయితే ప్రాజెక్ట్ ఖర్చులో 35% వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అంటే మీరు రూ. 5 లక్షలు లోన్ తీసుకుంటే, అందులో సుమారు రూ. 1.75 లక్షలు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది, మిగిలిన డబ్బులు మాత్రమే మీరు ఈఎంఐ రూపంలో కడితే సరిపోతుంది.

PM Vishwakarma Scheme

సాంప్రదాయ హస్తకళాకారులు మరియు చేతివృత్తుల వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన లేటెస్ట్ పథకం ఇది.

  • ఈ పథకం కింద క్రాఫ్ట్ మేకర్స్ మరియు ఆర్టిసాన్స్ కి రూ. 3 లక్షల వరకు చాలా తక్కువ వడ్డీ రేటుకే (కేవలం 5%) రుణం అందిస్తారు. మహిళా క్రాఫ్టర్స్ ని ప్రోత్సహించడానికి వచ్చే ఈ స్కీమ్స్ తో మనకి బ్యాంకులు కూడా త్వరగా లోన్స్ ఇస్తాయి.

ప్యాకేజింగ్ మరియు డెలివరీ గైడ్ (Secure Packaging & Delivery)

మనం ఎంత కష్టపడి అందమైన ప్రొడక్ట్ తయారు చేసినా, అది కొరియర్ లో కస్టమర్ కి చేరేసరికి పగిలిపోతే మాత్రం చేసిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ప్యాకింగ్ గట్టిగా లేకపోతే రవాణాలో డ్యామేజ్ అయ్యి, కస్టమర్ కి రీఫండ్ ఇవ్వాల్సి వస్తుంది. దీనివల్ల మనకి పెద్ద నష్టం వస్తుంది.

  • బట్టర్ పేపర్ చుట్టడం: మొదటగా మన ప్రొడక్ట్ ని సాఫ్ట్ Butter Paper లో చుట్టాలి. దీనివల్ల ప్రొడక్ట్ పై ఎలాంటి గీతలు (Scraches) పడవు.
  • బబుల్ రాపింగ్: ఆ తర్వాత కనీసం 3 నుండి 4 లేయర్స్ దట్టమైన Bubble Wrap ని చుట్టి అన్ని మూలలను గట్టిగా ప్యాకింగ్ టేప్ తో సీల్ చేయాలి.
  • తేమ నివారణ: కొరియర్ బాక్స్ లోపల ఒక చిన్న Silica Gel Sachet వేయాలి. రవాణా సమయంలో బాక్స్ లోపల ఏర్పడే తేమను ఇది పీల్చుకుని ప్రొడక్ట్ ని కాపాడుతుంది.
  • డబుల్ బాక్స్ పద్ధతి: బబుల్ రాప్ చేసిన ప్రొడక్ట్ ని ఒక చిన్న కార్డ్‌బోర్డ్ బాక్స్ లో పెట్టాలి. బాక్స్ లోపల ఖాళీ స్థలం లేకుండా పేపర్ ముక్కలు లేదా Thermocol షీట్లు గట్టిగా నింపాలి. ఇప్పుడు ఈ చిన్న బాక్స్ ని, దీనికంటే కొద్దిగా పెద్దగా ఉన్న ఇంకొక గట్టి కొరియర్ బాక్స్ లో ఉంచి, చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో థర్మాకోల్ వేసి గట్టిగా ప్యాక్ చేసి సీల్ చేయాలి. దీనివల్ల కొరియర్ వారు బాక్స్ ని కింద పడేసినా లోపల ఉన్న ప్రొడక్ట్ కి ఏమీ కాదు.

బిగినర్స్ చేసే కామన్ తప్పులు (Troubleshooting Challenges)

ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే కొందరు బిగినర్స్ చేసే చిన్న చిన్న తప్పుల గురించి తెలుసుకుని వాటిని ముందే నివారించాలి.

  • పూలు కుళ్ళిపోవడం: సరిగ్గా ఆరని పూలను Resin లో వేస్తే అవి లోపల తేమ ఉండిపోవడం వల్ల మెల్లగా కుళ్ళిపోయి బ్రౌన్ కలర్ లోకి మారిపోతాయి. కాబట్టి పూలను Silica Gel నుండి తీశాక అవి పూర్తిగా పేపర్ లాగా డ్రైగా మారాయో లేదో చేత్తో తాకి చూసుకోవాలి.
  • రంగు మారిపోవడం మరియు ట్రాన్స్‌పరెంట్‌గా అవ్వడం: కొన్ని రకాల పూలు, ముఖ్యంగా ఎరుపు గులాబీలు (Red Roses) లేదా తెల్లటి చామంతులు, రెసిన్ వేయగానే వాటి సహజ సిద్ధమైన రంగును పూర్తిగా కోల్పోతాయి. లేదా రంగు మారిపోయి తడిసిపోయిన కాగితంలాగా ట్రాన్స్‌పరెంట్‌గా (Translucent) అయిపోతాయి. దీనికి గల శాస్త్రీయ కారణం ఏంటంటే, రెసిన్‌లోని కెమికల్స్ పూల రేకుల్లో ఉండే పచ్చని పిగ్మెంట్స్‌తో నేరుగా రియాక్ట్ అవుతాయి. అంతేకాకుండా, రెసిన్ మరియు హార్డనర్ కలిపినప్పుడు అది గట్టిపడే ప్రాసెస్‌లో (Curing process) కొద్దిగా వేడి పుడుతుంది. ఈ వేడి వల్ల కూడా పూల అసలు రంగు దెబ్బతింటుంది.
    • దీని నివారణ మార్గం (How to Prevent This): దీనికి ఒకటే సులువైన పరిష్కారం… పూలను రెసిన్‌లో వేయడానికి ముందే వాటిపై ఒక రక్షణ పొరను (Protective Shield) క్రియేట్ చేయాలి. ఇందుకోసం మంచి బ్రాండ్ Mod Podge Clear Acrylic Sealer Spray ని ఉపయోగించాలి.
    • స్ప్రే చేసే సరైన పద్ధతి: ఎండిన పూలను ఒక సాఫ్ట్ పేపర్ పై దూరం దూరంగా అమర్చాలి. ఇప్పుడు స్ప్రే క్యాన్ ని తీసుకొని కనీసం 10 నుండి 12 ఇంచుల దూరం నుండి చాలా లైట్‌గా, సన్నటి మంచు కురిసినట్లు పూల రేకులపై స్ప్రే చేయాలి. మరీ దగ్గరగా పెట్టి ఎక్కువ కెమికల్ స్ప్రే చేస్తే రేకులు తడిసిపోయి ముడుచుకుపోతాయి. ఒక కోట్ వేసాక కనీసం 15 నుండి 20 నిమిషాలు ఫ్యాన్ కింద ఆరనివ్వాలి. ఆ తర్వాత పూలను సున్నితంగా వెనుక వైపుకి తిప్పి మరో కోట్ స్ప్రే చేయాలి. ఇలా రెండు వైపులా డబుల్ కోటింగ్ (Double Coat) వేసి పూర్తిగా ఎండిన తర్వాతే రెసిన్ లో వాడాలి.
    • ముందుగా టెస్టింగ్ చేయండి: ఒకరి జీవితకాలపు పెళ్లి పూలు లేదా కస్టమర్లు ఇచ్చిన మెయిన్ పూల మీద నేరుగా ప్రయోగాలు చేయకండి. డెమో కోసం మీ దగ్గర ఉన్న రఫ్ పూల రేకులపై ముందుగా Mod Podge స్ప్రే చేసి, రెసిన్ లో వేసి టెస్ట్ చేసుకోండి. ఆర్డర్ నీట్ గా వస్తుందని నమ్మకం కుదిరాకే మెయిన్ ప్రొడక్ట్ స్టార్ట్ చేయడం చాలా ఉత్తమం.
  • అంటుకునేలా ఉండటం: Resin మరియు Hardener రేషియో కొద్దిగా అటుఇటైనా ప్రొడక్ట్ అస్సలు గట్టిపడదు. అది రబ్బరు లాగా వంగిపోతుంది లేదా చేతికి అంటుకుంటూ జిగటగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ మంచి క్వాలిటీ డిజిటల్ వేయింగ్ స్కేల్ మాత్రమే ఉపయోగించి గ్రాముల లెక్కన కొలవాలి.

My Simple Words for YOU!

ఇంట్లోనే ఉంటూ ఒక చిన్న క్రియేటివ్ పనితో మంచి లాభాలు పొందాలనుకునే వాళ్ళకి ఈ డ్రైడ్ ఫ్లవర్ క్రాఫ్ట్ బిజినెస్ ఒక అద్భుతమైన అవకాశం. ఎటువంటి టెన్షన్లు లేకుండా, మనకున్న క్రియేటివిటీని వాడుకుంటూనే చాలా సులభంగా ఇందులో రాణించవచ్చు. మీ వర్క్ లో మంచి ఫినిషింగ్ చూపిస్తే చాలు, ఈ సోషల్ మీడియా రోజుల్లో కస్టమర్లే వెతుక్కుంటూ వచ్చి ఆర్డర్లు ఇస్తారు. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలను వాడుకుని ఈ వ్యాపారాన్ని పెద్ద స్థాయిలో నిర్మించుకోండి. All the Best!

Shiv shankar

Mr. Shiv Shankar is an independent freelancer and digital specialist with over 7 years of hands-on experience working across multiple global freelancing platforms. Throughout his career, he has collaborated with startups, entrepreneurs, and growing online businesses to build efficient digital systems that improve performance, visibility, and long-term growth.His work focuses on practical solutions in areas such as website development, workflow automation, search engine optimization (SEO), and digital optimization strategies. By combining technical knowledge with a problem-solving mindset, Shiv helps businesses streamline operations, strengthen their online presence, and scale more efficiently in competitive digital environments.Over the years, he has contributed to numerous web projects, automation systems, and optimization initiatives across diverse industries. His approach prioritizes simplicity, reliability, and measurable results—ensuring that businesses can operate smarter rather than harder.Beyond client work, Shiv actively explores emerging technologies, automation frameworks, and digital growth strategies. He shares insights and practical knowledge to help entrepreneurs and organizations adapt to the rapidly evolving online ecosystem.With a strong foundation in real-world freelance experience and a commitment to continuous improvement, Mr. Shiv Shankar remains dedicated to delivering impactful digital solutions that empower businesses to grow sustainably in the modern web landscape.

Leave a Comment