ఇంట్లో కూర్చుని చేసే 100+ Latest Small Business Ideas Telugu లో | Restoration & Digitization Business Ideas
గోడౌన్లో పడేసిన పాత పెట్టెలు, బీరువా అడుగున మూలుగుతున్న ఫైల్స్, మూతపడ్డ షాపుల్లో దుమ్ము పట్టిన బోర్డులు, ఇవన్నీ చూసి “ఇది చెత్త” అనుకుని వదిలేసేవాళ్లే ఎక్కువ మంది. కానీ ఈ చెత్తలోనే డబ్బు దాక్కుని ఉందిరా తమ్ముడు, గుర్తుపట్టేవాడికి. Category 5 మొత్తం ఇదే సూత్రం మీద నడుస్తుంది. మీరు కొత్తగా ఏమీ కనిపెట్టక్కర్లేదు, ఏదో ఒక చోట పడి ఉన్న దాన్ని ఎత్తుకుని, శుభ్రం చేసి, డిజిటల్ చేసి అమ్మితే చాలు. ఈ Restoration & Digitization Business Ideas విభాగం మీకు ప్రత్యేకంగా నచ్చడానికి కారణం ఒక్కటే, ఇక్కడ మీకు పెద్ద పెట్టుబడి అక్కర్లేదు, కావాల్సింది కళ్లు తెరిచి చుట్టూ చూసే తెలివి మాత్రమే. కింద ఉన్న 11 బిజినెస్ ఐడియాలు చదవండి, ఏది మీ ఊరికి, మీ చేతి నైపుణ్యానికి సరిపోతుందో పట్టుకోండి. ఇలాంటి తక్కువ పెట్టుబడి చిన్న వ్యాపార ఆలోచనలు ఇంకా కావాలంటే ఇక్కడ నొక్కు, ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒకటి చేసుకోవాలిగా బ్రదర్. ఇలాంటి small business ideas తెలుగులో మనదగ్గర చాలానే ఉన్నాయి!
Table of Contents
1. Vintage Document Restoration Business: పాత పత్రాలు బతికిస్తే డబ్బులు వస్తాయి
ప్రతి ఇంట్లో ఏదో ఒక మూలన భూమి పత్రాలు, పాత సర్టిఫికెట్లు, పెళ్లి పత్రికలు, ఉత్తరాలు పడి ఉంటాయి. వాటిని ఎవరూ ముట్టుకోరు, ఎందుకంటే ఎలా హ్యాండిల్ చేయాలో ఎవడికీ తెలియదు. ఇదే మీకు గ్యాప్. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల కోసం పెద్ద స్థాయిలో స్కానింగ్ చేసే కంపెనీలు నగరాల్లో ఉన్నాయి, కానీ మీ పక్క వీధిలో ఉన్న తాతయ్య దగ్గర ఉన్న పాత పత్రాలను ఎవడూ పట్టించుకోడు. ఈ Vintage Document Restoration Business కేవలం స్కానింగ్ కాదు, ఇది ఒక కుటుంబం మర్చిపోయిన జ్ఞాపకాన్ని తిరిగి ఇచ్చే పని.
“పత్రం చిరిగిపోతే పారేయాలనుకుంటారు. బతికిస్తే అది కుటుంబానికి జీవితకాల ఆస్తి అవుతుంది.”
Vintage Document Restoration Business ఎందుకు ఖాళీగా ఉన్న మార్కెట్?
నగరాల్లో ఉన్న డాక్యుమెంట్ డిజిటైజేషన్ కంపెనీలు వేల సంఖ్యలో ఫైల్స్ ఉన్న ఆఫీసుల కోసం మాత్రమే పని చేస్తాయి. ఒక్క కుటుంబం దగ్గర ఉన్న 20-30 పత్రాల కోసం వాళ్లు రారు. మీరు సరిగ్గా ఈ మధ్య గ్యాప్‌లో దూరాలి, ఒక్కో కుటుంబాన్ని ఒక్కో క్లయింట్‌గా చూసుకుంటూ పోవాలి బ్రో ! ఇది నచ్చలేదా ? ఐతే కొబ్బరిబోండాలు అమ్ముతావా? సిగ్గుపడకు తమ్ముడూ! పోనీ కొబ్బరి చిప్పలతో యాపారం చేస్తావా ?
Document Restoration బిజినెస్ కి ఏం కావాలి, ఎలా మొదలెట్టాలి?
| సామాను | పని |
|---|---|
| మొబైల్ కెమెరా లేదా స్కానర్ | పత్రాలను క్లియర్‌గా డిజిటల్ చేయడానికి |
| Remini లాంటి AI రిస్టోరేషన్ టూల్ | మసకబారిన అక్షరాలు మళ్లీ కనిపించేలా చేయడానికి |
| క్లౌడ్ స్టోరేజ్ | ఫైల్స్ పోకుండా భద్రం చేయడానికి |
| ఆర్కైవల్ కవర్లు, ఫోల్డర్లు | బాగుచేసిన ఒరిజినల్ కాపీని జాగ్రత్తగా ఇచ్చి పంపడానికి |
కస్టమర్లని ఎక్కడ పట్టుకోవాలి? ఎవడు ఖాళీగా లేడు బ్రో…
60 దాటిన పెద్దలను కలవండి, భూమి పత్రాల గురించి అడగండి. పెళ్లి ఫోటోగ్రాఫర్లతో పరిచయం పెట్టుకోండి, వాళ్ల దగ్గరకు ఇలాంటి రిక్వెస్ట్‌లు వస్తుంటాయి. మీ ఊరి వాట్సాప్ గ్రూప్‌లో ఒక్క పోస్ట్ చాలు, రెండు మంచి రిజల్ట్స్ చూపిస్తే మిగతా వాళ్లు వాళ్లే వస్తారు. గుడి పూజారులతో, పాత రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర పనిచేసే క్లర్క్‌లతో కూడా పరిచయం పెట్టుకోండి, వాళ్లకు ఇలాంటి పనుల గురించి బాగా తెలుసు, వాళ్ల ద్వారానే మీకు రెఫరల్స్ వస్తాయి.
Document Restoration బిజినెస్ లో డబ్బులు ఎలా వస్తాయి అసలు? డబ్బులు ఊరికే రావు తమ్ముడు
సాధారణ స్కానింగ్‌కి ఒక రేటు, చిరిగిన పేజీలను బాగుచేసే రిస్టోరేషన్‌కి ఎక్స్‌ట్రా రేటు, మొత్తం కుటుంబ చరిత్రను ఒక ఆల్బమ్‌గా కట్టి ఇచ్చే ప్రీమియం ప్యాకేజీకి పెద్ద రేటు. ఒక్క ఊరితో మొదలుపెట్టి పక్క మండలాలకు వెళ్లండి. ఈ Family History Products బిజినెస్‌లో రిపీట్ కస్టమర్లు తక్కువే ఉంటారు, కానీ ఒక్కో కుటుంబం తన బంధువులకు రిఫర్ చేస్తుంది, అదే మీ అసలైన మార్కెటింగ్.
ఎక్కడ తప్పు చేస్తారు జనాలు
తొందరపడి ఒరిజినల్ పత్రాన్ని ఎక్కువగా క్లీన్ చేయాలని ప్రయత్నించి పాడు చేసేస్తారు. మొదట డిజిటల్ కాపీ మీద ప్రాక్టీస్ చేయండి, ఒరిజినల్‌ను చివర్లో మాత్రమే జాగ్రత్తగా టచ్ చేయండి. ఒరిజినల్ పత్రం పోతే అది తిరిగి రాదు, అది గుర్తుపెట్టుకోండి.
2. Handwritten Telugu Manuscript Digitization Business: చేతిరాత తెలుగు పుస్తకాలు అమ్మకానికి పనికొస్తాయా అని అడగండి ముందు
మీ నాన్నమ్మ దగ్గర పాత డైరీ ఉందా? వంశవృక్షం రాసిన కాగితం ఉందా? పాత కవిత్వం రాసుకున్న నోట్‌బుక్ ఉందా? ఇవన్నీ ఇప్పుడు ఎవడూ చదవడం లేదు, కానీ విదేశాల్లో ఉన్న తెలుగు కుటుంబాలకు, పరిశోధకులకు ఇలాంటివి బంగారంతో సమానం. ఈ Handwritten Telugu Manuscript Digitization Business చేయడానికి మీకు పెద్ద డిగ్రీ అక్కర్లేదు, ఓపిక, జాగ్రత్త ఉంటే చాలు.
Handwritten Telugu Manuscript Digitization బిజినెస్ ఎందుకసలు మొదలెట్టాలి?
ఒక దారిద్రమైన నిజం ఏంటంటే….. ఈ తరం పెద్దలు పోతే వాళ్ల చేతిరాత పత్రాలను చదవగలిగే వాళ్లు కూడా పోతారు. పాత తెలుగు లిపి, పాత పదజాలం ఇప్పుడు అర్థం చేసుకోగలిగే వాళ్లు తక్కువ మంది మిగిలారు. ఈ Telugu Historical Documents ను ఇప్పుడు కాపాడకపోతే, రేపు శాశ్వతంగా పోతాయి, ఆ తర్వాత ఎంత డబ్బు పెట్టినా వెనక్కి తేలేం.
ఈ పని ఎలా చేయాలంటే
- మీ ఊర్లో పాత చేతిరాత పత్రాలు ఎక్కడ ఉన్నాయో వెతకండి, పర్మిషన్ తీసుకోండి.
- ఫోన్ కెమెరాతో స్కాన్ చేయండి, OCR టూల్స్‌తో టెక్స్ట్‌గా మార్చండి.
- ఒక్కో కుటుంబానికి ఒక్క PDF కలెక్షన్ తయారు చేయండి.
- Amazon KDP లో పబ్లిష్ చేయండి లేదా నేరుగా కుటుంబానికే అమ్మండి.
“పాత చేతిరాత చూసి భయపడకండి, అది మీకు రొటీన్ లేని రెవెన్యూ మోడల్.”
డబ్బులు ఎలా వస్తాయి మరి ?
మొదటిది, డిజిటైజేషన్ సర్వీస్ ఫీజు నేరుగా కుటుంబం నుండి. రెండోది, ఈ Digital Archive Products ను Amazon KDP ద్వారా పబ్లిక్‌గా అమ్మడం, ఎవరైనా ఈ ఊరి చరిత్ర గురించి ఆసక్తి ఉన్నవాళ్లు కొంటారు. మూడోది, యూనివర్సిటీల Telugu Archives Business విభాగాలకు బల్క్‌గా రీసెర్చ్ మెటీరియల్ అమ్మడం. నెలవారీ ఆదాయం ఒక్కసారి రాదు, కానీ ఒక్కసారి మీ దగ్గర 20-30 ఫ్యామిలీ ఆర్కైవ్‌లు తయారైతే, అదే మీ బ్రాండ్‌కి పోర్ట్‌ఫోలియో అవుతుంది.
ఈ Handwritten Telugu Manuscript Digitization బిజినెస్ని ఎలా పెద్దది చెయ్యాలి ?
ఇది ఒక తుప్పసు ప్రశ్న రా బాబు! ఒక్క ఊరు అయిపోయాక పక్క ఊరికి వెళ్లండి, ఒక్కో మండలానికి ఒక్క Telugu Heritage Business పేజీ తెరిచి, అక్కడి కుటుంబాల చరిత్రలను క్రమంగా చేరుస్తూ పోండి. ఇది నెమ్మదిగా ఒక పెద్ద డిజిటల్ లైబ్రరీగా మారుతుంది.
Vizag Google AI Hub Careers: Vizag Google AI Hub Careers & Eligibility & Skills & Full Process In Telugu
Vizag Google AI Hub Careers: ఒరే తమ్ముడు, నీ ఊళ్ళోనే Google Job దొరుకుతుంది …
Automated Dropshipping business with MSME loan |నెలకు లక్షలు సంపాదించడం ఎలా?
Automated Dropshipping business with MSME loan ద్వారా మన ఊరి వస్తువులతో నెలకు లక్షలు …
T-Hub Hyderabad లో AI startup రిజిస్టర్ చేయడం ఎలా: T-Hub portal registration process In Telugu
Hyderabad లో AI Startup registration Process In Telugu T-Hub portal registration process: …
Claude Code Free Alternative – NVIDIA Free API తో DeepSeek V3 Pro Setup చేసుకోవడం ఎలా
Claude Code Free Alternative – NVIDIA Free API తో DeepSeek V3 Pro …
3. Village Wedding Invitation Archive Business: పాత పెళ్లి పత్రికలు చూసి నవ్వకండి, అమ్మండి
ఇళ్లలో పాత పెళ్లి పత్రికలు అల్మారాల్లో మూలుగుతూ ఉంటాయి. వాటి డిజైన్లు ఇప్పుడు “వింటేజ్” అని ట్రెండ్‌గా మారిపోయాయి. మీరు చేయాల్సింది ఆ డిజైన్లను తీసుకుని, Canva లాంటి టూల్‌తో కొత్త టెంప్లేట్‌లుగా మార్చడం. ఈ Village Wedding Invitation Archive Business కి ఇన్వెస్ట్‌మెంట్ దాదాపు జీరో, కావాల్సింది కళాత్మక దృష్టి మాత్రమే. చిరాకు వస్తోందా తమ్ముడూ? వేరే ఏమైనా యాపారం ఉంటె బాగుండు అనిపిస్తోందా ? చాల ఉన్నాయి మనదగ్గర. తొక్కలతో చేసే తొక్కలో యాపారం ఒకటి ఉంది. కోట్లు సంపాదిస్తున్నారు తమ్ముడు . … ఈ తొక్కమీద నొక్కు.
మొదటి 10 డిజైన్లు ఎక్కడ నుండి తీసుకోవాలి
- మీ కుటుంబంలో ఉన్న పాత ఆహ్వాన పత్రికలు
- పక్కింటి పెద్దల దగ్గర ఉన్న సేకరణలు
- లోకల్ ప్రింటింగ్ ప్రెస్‌ల దగ్గర ఉన్న పాత శాంపిల్స్
తయారీ ప్రాసెస్
డిజైన్‌ను ఫోటో తీసి, స్కాన్ చేసి, Canva లేదా ఇలాంటి టూల్‌లో ఎలిమెంట్స్‌ను వేరు చేయాలి. అక్షరాలు, బోర్డర్లు, రంగుల కాంబినేషన్ ఇవన్నీ ఒరిజినల్ శైలిలోనే ఉంచి, పేరు మాత్రమే మార్చుకునేలా టెంప్లేట్‌గా తయారు చేయండి. ఒక్కో ప్రాంతానికి ఒక్కో బోర్డర్ స్టైల్ ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా గమనించి వేరు వేరుగా క్యాటలాగ్ చేయండి.
ఎక్కడకిపోయి అమ్మమంటావ్ మరి? చెప్తాగా!
| ప్లాట్‌ఫాం | ఎందుకు |
|---|---|
| Etsy | విదేశాల్లో ఉన్న కస్టమర్లు వింటేజ్ డిజైన్ కోసం వెతుకుతారు |
| Instagram Reels | లోకల్ కస్టమర్లకు డైరెక్ట్ రీచ్ |
| Local Print Shops | పెళ్లి సీజన్‌లో బల్క్ ఆర్డర్లు |
రెండు మూడు డిజైన్లతో మొదలుపెట్టి, ఒక్కో సీజన్‌కి కొత్త కలెక్షన్ యాడ్ చేయండి. ఇది ఒక Wedding Template Business గా కూడా స్కేల్ చేసుకోవచ్చు, ఒక్కసారి 50 టెంప్లేట్‌ల లైబ్రరీ తయారైతే, మీరు నెలవారీ సబ్‌స్క్రిప్షన్ మోడల్ కూడా పెట్టుకోవచ్చు, ప్రింటింగ్ ప్రెస్‌లకు వైట్-లేబుల్‌గా కూడా అమ్మొచ్చు.
4. Traditional Door Pattern Business: పాత తలుపు చెక్కడాలు చూసి ఫోటో తీయండి ముందు, డబ్బులు తర్వాత
గ్రామాల్లో పాత ఇళ్లు కూలగొడుతుంటే ఆ తలుపుల మీద ఉన్న చెక్కడం డిజైన్లు శాశ్వతంగా పోతున్నాయి. మీరు వాటిని ఫోటో తీసి, డిజిటల్ ఫైల్‌గా మార్చి, ఇంటీరియర్ డిజైనర్లకు, CNC వర్క్ చేసే వాళ్లకు అమ్మొచ్చు. ఈ Traditional Door Pattern Business వెనుక లాజిక్ సింపుల్, ఇది కాపీ చేయలేని ఒరిజినల్ కంటెంట్.
“ఇల్లు కూలిపోయినా, దాని డిజైన్ కూలిపోకూడదు.”
ఎలా డాక్యుమెంట్ చేయాలి
- పాత ఇళ్లు కూలగొట్టే ముందు ఓనర్‌ను అడిగి ఫోటోలు తీయండి
- డిజైన్‌ను ట్రేస్ చేసి వెక్టర్ ఫైల్‌గా మార్చండి
- ప్రతి డిజైన్‌కి ఏ ఊరు, ఏ కాలం అనే వివరాలు నోట్ చేసుకోండి
ఎవడు కొంటాడు అంటావా? అబ్బో చాలామందే ఉన్నారు తమ్ముడూ!
| కస్టమర్ టైప్ | ఏం కావాలి వాళ్లకు |
|---|---|
| ఇంటీరియర్ డిజైనర్లు | యూనిక్ డిజైన్ ఫైల్స్ |
| CNC వర్క్‌షాప్‌లు | కటింగ్‌కి రెడీ వెక్టర్ ఫైల్ |
| హెరిటేజ్ ప్రాజెక్ట్‌లు | డాక్యుమెంటేషన్ రిపోర్ట్‌లు |
ఇక్కడ నువ్వే తోపురా తమ్ముడూ, ఎవడూ పోటీలేడు!
ఈ Traditional Door Pattern Business మార్కెట్‌లో ఎవరూ ఇంకా సీరియస్‌గా దిగలేదు, ఎందుకంటే ఇది ఒక్కరోజులో డబ్బు వచ్చే బిజినెస్ కాదు. ఇది Architectural Design Business గా కూడా వెళ్ళొచ్చు, ఒక్కసారి 50-100 డిజైన్ల లైబ్రరీ తయారైతే, మీరు లైసెన్సింగ్ మోడల్‌లో పదే పదే అమ్మొచ్చు, ఒకే డిజైన్‌ను చాలా మందికి అమ్మే వీలుంటుంది. ఇదికూడా నచ్చలేదా? ఒకపని చెయ్యి తమ్ముడూ…. బొమ్మలు అమ్ముతావా? రోడ్డుపక్కన కాదులే, Online లోనే.
5. Traditional Iron Craft Blueprint Business: కమ్మరి మామ చేసే పని రేపు ఎవడూ చేయడు, ఇప్పుడే డాక్యుమెంట్ చేయండి
ఊర్లో కమ్మరి మామ ఇంకా ఉన్నాడా? ఉంటే వెళ్లండి. ఆయన చేసే డిజైన్లు, పనిముట్ల తయారీ విధానం ఇంకో పదేళ్లలో ఎవడికీ తెలియదు. మీరు ఆయన పక్కన కూర్చుని స్కెచ్‌లు వేయండి, ఫోటోలు తీయండి, బ్లూప్రింట్ ఫైల్‌గా మార్చండి. ఈ Iron Craft Blueprint Business నెమ్మదిగా పెరిగే బిజినెస్, కానీ పోటీ ఏమాత్రం లేదు.
డాక్యుమెంటేషన్ ఎలా చేయాలి
ముందు ప్రతి పనిముట్టు తయారీ దశలవారీగా వీడియో తీయండి, తర్వాత దాన్ని స్టెప్-బై-స్టెప్ స్కెచ్‌లుగా మార్చండి. కొలతలు, ఇనుము గ్రేడ్, వాడే టెక్నిక్ అన్నీ నోట్ చేయండి.
- ఏ పనిముట్టు ఎందుకు వాడతారో అడిగి రాయండి
- ప్రతి డిజైన్‌కి ఫోటో ముందు, తర్వాత తీసుకోండి
- కమ్మరి మామ పేరుతోనే ఈ Craft Blueprint Business ను బ్రాండ్ చేయండి, గౌరవం కూడా వస్తుంది
ఎవడికి అమ్మాలి? ఎవడు కొంటాడు అసలు?
ఇది అమ్మడానికి రెండు దారులు ఉన్నాయి, ఒకటి డిజైన్ ఫైల్స్‌గా ఆన్‌లైన్‌లో అమ్మడం, రెండోది క్రాఫ్ట్ మ్యూజియంలకు, హెరిటేజ్ ప్రాజెక్ట్‌లకు రిపోర్ట్‌గా ఇవ్వడం. పెద్ద పెట్టుబడి అక్కర్లేదు, కావాల్సింది ఓపిక మాత్రమే.
“ఒక కళ చచ్చిపోయాక కాపాడలేం, బతికుండగానే కాపాడాలి.”
Traditional Iron Craft Blueprint Business లో ఇంకో చిన్న 2nd income
ఒక్కసారి మీ దగ్గర 10-15 కమ్మరి డిజైన్లు తయారైతే, వాటిని ఒక చిన్న డాక్యుమెంటరీ వీడియోగా కూడా చేసి YouTube లో పెట్టొచ్చు, అది మీ Design Asset Business కి ఫ్రీ మార్కెటింగ్‌గా పనిచేస్తుంది. నీకు ఓపిక ఉంటే YouTube Channel పెట్టు, మనం already YouTube Automation ఎలాచెయ్యలో వివరంగా చెప్పాము.
6. Village Photo Digitization Business: గ్రామంలో ఎన్ని ఇళ్లలో ఫోటోలు పాడైపోతున్నాయో లెక్క వేయండి ఒకసారి
ప్రతి రెండో ఇంట్లో పాత ఫోటోలు ఫంగస్ పట్టి, రంగు మారి పాడైపోతున్నాయి. మీరు ఫోన్‌తో స్కాన్ చేసి, ఫ్రీ యాప్‌లతో మెరుగుపరిచి, ఫ్యామిలీ ఆల్బమ్‌గా ఇస్తే చాలు. ఈ Village Photo Digitization Business కి పెద్ద స్టూడియో అక్కర్లేదు, మీ ఇంటి నుంచే మొదలుపెట్టొచ్చు.
FREE TOOLS LIST
| FREE TOOL | పని |
|---|---|
| Google PhotoScan | గ్లేర్ లేకుండా ఫోటో స్కాన్ చేయడానికి |
| Remini | పాత ఫోటోలను క్లియర్ చేయడానికి |
| Google Photos | ఆర్గనైజ్ చేసి స్టోర్ చేయడానికి |
మొదటి కస్టమర్ మీ ఇంట్లోనే దొరుకుతాడు
మీ నాన్నమ్మ ఫోటోలతో మొదలుపెట్టండి, ఒక Before-After ఫోటో తీసుకుని మీ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టండి. అదే మీ మొదటి యాడ్. ఆ తర్వాత పక్క ఇంటికి వెళ్లండి, ఒక్కో ఇంటికి ఒక్క ఫ్యామిలీ ఆల్బమ్ ప్రాజెక్ట్‌గా తీసుకోండి.
“ఫోటో పాడైతే గతం పోతుంది, దాన్ని కాపాడితే జ్ఞాపకం మిగులుతుంది.”
ఇది యాపారం! పెద్దగా కుడా చెయ్యాలి మరి!
ఈ Memory Book Business నెమ్మదిగా Photo Preservation Business గా విస్తరించుకోవచ్చు, స్కూల్ ఫోటోలు, గ్రూప్ ఫోటోలు, పాత ఫంక్షన్ ఫోటోలు కూడా ఇందులోకి తీసుకోవచ్చు. ఊర్లో ఉన్న స్టూడెంట్లను పార్ట్ టైమ్‌గా పెట్టుకుని, స్కానింగ్ పనిని వాళ్లకు అప్పజెప్పి, మీరు క్వాలిటీ చెక్ మాత్రమే చూసుకుంటే, ఒకేసారి ఎక్కువ ఇళ్లు కవర్ చేయొచ్చు. ఇలాంటి small business ideas telugu లో రాసేవాళ్ళు లేరు తమ్ముడూ!
7. Traditional House Blueprint Business: పాత ఇంటి డిజైన్లు ఇప్పుడు ఫ్యాషన్‌గా మారుతున్నాయి, గమనించారా
పాత గ్రామీణ ఇళ్ల నిర్మాణ శైలి, వాకిలి, పడసాల, వెనుక వాకిలి డిజైన్లు ఇప్పుడు ఆర్కిటెక్ట్‌లకు, హోమ్ బిల్డర్లకు కావాలి. మీరు మీ ఊర్లో ఉన్న పాత ఇళ్లను డాక్యుమెంట్ చేసి, డిజిటల్ బ్లూప్రింట్‌గా మార్చండి. ఈ Traditional House Blueprint Business కి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ అక్కర్లేదు, బేసిక్ డ్రాయింగ్ స్కిల్ చాలు.
Traditional House Blueprint ప్రాసెస్ ఎలా ఉంటుంది
- పాత ఇళ్ల యజమానులతో మాట్లాడి కొలతలు తీసుకోండి
- సాధారణ CAD టూల్‌తో డ్రాయింగ్ తయారు చేయండి
- ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, పైన నుండి వ్యూ మూడు యాంగిల్స్‌లో డాక్యుమెంట్ చేయండి
ఎక్కడ అమ్మాలి?
Pinterest లో ఇలాంటి Village House Designs కి మంచి ట్రాఫిక్ ఉంటుంది, Amazon KDP లో ఒక Design Book గా కూడా పబ్లిష్ చేయొచ్చు. ఇది Rural Architecture Plans నిచ్‌గా ఇంకా చాలా మంది చేయడం లేదు, పోటీ తక్కువ కాబట్టి మీరు మొదటగా వెళ్తే మార్కెట్ మీదే.
“మన పాత ఇల్లు కూలిపోయినా, దాని ప్లాన్ డిజిటల్‌గా బతికుండాలిగా తమ్ముడూ, మనది కాకపోయినా మనకి తెలిసిన ఇళ్ళు, చిన్నపుడు మనం చుసిన ఇళ్ళు.”
Traditional House Blueprint చాలాకాలం ఎలా ఉపయోగపడుతుంది
ఒక్కసారి మీ దగ్గర 20-30 ట్రెడిషనల్ డిజైన్లు తయారైతే, మీరు దాన్ని ఒక Architectural Digital Products కేటలాగ్‌గా మార్చి, హోమ్ బిల్డర్లకు నేరుగా లైసెన్స్ చేయొచ్చు, ఇది వన్-టైమ్ సేల్ కాదు, రిపీట్ రెవెన్యూ ఇచ్చే మోడల్.
8. Vintage Product Catalog Archive Business: పాత కంపెనీల కేటలాగ్‌లు కూడా అమ్ముడవుతాయా అంటే అవుతాయి
పాత రేషన్ షాపుల్లో, మూతపడ్డ కంపెనీల గోడౌన్లలో పాత ప్రొడక్ట్ కేటలాగ్‌లు, ప్రైస్ లిస్ట్‌లు దొరుకుతాయి. కలెక్టర్లకు, రీసెర్చర్లకు ఇలాంటి Historical Product Catalogs విలువైనవి. ఈ Vintage Product Catalog Business మొదలుపెట్టడానికి మీకు కావాల్సింది ఓపికగా వెతకడం మాత్రమే.
“పాత కేటలాగ్ ఒక కంపెనీ చరిత్రకు సాక్ష్యం, అమ్మేముందు దాని విలువ తెలుసుకోండి.”
పని ఎక్కడ నుండి మొదలుపెట్టాలి మరి?
- మూతపడ్డ షాపుల యజమానులను కలవండి
- పాత గోడౌన్ కీపర్లతో మాట్లాడండి
- సెకండ్ హ్యాండ్ పేపర్ కొనేవాళ్ల దగ్గర కూడా ఇలాంటివి దొరుకుతాయి
ఎలా ప్యాకేజ్ చేయాలి?
వీటిని స్కాన్ చేసి, కేటగిరీల వారీగా ఆర్గనైజ్ చేసి, ఈ Product History Business ను డిజిటల్ బండిల్‌గా అమ్మండి. ఒక్కో కేటలాగ్‌కి ఏ కంపెనీ, ఏ కాలం, ఏ ప్రొడక్ట్ లైన్ అని వివరాలు యాడ్ చేస్తే, కలెక్టర్లకు దాని విలువ ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. కలెక్టర్ కమ్యూనిటీలు ఆన్‌లైన్‌లో ఉన్నాయి, అక్కడ మొదలుపెట్టండి, తర్వాత మీ సొంత వెబ్‌సైట్ కూడా పెట్టుకోవచ్చు.
9. Historical Newspaper Archive Business: పాత పేపర్లు అటకమీద కాదు, Archive లో ఉండాలి
పాత తెలుగు పత్రికలు, ఊరి పంచాయితీ నోటీసులు, పాత వార్తా కటింగ్‌లు ఉన్న ఇళ్లను వెతకండి. వీటిని స్కాన్ చేసి, OCR చేసి, రీసెర్చర్లకు, స్టూడెంట్లకు సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లో అమ్మండి. ఈ Historical Newspaper Archive Business ఒక్కరోజులో అయ్యే పని కాదు, ఇది స్లో అండ్ స్టడీ గేమ్.
స్టెప్ బై స్టెప్ ఎలా కట్టాలి
- మీ ఊరి పాత పత్రికలు ఎక్కడ దొరుకుతాయో లిస్ట్ కట్టండి
- ఒక్కో ఇష్యూను స్కాన్ చేసి తేదీ వారీగా ఫోల్డర్ చేయండి
- OCR చేసి కీవర్డ్ సెర్చ్ చేసే విధంగా టెక్స్ట్ యాడ్ చేయండి
- యూనివర్సిటీ లైబ్రరీలకు, రీసెర్చ్ స్కాలర్లకు యాక్సెస్ అమ్మండి
ఎందుకు ఇది Slow Burn బిజినెస్?
నెమ్మదిగా ఒక్కో గ్రామం, ఒక్కో సంవత్సరం కలెక్ట్ చేస్తూ పోతే, మీ దగ్గర ఒక పెద్ద Digital Newspaper Collection తయారవుతుంది, అదే మీకు దీర్ఘకాలిక ఆస్తి. మొదటి సంవత్సరం తక్కువ ఆదాయమే వస్తుంది, కానీ మీ ఆర్కైవ్ పెద్దదైన కొద్దీ, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.
10. Old Village Business Records Archive: మూతపడ్డ మిల్లు లెడ్జర్లు మీకు బంగారం, వాళ్లకి చెత్త
పాత రైస్ మిల్లులు, జిన్నింగ్ మిల్లులు, సహకార సంఘాలు మూతపడితే వాళ్ల లెడ్జర్లు, బిల్లులు ఎవరూ పట్టించుకోకుండా పడేస్తారు. ఇవి Historical Business Records గా రీసెర్చర్లకు, ఆర్థిక చరిత్ర రాసేవాళ్లకు అమ్మొచ్చు. ఈ Business Records Archive Business కి మీ ఊర్లో ఎన్ని మూతపడ్డ మిల్లులు ఉన్నాయో లెక్క వేయడంతోనే మొదలుపెట్టొచ్చు.
ఎలా సేకరించాలి అంటావ్ మరి?
- మూతపడ్డ మిల్లుల యజమానులను కలిసి రికార్డులు అడగండి
- పాత సహకార సంఘం ఆఫీసుల దగ్గర ఉన్న ఫైల్స్ చెక్ చేయండి
- స్కాన్ చేసి కేటగిరీల వారీగా కేటలాగ్ చేయండి
ఎవడు ఖాళీగా ఉన్నాడు? ఇలాంటివి కొనటానికి?
| కస్టమర్ | ఎందుకు కొంటారు |
|---|---|
| యూనివర్సిటీలు | ఆర్థిక చరిత్ర రీసెర్చ్ కోసం |
| రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు | గ్రామీణ వ్యాపార నమూనాల స్టడీ కోసం |
| డాక్యుమెంటరీ మేకర్లు | పాత కథనాల కోసం |
ఈ Commercial Records Database నెమ్మదిగా ఒక పెద్ద రిపోజిటరీగా మారుతుంది, ఒక్కసారి పేరు వస్తే మిల్లు యజమానులే మీకు రికార్డులు ఇవ్వడానికి ముందుకు వస్తారు, వాళ్లకు కూడా తమ కుటుంబ వ్యాపార చరిత్ర కాపాడబడాలని ఉంటుంది.
11. Rural Signboard Archive Business: చేతితో పెయింట్ చేసిన బోర్డులు చూసి ఫోటో తీయండి, ఇప్పుడు లేకపోతే రేపు దొరకవు
ఊర్లో చేతితో పెయింట్ చేసిన షాప్ బోర్డులు, సినిమా బోర్డులు ఇప్పుడు ప్రింటెడ్ ఫ్లెక్స్‌లతో మాయమైపోతున్నాయి. ఈ Vintage Typography Archive విలువైనది, ఎందుకంటే ఇది తిరిగి రాదు. ఈ Rural Signboard Archive Business కి కావాల్సింది కళాత్మక కన్ను, ఫోటోగ్రఫీ మీద కొంచెం ఆసక్తి మాత్రమే.
డాక్యుమెంటేషన్ ఎలా చేయాలి
మంచి లైట్‌లో ఫోటో తీయండి, ప్రతి బోర్డు దగ్గర ఎప్పుడు, ఎక్కడ తీశారో నోట్ చేయండి. అక్షర శైలిని జాగ్రత్తగా గమనించండి, ఒక్కో ప్రాంతానికి ఒక్కో స్టైల్ ఉంటుంది, ఆ తేడాలు నోట్ చేసుకోవడం మీ ఆర్కైవ్‌కి విలువ పెంచుతుంది.
ఏం ప్రొడక్ట్‌లుగా మార్చుకోవచ్చు
| ప్రొడక్ట్ ఫార్మాట్ | ఎవరికి అమ్మాలి |
|---|---|
| డిజిటల్ ఫాంట్ ఫైల్ | డిజైనర్లు, బ్రాండింగ్ ఏజెన్సీలు |
| పోస్టర్ / వాల్ ఆర్ట్ | నోస్టాల్జియా ఇష్టపడేవాళ్లు |
| డాక్యుమెంటేషన్ బుక్ | హెరిటేజ్ ప్రాజెక్ట్‌లు |
చివరిగా ఒకటిచేప్తా తమ్ముడూ!
“ఒక బోర్డు పోతే ఒక కాలం పోతుంది, దాన్ని ఫోటోలో అయినా బతికించండి.”
ఇలాంటి AI టూల్స్‌ను మీ వ్యాపారంలో ఎలా వాడాలో మరింత తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి. ఈ 11 ఆలోచనల్లో ఏది మీకు నచ్చిందో చెప్పండి, దాన్ని ఇంకా లోతుగా, స్టెప్ బై స్టెప్ ప్లాన్‌గా రాస్తాను.








