LinkedIn Job Automation in Telugu – రోజూ Jobs కి Manually Apply చేసి చేసి అలసిపోయారా? ఇప్పుడు AI మీ తరపున Apply చేస్తుంది!

LinkedIn Job Automation in Telugu – రోజూ Jobs కి Manually Apply చేసి చేసి అలసిపోయారా? ఇప్పుడు AI మీ తరపున Apply చేస్తుంది!

నేను మీకు ఒక విషయం చెప్పాలి.

నాకు Coding రాదు. Programming అంటే ఏమిటో నాకు సరిగ్గా తెలియదు. JavaScript అంటే ఏదో ఒక Language అని తెలుసు, కానీ ఒక్క line కూడా నేను రాయలేను.

అయినా సరే, నేను ఈ రోజు మీకు చెప్పబోతున్న System నేను Build చేశాను. పూర్తిగా. ఒంటరిగా. ఒక్క Rupee కూడా ఖర్చు పెట్టకుండా.

ఎలా అంటే, Claude AI FREE గా వాడుకున్నాలెండి.

Claude.ai కి వెళ్ళండి. అది Free. అక్కడ మీకు ఏమి అర్థం కాకపోయినా అడగండి. అది Telugu లో కూడా Explain చేస్తుంది. ఈ Blog లో ఏదైనా Doubt వస్తే, ఈ Blog మొత్తం Copy చేసి Claude కి Paste చేయండి. అడగండి. అది మీకు Guide చేస్తుంది.

ఇప్పుడు మీకు ఒక్క Question అడుగుతాను.

మీరు LinkedIn తెరిచి, Jobs వెతికి, ఒక్కో Job చదివి, Resume Attach చేసి, Apply Button నొక్కుతున్నారా? రోజూ? గంటలు గంటలు?

అయితే ఈ Blog మీ కోసమే.

LinkedIn Job Automation అంటే ఏమిటి? Complete గా అర్థం చేసుకోండి

చాలా మంది Automation అంటే Coding అనుకుంటారు. కానీ అది కాదు.

Automation అంటే, మీరు చేసే Repetitive పనులు ఒక System చేయడం. మీరు రోజూ LinkedIn తెరిచి Jobs చూస్తారు కదా, అదే పని ఒక System చేయడం. మీరు Resume Attach చేస్తారు కదా, అది కూడా System చేయడం.

ఈ Blog లో మనం Build చేయబోతున్న System ఏమి చేస్తుందంటే:

మీరు ఒక చిన్న Form Fill చేస్తారు. మీరు ఏ Job వెతుకుతున్నారో, ఏ City లో, ఏ Type Job కావాలో అని. అంతే. మిగతాది అంతా ఈ System చేస్తుంది.

ఏం చేస్తుందంటే, LinkedIn లో Active గా ఉన్న Jobs Scrape చేస్తుంది. అంటే వెతికి తీసుకొస్తుంది. తర్వాత మీ Resume చూసి, మీ Skills తో ఆ Job Match అవుతుందా లేదా అని AI Check చేస్తుంది. Match అయిన Jobs కి మీ Resume ని ఆ Job కి Specific గా Rewrite చేస్తుంది. ఆ Company లో Decision తీసుకునే వ్యక్తి Email వెతుకుతుంది. Directly వాళ్ళ Email కి మీ Resume Attach చేసి Mail పంపిస్తుంది.

ఒక్క Click తో. మీరు లేకుండా.

ఇది Job Application Automation without Coding Telugu లో Build చేయగలిగే System. ఒక్క Rupee కూడా Basic Setup కి అవసరం లేదు.

Complete guide on LinkedIn job automation in Telugu showing how to automatically apply for thousands of jobs using n8n and Claude AI with a single click.

ఈ System Build చేయడానికి ముందు, ఈ Table చూడండి

Node to Node flow మొత్తం ముందు అర్థం చేసుకోండి. తర్వాత Step by Step చేద్దాం.

StepNode Nameఏం చేస్తుందంటేతర్వాత ఎక్కడికి వెళ్తుందంటే
1Form Triggerమీరు Fill చేసిన Job Details తీసుకుంటుందిEdit Fields కి
2Edit Fieldsకావాల్సిన 3 Fields మాత్రమే తీసుకుంటుందిCode Node కి
3Code NodeLinkedIn Search URL తయారు చేస్తుందిGet Resume Template కి
4Get Resume TemplateGoogle Docs నుంచి మీ Resume తీసుకుంటుందిScrape LinkedIn Jobs కి
5Scrape LinkedIn JobsApify వాడి LinkedIn Jobs Scrape చేస్తుందిWait కి
6Wait3 Minutes వేచి ఉంటుందిHTTP Request కి
7HTTP RequestScrape అయిన Jobs Data తీసుకుంటుందిLimit Results కి
8Limit ResultsTesting కోసం 1 Job మాత్రమే తీసుకుంటుందిFilter Jobs with AI కి
9Filter Jobs with AIమీ Skills Match అవుతాయా అని Check చేస్తుందిFilter True and Website కి
10Filter True and WebsiteMatch అయిన Jobs మాత్రమే తీసుకుంటుందిRewrite Resume కి
11Rewrite Resumeఆ Job కి Specific గా Resume మారుస్తుందిMarkdown to HTML కి
12Markdown to HTMLResume Format సరిగ్గా చేస్తుందిCreate New Resume కి
13Create New Resumeకొత్త Google Doc Create చేస్తుందిUpdate a Document కి
14Update a DocumentResume Content ఆ Doc లో పెడుతుందిGet Email కి
15Get EmailDecision Maker Email వెతుకుతుందిShare Resume కి
16Share ResumeGoogle Drive నుంచి Resume Download చేస్తుందిCreate Draft Email కి
17Create Draft EmailResume Attach చేసి Mail పంపిస్తుందిDone

ఇది చూసి Panic అవ్వకండి. ఒక్కో Step చాలా Simple గా ఉంటుంది. Claude ఉంది కదా.

How to Apply Jobs Automatically Using n8n – మనకు కావాల్సిన Tools

Tools List and Cost

Toolఏం చేస్తుందంటేఎక్కడ దొరుకుతుందంటేCost
n8nAutomation Platformn8n.ioFree Self-hosted
Claude AIమీ Free Guideclaude.aiFree
ApifyLinkedIn Scraperapify.com3 Days Free Trial
AnyMailFinderDecision Maker Emailanymailfinder.comFree Credits
Google DocsResume Storagedocs.google.comFree
Google DriveResume Downloaddrive.google.comFree
GmailEmail Sendinggmail.comFree
OpenAI APIAI Filtering and Rewritingplatform.openai.comFree Credits

ఇవన్నీ Free. కానీ Apify కి 3 Days Free Trial మాత్రమే. తర్వాత Paid అవుతుంది. Testing కి 3 Days చాలు.

Build చేయడానికి ముందు ఒక్క పని చేయండి

మీ Resume Google Docs లో పెట్టుకోండి. ఇది చాలా Important.

Google Docs తెరవండి. New Document Create చేయండి. మీ Resume అక్కడ Paste చేయండి. ఆ Document తెరిచి Address Bar లో URL కనిపిస్తుంది కదా, అది Copy చేయండి. పక్కన పెట్టుకోండి. Step 4 లో అది కావాలి.

n8n Automation Tutorial for Beginners in Telugu – Step by Step Node Setup

Step 1: Form Trigger Node

n8n తెరవండి. New Workflow Create చేయండి. ఇప్పుడు మొదటి Node Add చేయాలి.

Search Bar లో “n8n form” అని Type చేయండి. “On Form Submission” అనే Node కనిపిస్తుంది. దాన్ని Click చేయండి.

ఇప్పుడు ఈ Node లో Form Fields Add చేయాలి.

Field LabelField TypeExample
Job TitleTextBackend Developer
Job LocationTextHyderabad
Job TypeDropdownFull-time

Job Type Dropdown లో ఈ Options Add చేయండి.

Dropdown Options
Full-time
Part-time
Internship
Contract

Form Title ఏదైనా ఇవ్వండి. Example: “Get Latest Job Postings” అని ఇవ్వొచ్చు.

Node Connection:

Form Trigger Node ➜ Edit Fields Node

Step 2: Edit Fields Node (Set Node)

Form నుంచి చాలా Data వస్తుంది. Submitted Time, Form Mode, అన్నీ వస్తాయి. కానీ మనకు కావాల్సింది మూడే.

Search Bar లో “Edit Fields” అని Type చేయండి. Pencil Symbol ఉన్న Node కనిపిస్తుంది. దాన్ని తీసుకోండి.

ఇప్పుడు Form Trigger Node Execute చేయండి. Test Form తెరుచుకుంటుంది. అక్కడ ఒక్కసారి Details Fill చేసి Submit చేయండి. అప్పుడు Output లో Data కనిపిస్తుంది.

ఆ Output లో నుంచి ఈ మూడు Fields Map చేయండి.

Field NameMap చేయాల్సిన Value
Job TitleForm లో Job Title
Job LocationForm లో Job Location
Job TypeForm లో Job Type

Node Connection:

Edit Fields Node ➜ Code Node

Step 3: Code Node – LinkedIn Search URL తయారు చేయడం

ఇక్కడ JavaScript Code ఉంటుంది. భయపడకండి. మీరు ఒక్క Line కూడా రాయాల్సిన అవసరం లేదు.

Claude.ai కి వెళ్ళి ఈ Message Paste చేయండి:

“Claude, I am building an n8n workflow for LinkedIn Job Automation. I need a JavaScript Code Node that takes Job Title, Job Location and Job Type from the previous node and builds a LinkedIn jobs search URL. Job Type values will be Full-time, Part-time, Internship or Contract. Convert them to LinkedIn URL codes F, P, I, C respectively. Give me the exact code to paste in n8n Code Node.”

Claude మీకు Exact Code ఇస్తుంది. దాన్ని Copy చేసి n8n Code Node లో Paste చేయండి.

LinkedIn URL Code Table:

Job TypeLinkedIn Code
Full-timeF
Part-timeP
InternshipI
ContractC
TemporaryT
VolunteerV

Output లో searchUrl వస్తుంది. ఇది తర్వాత Apify కి వెళ్తుంది.

Step by step workflow nodes explaining how to configure LinkedIn job automation in Telugu for automatic job applications.

Node Connection:

Code Node ➜ Get Resume Template Node

Step 4: Get Resume Template – Google Docs Node

Search Bar లో “Google Docs” అని Type చేయండి. “Get a Document” అనే Node కనిపిస్తుంది. దాన్ని తీసుకోండి.

Credentials Section లో మీ Google Account Connect చేయండి. Google తో Login అవుతుంది. Permission ఇవ్వండి.

ఇప్పుడు “Document ID or URL” అనే Field కనిపిస్తుంది. ఇందాక Copy చేసిన మీ Resume Google Doc URL అక్కడ Paste చేయండి.

Execute Step Click చేయండి. మీ Resume Content Output లో కనిపిస్తుంది. ఇది తర్వాత AI కి వెళ్తుంది.

Node Connection:

Get Resume Template Node ➜ Scrape LinkedIn Jobs Node

Step 5: Scrape LinkedIn Jobs – Apify HTTP Request

ఇక్కడ Apify API Key కావాలి. ఎలా తీసుకోవాలంటే:

Stepచేయాల్సింది
1apify.com కి వెళ్ళండి
2Free Account Create చేసుకోండి
3Left Side లో Settings Click చేయండి
4API and Integrations Click చేయండి
5Create a New Token Click చేయండి
6Token Copy చేసుకోండి

ఇప్పుడు n8n లో Search Bar లో “HTTP Request” Type చేయండి. Node తీసుకోండి.

ఈ Settings చేయండి:

SettingValue
MethodPOST
URLhttps://api.apify.com/v2/acts/bebity~linkedin-jobs-scraper/runs
Query Parameter Nametoken
Query Parameter Valueమీ Apify API Key
Body TypeJSON
Max Results10
Parse Job Descriptiontrue
Parse Company Detailstrue

Body లో searchUrl Value ఏమి పెట్టాలంటే, Code Node నుంచి వచ్చే searchUrl ని Map చేయండి.

Node Connection:

Scrape LinkedIn Jobs Node ➜ Wait Node

Step 6: Wait Node – 3 Minutes

Apify Jobs Scrape చేయడానికి Time పడుతుంది. 3 Minutes Wait చేయాలి.

Search Bar లో “Wait” Type చేయండి. Node తీసుకోండి.

SettingValue
Wait Amount3
UnitMinutes

అంతే. ఈ Node Automatic గా 3 Minutes Wait చేసి తర్వాత Node కి వెళ్తుంది.

Node Connection:

Wait Node ➜ HTTP Request Node

Step 7: HTTP Request Node – Scraped Data తీసుకోవడం

Apify Scrape చేసిన Data తీసుకోవడానికి ఇంకో HTTP Request Node కావాలి.

Scrape LinkedIn Jobs Node నుంచి Dataset ID వస్తుంది. ఆ ID తో ఇక్కడ Request పంపిస్తాం.

SettingValue
MethodGET
URLApify Dataset URL with Dataset ID
Query Parameter 1 Nametoken
Query Parameter 1 Valueమీ Apify API Key
Query Parameter 2 Nameformat
Query Parameter 2 Valuejson

URL లో Dataset ID ని Scrape LinkedIn Jobs Node Output నుంచి Map చేయండి.

Output లో Full Job List వస్తుంది JSON Format లో.

Node Connection:

HTTP Request Node ➜ Limit Results Node

Step 8: Limit Results Node

Testing చేసేటప్పుడు అన్ని Jobs కి Apply చేయడం Waste. ముందు 1 Job Test చేయండి. అన్నీ సరిగ్గా పని చేస్తే తర్వాత Limit పెంచండి.

Search Bar లో “Limit” Type చేయండి. Node తీసుకోండి.

SettingValue
Max Items1 (Testing కి)

తర్వాత 50 Plus కి Apply చేయాలంటే, ఈ Value పెంచండి.

Node Connection:

Limit Results Node ➜ Filter Jobs with AI Node

Step 9: Filter Jobs with AI – Auto Apply LinkedIn Jobs Using AI in Telugu

ఇది చాలా Important Step. ఇక్కడ AI మీ Skills చూసి, Job Description చూసి, Match అవుతుందా లేదా అని చెప్తుంది.

Search Bar లో “OpenAI” Type చేయండి. OpenAI Node తీసుకోండి. మీ OpenAI API Key Add చేయండి.

ఈ Node లో మీ Skills పెట్టాలి. Example:

Your Skill CategoryExample Skills
Automation Toolsn8n, Zapier, Make.com
AI ToolsOpenAI API, Claude AI
ProgrammingJavaScript, Python Basics
DatabasesGoogle Sheets, Airtable
OtherAPI Integration, Webhooks

మీ Skills తో Prompt ఇలా ఉంటుంది. Claude కి ఇలా అడగండి:

“Claude, I need an n8n OpenAI node prompt. It should take a job description and compare it with my skills list. Skills are: (మీ Skills ఇక్కడ పెట్టండి). It should respond only in JSON format with a field called Decision with value true or false. Give me the exact system prompt and user prompt.”

Claude Exact Prompt ఇస్తుంది. దాన్ని Node లో Paste చేయండి.

Output Format:

AI Outputఅర్థం
Decision: trueమీ Skills Match అయ్యాయి
Decision: falseMatch కాలేదు

Node Connection:

Filter Jobs with AI Node ➜ Filter True and Website Node

Step 10: Filter True and Website Node – Switch Node

AI True అని చెప్పిన Jobs మాత్రమే తర్వాత వెళ్తాయి. False అయినవి ఆగిపోతాయి.

Search Bar లో “If” Type చేయండి. IF Node తీసుకోండి.

రెండు Conditions పెట్టాలి:

ConditionValue
Condition 1AI Decision equals true
Condition 2Company Name is not empty

రెండూ True అయినప్పుడు మాత్రమే ముందుకు వెళ్తాం. Company Name ఉండటం అవసరం ఎందుకంటే, Email వెతకాలంటే Company Domain కావాలి.

Node Connection (True Path):

Filter True and Website Node ➜ Rewrite Resume Node

Step 11: Rewrite Resume – AI Resume Customization Automation n8n

ఇది మొత్తం System లో అన్నిటి కంటే Powerful Step.

మీ Resume ఉంది కదా. అది అన్ని Jobs కి Same గా ఉంటుంది. కానీ AI ఆ Resume చదివి, ఆ Specific Job Description చదివి, మీ Resume ని ఆ Job కి Perfect గా Rewrite చేస్తుంది.

Search Bar లో “OpenAI” Type చేయండి. మళ్ళీ ఒక OpenAI Node తీసుకోండి.

Claude కి ఇలా అడగండి:

“Claude, I need an n8n OpenAI node prompt for Resume Rewriting. It should take a job description and my existing resume content, and rewrite my resume to match that specific job. The output should be in Markdown format starting with #. Give me the exact prompts.”

Claude Prompt ఇస్తుంది. Node లో ఇవి Map చేయండి:

InputSource Node
Job DescriptionHTTP Request Node Output
My Resume ContentGet Resume Template Node Output

Node Connection:

Rewrite Resume Node ➜ Markdown to HTML Node

Step 12: Markdown to HTML Node

AI ఇచ్చిన Resume Markdown Format లో ఉంటుంది. దాన్ని Google Docs లో Proper గా పెట్టడానికి HTML కి Convert చేయాలి.

Search Bar లో “Markdown” Type చేయండి. “Markdown to HTML” Node కనిపిస్తుంది.

Node తెరవండి. Operation లో “HTML to Markdown” కాదు, “Markdown to HTML” Select చేయండి.

Input లో Rewrite Resume Node నుంచి వచ్చిన Content Map చేయండి.

Node Connection:

Markdown to HTML Node ➜ Create New Resume Node

Step 13: Create New Resume – Google Docs Node

ప్రతి Job కి కొత్త Google Doc Create అవుతుంది. ఆ Doc లో Rewritten Resume పెడతాం.

Search Bar లో “Google Docs” Type చేయండి. “Create a Document” Node తీసుకోండి.

SettingValue
Credentialsమీ Google Account
DriveMy Drive
Folderమీకు కావాల్సిన Folder
TitleJob Title (HTTP Request Node నుంచి)

Node Connection:

Create New Resume Node ➜ Update a Document Node

Step 14: Update a Document – Google Docs Node

ఇప్పుడు కొత్త Doc Create అయింది. ఆ Doc లో Resume Content Insert చేయాలి.

Search Bar లో “Google Docs” Type చేయండి. “Update a Document” Node తీసుకోండి.

SettingValue
Credentialsమీ Google Account
Document URLCreate New Resume Node Output ID
ActionInsert
TextMarkdown to HTML Node Output Content

Node Connection:

Update a Document Node ➜ Get Email Node

Step 15: Get Email – AnyMailFinder API – Send Resume Automatically to Decision Makers n8n

ఇక్కడ Decision Maker Email వెతుకుతాం. CEO, Founder, Co-Founder వాళ్ళ Email వెతుకుతాం.

AnyMailFinder API Key ఎలా తీసుకోవాలంటే:

Stepచేయాల్సింది
1anymailfinder.com కి వెళ్ళండి
2Free Account Create చేసుకోండి
3Dashboard లో API Key కనిపిస్తుంది
4Copy చేసుకోండి

Search Bar లో “HTTP Request” Type చేయండి. Node తీసుకోండి.

SettingValue
MethodPOST
URLhttps://api.anymailfinder.com/v5.1/find-email/decision-maker
Header NameAuthorization
Header Valueమీ AnyMailFinder API Key
Body Parameter 1domain = Company Name + .com
Body Parameter 2decision_maker_category = ceo

Node Connection:

Get Email Node ➜ Switch Node (Email Check)

Step 16: Switch Node – Email దొరికిందా లేదా Check చేయడం

Email దొరకకపోవచ్చు. అందుకే Check చేయాలి.

Search Bar లో “Switch” Type చేయండి. Node తీసుకోండి.

ConditionPath
Email Field is not emptyPath 1 – Mail పంపిస్తాం
Email Field is emptyPath 2 – Skip చేస్తాం

Node Connection (Path 1 – Email Found):

Switch Node ➜ Share Resume Node

Step 17: Share Resume – Google Drive Download

Gmail కి Resume Attach చేయడానికి, Google Doc ని Binary Format లో Download చేయాలి.

Search Bar లో “Google Drive” Type చేయండి. “Download a File” Node తీసుకోండి.

SettingValue
Credentialsమీ Google Drive Account
File IDUpdate a Document Node Output Document ID

Output లో Binary File వస్తుంది. ఇది Automatically Gmail కి Attach అవుతుంది.

Node Connection:

Share Resume Node ➜ Create Draft Email Node

Step 18: Create Draft Email – Gmail Node – Google Docs Gmail Automation Using n8n Telugu

చివరి Step. Resume తో Mail పంపడం.

Search Bar లో “Gmail” Type చేయండి. “Send a Message” Node తీసుకోండి. మీ Gmail Account Connect చేయండి.

SettingValue
ToGet Email Node నుంచి వచ్చిన Email
SubjectJob Title
Messageమీ Introduction Email Body

Attachment Add చేయడానికి:

Node లో Options Click చేయండి. “Add Attachments” కనిపిస్తుంది. Click చేయండి. Attachment Field లో Share Resume Node నుంచి వచ్చిన Binary Data పెట్టండి.

Node Connection:

Create Draft Email Node ➜ Done

Workflow Complete.

Complete Node Connection Flow – ఒక్కసారి చూడండి

Form Trigger Node >>> Edit Fields Node >>>  Code Node  >>>  Get Resume Template Node  >>> Scrape LinkedIn Jobs Node  >>>  Wait Node (3 Minutes)  >>>  HTTP Request Node  >>>  Limit Results Node  >>>  Filter Jobs with AI Node  >>>  Filter True and Website Node >>>  (True Path Only) Rewrite Resume Node  >>>  Markdown to HTML Node  >>>  Create New Resume Node  >>>  Update a Document Node  >>>  Get Email Node  >>>  Switch Node (Email Check)  >>>  (Email Found Path) Share Resume Node  >>>  Create Draft Email Node  >>>  Done. Mail Sent.

ఇది Test చేయడానికి Checklist

Build అయ్యాక ఒక్కసారి ఈ List Check చేయండి.

CheckStatus
Google Docs Resume URL PastedDone or Pending
Apify API Key AddedDone or Pending
OpenAI API Key AddedDone or Pending
AnyMailFinder API Key AddedDone or Pending
Gmail Account ConnectedDone or Pending
Google Docs Account ConnectedDone or Pending
Google Drive Account ConnectedDone or Pending
Limit Results Set to 1 for TestingDone or Pending
Workflow Active ONDone or Pending

అన్నీ Done అయిన తర్వాత Form Submit చేయండి. Mail వచ్చిందా Check చేయండి.

LinkedIn Jobs Scraper n8n Apify Tutorial – Common Errors and Solutions

ErrorReasonSolution
Apify Request FailedAPI Key WrongAPI Key మళ్ళీ Copy Paste చేయండి
Google Docs Not FoundURL WrongResume Doc URL మళ్ళీ Check చేయండి
Email Not SentGmail Not ConnectedGmail Credentials మళ్ళీ Add చేయండి
AI Filter Always FalseSkills List EmptyOpenAI Prompt లో Skills Add చేయండి
Wait Node SkippedWorkflow Not SavedSave చేసి మళ్ళీ Test చేయండి

Claude AI తో ఏ Doubt అయినా Solve చేయవచ్చు

ఇది చాలా Important Section. దీన్ని Skip చేయకండి.

మీకు ఈ Workflow Build చేయడం Difficult గా అనిపిస్తే, ఒక్క పని చేయండి.

claude.ai కి వెళ్ళండి. Free Account Create చేసుకోండి.

ఈ Blog మొత్తం Copy చేయండి. Claude కి Paste చేయండి. తర్వాత ఇలా అడగండి:

“Claude, ఈ Blog లో చెప్పిన LinkedIn Job Automation Workflow నాకు n8n లో Build చేయాలి. నా Details అడుగు. నేను చెప్తాను. తర్వాత n8n కి Import చేయగలిగే JSON File Generate చేసి ఇవ్వు.”

Claude మీకు ఏమి అడుగుతుందంటే:

Claude అడిగే Questionమీరు చెప్పాల్సింది
ఏ Job వెతుకుతున్నారు?మీ Job Title
ఏ City లో?మీ City Name
మీ Skills ఏమిటి?మీ Experience and Skills
Apify API Key ఉందా?Yes or No
AnyMailFinder API Key ఉందా?Yes or No
OpenAI API Key ఉందా?Yes or No

మీరు అన్నీ చెప్పాక, Claude మీకు ఒక JSON File ఇస్తుంది.

ఆ JSON File n8n లో Import చేయండి. Workflow Ready అయిపోతుంది.

ఎలా Import చేయాలంటే, n8n లో Top Right Corner లో Menu ఉంటుంది. “Import from File” లేదా “Import from JSON” Option ఉంటుంది. Claude ఇచ్చిన JSON అక్కడ Paste చేయండి. Import Click చేయండి. మీ Workflow Ready.

n8n Workflow Tutorial for Beginners in Telugu – చివరగా ఒక్క విషయం

నేను ఈ System Build చేసినప్పుడు చాలా సార్లు Errors వచ్చాయి. Nodes Connect అవ్వలేదు. API Keys Work అవ్వలేదు. Emails వెళ్ళలేదు.

ప్రతిసారి నేను Claude కి అడిగాను. “ఈ Error వస్తోంది, ఏం చేయాలి?” అని. Claude ప్రతిసారి Solve చేసింది.

నేను Coder కాదు. నాకు Programming రాదు. కానీ ఈ System Work అవుతోంది.

మీరూ చేయగలరు.

Job వెతుకుతున్న ప్రతి Telugu Youth కి ఈ Blog Share చేయండి. ఒక్కడు కాదు, వందమంది Benefits పొందాలి.

మళ్ళీ Doubt వస్తే, Claude.ai తెరవండి. Free. 24 గంటలు Available. Telugu లో కూడా Answer చేస్తుంది.

LinkedIn Job Automation in Telugu తెలుగులో ఇప్పుడు మీకు తెలిసింది. Build చేయండి. మీ Job వెతుకుండంగా మీ System Apply చేస్తుంది.

Leave a Comment