AP Colleges లోని DTFC ద్వారా Tech Consulting Agency Start చేయడం ఎలా? – Zero Investment తో B2B Business

AP Colleges DTFC Telugu Guide: Zero Investment తో Tech Consulting Agency ఎలా Start చేయాలి?

నువ్వు ఇప్పుడు engineering final year లో ఉన్నావా, లేదంటే ఇప్పుడే graduate అయ్యావా? లేకపోతే Campus placement వచ్చిందా ? లక్షా ఇరవై వేలు package చూసి “ఇంతేనా?” అని feel అవుతున్నావా? లేదంటే placement రాలేదా ? ఏం చేయాలో తెలియట్లేదా?

రెండు situations లోనూ ఒక్క question నిన్ను అడుగుతున్నా గురూ : నీ college పక్కన, నీ town లో ఎంత మంది shop owners, small business వాళ్ళు ఉన్నారు – వాళ్ళకు WhatsApp Business setup చేయడం తెలుసా? Google లో వాళ్ళ shop కనపడుతోందా? Accounts digital గా చేస్తున్నారా?

చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకు help చేయడానికి ఎవరూ లేరు.

అదే నీ business. అదే నీ opportunity. ఇంకా అర్థంకాలేదా ? మొత్తం article చదువు గురూ!

Table of Contents

AP government May 25, 2026 న AP MSME Growth Summit లో ఒక పని చేసింది – AP MSME Development Corporation మరియు IT Department కలిసి AP colleges లో 50 Digital Transformation Facilitation Centres (DTFC) పెట్టాలని agreement sign చేశారు. Target ఏమిటంటే AP లో 1 lakh MSMEs ని digitally transform చేయడం. Zoho, Meta, Vodafone Idea – అందరూ partners అయ్యారు.

అంటే నీ college లోనే DTFC lab వచ్చే chance ఉంది. Free tools, free training, government-backed program. నువ్వు దాన్ని వాడి local businesses కి digital consultant గా పని చేయొచ్చు – zero investment తో B2B tech agency start చేయొచ్చు.

ఇది dream కాదు. Possible. ఇప్పుడు ఎలా అనేది చూద్దాం.

AP MSME Growth Summit 2026 లో 50 DTFC Centres ఎందుకు Launch చేశారు?

May 25, 2026, Vijayawada. Deccan Chronicle report ప్రకారం – AP MSME Development Corporation మరియు IT Department ఒక MoU sign చేశారు. 50 colleges లో Digital Transformation Facilitation Centres (DTFC) పెడతారు. ఈ DTFC ల పని ఏమిటంటే AP లో ఉన్న 1 lakh MSMEs కి digital maturity assessment చేయడం, వాళ్ళని digitally transform చేయడం.

దీని కోసం government దగ్గర partners ఎవరున్నారో చూడు:

Zoho Corporation – MoU sign చేసింది. Digital readiness మరియు transformation కి.

Vodafone Idea BusinessReadyForNext MSME Readiness Assessment Initiative అని program start చేసింది. MSMEs digital maturity evaluate చేయడానికి, technology gaps identify చేయడానికి.

Meta Platforms – Meta Growth Academy ద్వారా 1 lakh micro enterprises కి digital marketing training ఇస్తారు, Facebook మరియు Instagram ద్వారా.

Amazon Global Selling – 10,000+ AP MSME products కి global e-commerce access.

Aramex – Cross-border logistics support.

అంటే MSMEs కి digital help చేయడానికి government దగ్గర full ecosystem ready అయింది. Tools ఉన్నాయి, partners ఉన్నాయి. కానీ ఒక problem ఉంది – వీళ్ళందరికీ ground level లో execute చేయడానికి manpower కావాలి. అదే నువ్వు.

Andhra Pradesh DTFC centres ద్వారా students and freelancers tech consulting agencies, AI automation services, website services, and digital B2B businesses ఎలా build చేయాలో step-by-step Telugu guide. This article covers low investment startup opportunities, business scaling methods, corporate client targeting, and recurring income agency models for beginners.

AP లో 1 Lakh MSMEs Digital Transformation Programme – Problem ఏమిటి?

AP లో చాలా MSMEs ఉన్నాయి – textile shops, grocery stores, hardware stores, small manufacturers, service businesses. వాళ్ళందరికీ digital అయ్యాలని ఉంటుంది. కానీ:

  • Digital tools ఎలా use చేయాలో తెలియదు
  • IT company దగ్గరికి వెళ్తే expensive గా ఉంటుంది
  • Local గా help చేయడానికి ఎవరూ available కాదు

అక్కడికే DTFC model వస్తుంది. College labs లో students ని train చేసి, వాళ్ళని local MSMEs దగ్గరికి పంపిస్తారు. Students కి real experience వస్తుంది, MSMEs కి affordable help వస్తుంది. Win-win.

AP Engineering Students Tech Consultants గా ఎలా మారవచ్చు?

ఇది అర్థం చేసుకో. నువ్వు engineering student వి. Zoho, WhatsApp Business, Google Business Profile – ఇవి నేర్చుకోవడానికి 2 weeks చాలు. అది నేర్చుకున్న తర్వాత నీ దగ్గర ఉన్న skill ఏంటంటే – నీ town లో ఏ shop owner కీ తెలియని skill.

వాళ్ళకి సమస్య ఉంది, నీ దగ్గర solution ఉంది. Business అంటే ఇంతే.

Local MSMEs కి Digital Maturity Assessment చేయడం ఎలా – Step by Step

“Digital maturity assessment” అంటే చాలా తోపు గా అనిపించొచ్చు. Simple గా చెప్తాను – ఒక business ఎంత digital గా ఉంది అని check చేయడం. ఇది నువ్వు ఒక checklist తో చేయొచ్చు.

ఏ MSME దగ్గరికి వెళ్ళినా ఈ questions అడుగు:

  • Google లో నీ business name search చేస్తే వస్తోందా?
  • Online payments తీసుకుంటున్నావా – UPI, card?
  • Customer details ఎక్కడ record చేస్తున్నావు – notebook లో లేదా software లో?
  • Accounts ఎలా చేస్తున్నావు – pen-paper లేదా digital?
  • Social media presence ఉందా – Facebook, Instagram?
  • WhatsApp లో customers తో మాట్లాడుతున్నావా?
  • Stock inventory ఎలా track చేస్తున్నావు?

ఈ answers బట్టి వాళ్ళ “digital maturity score” నువ్వు calculate చేయగలవు. Vodafone Idea “ReadyForNext” program కూడా ఇదే methodology follow చేస్తుంది – digital gaps identify చేయడం, tools adopt చేయడం.

అంటే నువ్వు government-backed methodology follow చేస్తున్నావు. ఇది నువ్వు Client కి (చిన్న వ్యాపారస్తులు ) present చేసినప్పుడు credibility వస్తుంది.

Assessment తర్వాత ఏం చేస్తావు? చిన్న వ్యాపారస్తులకు explain చేస్తావు – “బాబు నీ business లో ఇవి లేవు, వీటిని ఇప్పుడు setup చేస్తే ఇంత benefit వస్తుంది” అని. అదే నీ pitch. అక్కడ నుంచి project start అవుతుంది.

AP colleges లోని DTFC ecosystem ద్వారా zero investment తో tech consulting agency, B2B services business, automation consulting, and digital transformation agency ఎలా start చేయాలో detailed Telugu guide. Students, freelancers, and startup founders కోసం client acquisition methods, business models, service pricing, and scalable agency growth strategies practical గా explain చేయబడతాయి.

Zoho Free Tools తో Cloud Accounting మరియు CRM Setup చేయడం – Beginners కి కూడా Simple గా ఉంటుంది

Zoho గురించి వింటే చాలా మంది భయపడతారు – “అది expensive కదా” అని. అది తప్పు. Zoho Free plans చాలా powerful గా ఉంటాయి, small business కి చాలు.

Zoho Books Free Plan:

3 users వరకు free. Small business కి cloud accounting setup చేయొచ్చు. Customer invoices create చేయొచ్చు, expenses track చేయొచ్చు, GST reports generate చేయొచ్చు. Pen-paper నుంచి digital కి shift అవ్వడానికి ఇది చాలు.

ఒక MSME కి Zoho Books setup చేయడం ఎంత time అవుతుంది? Trained గా ఉంటే 2 నుంచి 3 hours. ఆ 3 hours పని కి నువ్వు ₹3,000 నుంచి ₹8,000 charge చేయొచ్చు.

Zoho CRM Free Plan:

3 users వరకు free. 5,000 records వరకు. Contacts manage చేయొచ్చు, follow-ups set చేయొచ్చు, deals track చేయొచ్చు. Customer notebook పేజీలు పోయి proper CRM వస్తుంది.

Zoho CRM setup + WhatsApp Business integration – ఇది చేసి ఇస్తే ₹2,000 నుంచి ₹5,000 one-time, ఆ తర్వాత monthly maintenance కి ₹1,500 charge చేయొచ్చు.

Zoho Inventory Free Plan:

ఒక్క warehouse, 20 orders per month free. Small retailer కి inventory management setup చేయొచ్చు. Stock alerts, reorder points – ఇవి setup చేయి. Loss చేసుకుంటున్న businesses కి ఇది directly profit కి convert అవుతుంది. Setup charge ₹4,000 నుంచి ₹8,000.

Meta Growth Academy Training తో MSME Digital Marketing Setup చేయడం

Meta Growth Academy అంటే Meta వాళ్ళు ఇచ్చే free digital marketing training. AP government తో partnership లో 1 lakh micro enterprises కి ఈ training ఇస్తారు.

నువ్వు ఈ training తీసుకున్న తర్వాత – locally MSMEs కి Facebook Business Page setup, Instagram Business account, Meta Business Suite setup చేయగలవు. వాళ్ళకి ads ఎలా run చేయాలో, content ఎలా post చేయాలో చెప్పగలవు.

ఒక MSME కి Meta digital presence setup చేయడం:

  • Facebook Business Page – free లో create చేయవచ్చు
  • Instagram Business account – free
  • Meta Business Suite – free
  • WhatsApp Business – free

Setup charge నువ్వు ₹3,000 నుంచి ₹6,000 తీసుకోవొచ్చు. Monthly management – content creation, posting – కి ₹2,000 నుంచి ₹3,000 per month.

A detailed roadmap for Andhra Pradesh youth starting a Zero Investment B2B Tech Agency, curated in our Business Ideas in Telugu guide.

DTFC ద్వారా Local MSMEs కి అందించే Services

Traditional MSME ProblemStudents ఇచ్చే Digital SolutionRequired Free SoftwareRevenue Potential Per Client
Accounts అన్నీ pen-paper లో, tax time లో chaosCloud accounting setup మరియు basic trainingZoho Books Free Plan₹3,000 నుంచి ₹8,000 one-time
Customers details notebook లో, follow-up లేదుCRM setup మరియు WhatsApp integrationZoho CRM Free, WhatsApp Business₹2,000 నుంచి ₹5,000 setup, ₹1,500 per month
Google లో business కనపడట్లేదు, online presence లేదుGoogle Business Profile, basic websiteGoogle Business free, Carrd.co free tier₹2,500 నుంచి ₹6,000 setup
Digital payments తెలియట్లేదు, cash మాత్రమేUPI setup, payment gateway integrationGoogle Pay, PhonePe Business free₹1,500 నుంచి ₹3,000 setup
Facebook, Instagram లేదు, marketing zeroMeta Business Suite setup మరియు content planMeta Business Suite free₹3,000 setup, ₹2,000 per month management
Inventory manual గా, stock loss అవుతోందిDigital inventory management setupZoho Inventory free plan₹4,000 నుంచి ₹8,000 setup

DTFC Labs లో Free Access మరియు Certification – Students కి ఏమి దొరుకుతుంది?

ఈ DTFC certification ఒక్క starting point మాత్రమే బాబు, దీన్ని full-scale agency గా మార్చాలంటే AI tools కూడా add చేయాలి. Zoho, Meta సెటప్ చేయడంతో పాటు, WhatsApp automation లాంటివి కూడా offer చేస్తే client కి ఎక్కువ value ఇవ్వగలవు, దీని కోసం మా AI Automation Agency గైడ్ చూడు. ఈ skill India-wide గా ఎంత value ఉందో తెలుసుకోవాలంటే National Skill Development Corporation సైట్ ఒక్కసారి చూడు, government ఏ skills కి ఎక్కువ priority ఇస్తుందో అక్కడ clear గా ఉంటుంది.

ఇప్పుడు 50 DTFC labs announce అయ్యాయి. Specific colleges ఏవి అనే list ఇంకా officially release కాలేదు – programme fresh గా start అయింది. కానీ DTFC model ప్రకారం labs లో ఉండే things:

Lab లో దొరికే resources:

  • High-speed internet access
  • Software subscriptions – Zoho partner licenses, Meta tools
  • Training materials – digital maturity assessment frameworks
  • Mentors – faculty members మరియు industry experts

Certification:

DTFC training complete చేసిన తర్వాత certification వస్తుంది. ఇది నీ resume లో powerful అవుతుంది – “AP Government DTFC Certified Digital Consultant” అని. Job కి వెళ్ళినా, own agency start చేసినా ఇది credibility ఇస్తుంది.

నీ college లో DTFC వస్తుందా అని ఎలా తెలుసుకోవాలి?

AP MSME One Portal check చేయి. నీ college principal లేదా placement officer ని అడుగు. IT Department తో connect అయి ఉన్న faculty members ని contact చేయి. Scheme fresh గా announce అయింది కాబట్టి rollout starting అవుతోంది – early గా aware అయినవాడికి early గా benefit వస్తుంది.

Zero Investment తో B2B Tech Agency Build చేయడం – AP Students కి Complete Roadmap

DTFC innovation ecosystem ఉపయోగించి zero investment B2B tech consulting agency ఎలా start చేయాలో complete Telugu roadmap. Digital services, automation consulting, AI workflows, software services, startup networking opportunities, and business growth systems practical examples తో explain చేయబడతాయి for Telugu youth and aspiring entrepreneurs.

సరే ఇప్పుడు practical గా చూద్దాం. నీ దగ్గర laptop ఉంది, internet ఉంది, engineering background ఉంది. Zero investment తో agency ఎలా start చేయాలి?

Phase 1 – Skills Ready చేసుకో (Week 1 నుంచి 3)

ఈ tools నేర్చుకో, అన్నీ free:

  • Zoho Books – free account create చేసి, demo company తో practice చేయి
  • Zoho CRM – free account తో contact management నేర్చుకో
  • Google Business Profile – ఒక dummy profile create చేసి setup నేర్చుకో
  • Meta Business Suite – free account తో tools explore చేయి
  • Canva – free plan తో social media graphics design చేయడం నేర్చుకో
  • Carrd.co – free tier తో simple one-page website build చేయి

ఇవన్నీ 3 weeks లో నేర్చుకోవచ్చు. YouTube tutorials ఉన్నాయి, అన్నీ Telugu లో కూడా ఉన్నాయి.

Phase 2 – First Client కనుగొనడం (Week 4)

నీ town లో లేదా college surrounding లో 20 small businesses list చేయి. ఇవి పని చేస్తాయి:

  • Medical shops
  • Grocery stores
  • Clothing shops
  • Small restaurants
  • Hardware stores
  • Beauty parlours
  • Coaching centres

వీళ్ళ దగ్గరికి నువ్వే ఒకసారి వెళ్ళు . Owner తో directly మాట్లాడు. “నేను DTFC student, మీ business కి digital assessment చేయడానికి వచ్చాను, free గా చేస్తాను” అని చెప్పు.

ఎందుకు free first? అని అడుగుతావా? First client free గా చేస్తే experience వస్తుంది, testimonial వస్తుంది. రెండో client నుంచి charge చేయి.

Phase 3 – First Paid Project (Week 5 మరియు 6)

Assessment complete చేసిన తర్వాత client కి present చేయి. “మీ business లో ఇవి లేవు, వీటిని setup చేస్తే ఇంత benefit వస్తుంది, నా charge ఇంత” అని straight గా చెప్పు.

మొదటి paid project ₹3,000 నుంచి ₹5,000 కి aim చేయి. Zoho Books setup లేదా Google Business Profile setup – ఇవి చేయి. Simple, fast, visible result.

Phase 4 – Referrals మరియు Scale (Month 2 onwards)

First client happy అయితే వాళ్ళే refer చేస్తారు. Business community small గా ఉంటుంది, word-of-mouth fast గా spread అవుతుంది.

3 నుంచి 5 clients వచ్చిన తర్వాత ఒక simple portfolio page build చేయి. Carrd.co తో free లో చేయొచ్చు. Photos, testimonials, services list – అంతే.

ఒక friend ని add చేసుకో team లో. Work split చేయి. Agency అయిపోయింది.

Revenue Model – Per Project Charge చేయాలా Monthly Retainer తీసుకోవాలా?

రెండూ కావాలి, different clients కి.

Per project:

New clients కి ముందు one-time setup charge తీసుకో. Google Business Profile setup – ₹2,500. Zoho Books setup – ₹5,000. Meta Business Suite setup – ₹3,000. ఇవి clean గా ఉంటాయి, client కి clearly ఎంత pay చేస్తున్నారో తెలుస్తుంది.

Monthly retainer:

Setup అయిన తర్వాత maintenance, content creation, reporting కి monthly charge చేయి. ₹1,500 నుంచి ₹3,000 per client per month. 10 clients – ₹15,000 నుంచి ₹30,000 per month recurring income. College లో ఉంటూ ఇది possible.

AP MSME Digital Maturity Assessment – Students ఎలా Professional గా Execute చేయాలి?

Assessment professional గా చేయడానికి ఒక simple template follow చేయి:

Section 1 – Online Presence (20 marks)

  • Google లో business కనపడుతోందా? (5 marks)
  • Website లేదా landing page ఉందా? (5 marks)
  • Social media accounts active గా ఉన్నాయా? (5 marks)
  • Online reviews ఉన్నాయా? (5 marks)

Section 2 – Digital Payments (20 marks)

  • UPI payments తీసుకుంటున్నారా? (10 marks)
  • Online payment gateway ఉందా? (10 marks)

Section 3 – Business Operations (30 marks)

  • Accounts digital గా చేస్తున్నారా? (10 marks)
  • Customer database digital గా maintain చేస్తున్నారా? (10 marks)
  • Inventory digital గా track చేస్తున్నారా? (10 marks)

Section 4 – Communication (30 marks)

  • WhatsApp Business use చేస్తున్నారా? (10 marks)
  • Email communication ఉందా? (10 marks)
  • Customer follow-up system ఉందా? (10 marks)

Total score 100 లో:

  • 0 నుంచి 30: Digital infant – అన్నీ setup చేయాలి
  • 31 నుంచి 60: Digital beginner – partial setup అయ్యింది
  • 61 నుంచి 80: Digital intermediate – fine-tuning అవసరం
  • 81 నుంచి 100: Digital ready – advanced tools వాడవచ్చు

ఈ score బట్టి నువ్వు client కి exact recommendations ఇవ్వగలవు. Professional గా కనపడతావు, client trust చేస్తాడు.

Students launching a Zero Investment B2B Tech Agency in AP colleges via DTFC resources, featured in our Business Ideas in Telugu.

AP MSME Digital Transformation లో Students కి Real Revenue Potential ఎంత?

Numbers గురించి honest గా మాట్లాడుకుందాం.

AP లో 1 lakh MSMEs target అయ్యాయి. 50 DTFC colleges లో 100 active students ఉంటే – 5,000 student consultants. 1 lakh MSMEs ని 5,000 students cover చేయాలంటే – ఒక్కో student 20 businesses cover చేయాలి. అంటే demand supply కంటే చాలా ఎక్కువగా ఉంది.

ఒక్కో student conservative గా 5 clients maintain చేస్తే:

  • Per project average ₹5,000 – 5 projects per month – ₹25,000
  • Monthly retainer ₹2,000 per client, 5 clients – ₹10,000 per month
  • Combined: ₹35,000 per month

College final year లో ఉంటూ ₹35,000 per month. Campus placement package కంటే ఎక్కువ. ఇది conservative estimate.

Graduate అయిన తర్వాత full-time agency run చేస్తే 20 నుంచి 30 clients maintain చేయొచ్చు – ₹1.5 lakhs నుంచి ₹2 lakhs per month range possible.

Students కి Honest గా చెప్పాల్సిన Challenges

Graduate అయిన తర్వాత 20-30 clients వరకు scale చేయాలంటే, ఒక్క laptop తో మొదలు పెట్టిన agency ki కొంచెం capital కూడా అవసరం అవుతుంది, team పెంచడానికి, tools upgrade చేయడానికి. అలాంటప్పుడు ఏం options ఉన్నాయో మా AI Startup Loan గైడ్ లో వివరంగా రాశాను. అధికారిక గా registration చేసి funding schemes కోసం apply చేయాలంటే Startup India portal కూడా ఒక్కసారి చూడు, DTFC నుంచి full-fledged startup కి ఇదే bridge.

Challenge 1 – Client trust

నువ్వు student వి. “వీడు student, ఏం చేస్తాడు?” అని కొందరు dismiss చేస్తారు. దీన్ని overcome చేయడానికి – DTFC certification, government-backed program అని mention చేయి. Demo చేసి చూపించు. Free assessment offer చేయి first.

Challenge 2 – Technical issues

Client దగ్గర software problems వస్తే నువ్వు stuck అవుతావు. దీని కోసం – ముందే thoroughly practice చేయి. Zoho support documentation చదువు. Fellow students group create చేసుకో, help each other.

Challenge 3 – Scope creep

Client initially “Google Business setup చేయి” అంటాడు. తర్వాత “Facebook కూడా చేయి, website కూడా కావాలి, ads కూడా run చేయి” అని expand అవుతాడు – same price లో. Scope clearly define చేసి, extra work కి extra charge చేయి. ముందే written గా agree చేసుకో.

Scope clearly define చేయాలంటే, verbal గా చెప్పి వదిలేయకు, ప్రతి project కి ఒక్క simple written agreement పెట్టు. ఇది manual గా Word document లో type చేయకుండా, ఆటోమేటిక్ గా proposal మరియు contract generate చేసుకోవాలంటే మా AI Proposal Generator గైడ్ చదువు, client కి professional గా కనపడతావు కూడా. Sign చేయడానికి office కి రమ్మని చెప్పకుండా, Zoho Sign లాంటి free e-signature tool వాడితే client phone లోనే online సైన్ చేసేస్తాడు, time save అవుతుంది.

Challenge 4 – Payments

కొందరు clients pay delay చేస్తారు. Advance తీసుకోవడం habit చేసుకో – 50% upfront, 50% on completion.

ఇవి real challenges. Prepared గా ఉంటే handle చేయగలవు.

AP MSME One Portal లో Startup Registration ఎలా చేయాలి?

నువ్వు agency formally run చేయాలంటే AP MSME One Portal లో register చేయొచ్చు. Benefits:

  • Udyam Registration వస్తుంది
  • Government schemes కి eligible అవుతావు
  • Bank loans easily దొరుకుతాయి
  • Credibility increases

Registration process simple గా ఉంటుంది – Aadhaar, PAN, basic business details. Online చేయవచ్చు.

DTFC ద్వారా Tech Consulting Agency Start చేసే ముందు ఈ Questions కి Answers Prepare చేసుకో

Client దగ్గరికి వెళ్ళే ముందు ఇవి ready గా ఉండాలి:

  • నువ్వు exactly ఏ services offer చేస్తున్నావు?
  • ఒక్కో service కి charge ఎంత?
  • Setup చేయడానికి ఎంత time పడుతుంది?
  • After-support ఇస్తావా, charge ఉంటుందా?
  • Client data confidential గా ఉంటుందా?

ఈ question ని light గా తీసుకోకు బాబు, client business data నీ దగ్గరే ఉంటుంది కాబట్టి, దాన్ని ఎలా handle చేస్తావో clear గా ఉండాలి. Data privacy basics ఎలా follow చేయాలో మా AI Compliance & Data Privacy గైడ్ చదివితే client కి confidence వస్తుంది. India లో ఇప్పుడు ఉన్న data protection rules exact గా తెలుసుకోవాలంటే MeitY యొక్క Digital Personal Data Protection Act page ఒక్కసారి చూడు, ఇది future లో నీ agency కి కూడా save చేస్తుంది.

ఇవి ముందే clear గా define చేసుకుంటే meetings smooth గా జరుగుతాయి.

Key Numbers – AP DTFC Program లో ఏమి Announced అయింది?

ItemNumber
Colleges లో DTFC Centres50
Target MSMEs for digital transformation1 lakh
Meta Growth Academy training target1 lakh micro enterprises
Amazon Global Selling – AP MSME products10,000+
Summit లో signed MoUsMeta, Amazon, Zoho, Vodafone Idea, Aramex, Quality Council of India, NSIC
AP MSME parks launched38 new parks under Phase 3

Sources: Deccan Chronicle, TelecomTalk – Vodafone Idea MoU

చివరి మాట – Job vs Agency, నువ్వు ఏం Choose చేస్తావు?

బాసూ, ఒక్క సారి think చేయి.

Campus placement లో వచ్చే ₹3.5 LPA job – అంటే ₹29,000 per month in-hand. 9 to 6, someone else’s rules, someone else’s vision.

DTFC తో 10 clients maintain చేస్తే – ₹35,000 నుంచి ₹50,000 per month. నీ time, నీ clients, నీ growth.

ఏది better? నువ్వే decide చేసుకో . కానీ option ఉందని తెలుసు కదా ఇప్పుడు.

ఒక్క step మాత్రమే ఇప్పుడు చేయి. నీ college management office కి వెళ్ళి అడుగు – “DTFC program మన college లో వస్తోందా?” అని. లేదంటే AP MSME One Portal check చేయి. లేదంటే Zoho free account ఇప్పుడే create చేసి practice start చేయి.

AP colleges లోని DTFC ద్వారా tech consulting agency start చేయడానికి ఇంతకంటే better time లేదు – programme fresh గా announce అయింది, 1 lakh MSMEs wait చేస్తున్నాయి, tools free గా ఉన్నాయి.

Action నీ వంతు. Doubts ఏమైనా ఉంటే కింద comment చెయ్యి! ఓం నమః శివాయ!

Sources:

Shiv shankar

Mr. Shiv Shankar is an independent freelancer and digital specialist with over 7 years of hands-on experience working across multiple global freelancing platforms. Read bio above.