AI Automation Agency in Telugu: AI Automation Agency ఎలా ప్రారంభించాలి అనేదానిపై కంప్లీట్ ప్రాక్టికల్ గైడ్

AI Automation Agency in Telugu: AI Automation Agency ఎలా ప్రారంభించాలి అనేదానిపై కంప్లీట్ ప్రాక్టికల్ గైడ్

ఈరోజు మనం ఈ AI Automation Agency in Telugu గురించి, అసలు ఈ బిజినెస్‌ను ఎలా ప్రారంభించాలి అనే దాని గురించి చాలా ప్రాక్టికల్‌గా మాట్లాడుకుందాం. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే, ఇప్పుడు నడుస్తున్న ఈ AI రేసులో చాలా మంది ఎలా పడితే అలా దూకేసి చివరకు చేతులు కాల్చుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఇది చాలా కష్టం అనిపిస్తుంది కానీ, కొంచెం బుర్ర పెట్టి సరిగ్గా ఆలోచిస్తే ఇది చాలా ఈజీ. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు మార్కెట్‌లో రకరకాల అద్భుతమైన టూల్స్ ఉన్నాయి. ChatGPT అవ్వచ్చు, Gemini అవ్వచ్చు, CoPilot అవ్వచ్చు, ఇవన్నీ రోజురోజుకీ అప్‌డేట్ అయిపోతున్నాయి. చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారం అనే తేడా లేకుండా ప్రతి బిజినెస్‌లోనూ అందరూ ఈ టూల్స్‌ను విపరీతంగా వాడేస్తున్నారు. మరి అలాంటప్పుడు మనం ఎందుకు ఊరికే కూర్చోవాలి? మనం కూడా వీటిని వాడుకుని ఒక ఏజెన్సీ లాగా ఎందుకు స్టార్ట్ చేయకూడదు?

నేనేమీ పెద్ద తోపు ఇంజనీర్ని కాదు. ఏదో నార్మల్ ఇంజనీరింగ్ చదివాను, ఇప్పుడు ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను. మీ కోసం అంటే, మీ కోసం మాత్రమే కాదు నా కోసం కూడా ఈ బ్లాగ్ రాస్తున్నాను. ఇందులో జనాలకు ఎప్పుడూ సోషల్ మీడియాలో దొరికే చెత్త సోల్లు అంతా కాకుండా, చాలా ప్రాక్టికల్ విషయాలు మాట్లాడుకుందాం. యూట్యూబ్‌లో కొంతమంది పీకుడుగాళ్లు చెప్తూ ఉంటారు కదా: రాత్రికి రాత్రే లక్షల రూపాయలు సంపాదించడం ఎలాగో, ఒక్క సంవత్సరంలో కోటీశ్వరుడు అయిపోవడం ఎలాగో! ఇలాంటి దరిద్రపు లంగా కోతలు ఏవీ చెప్పుకోకుండా, యాక్చువల్ పాయింట్లు మాత్రమే మాట్లాడుకుందాం.


అసలు AI Automation Agency అంటే ఏంటి? దీని అసలు కథ ఏంటి?

అసలు AI Automation Agency అంటే దాన్ని అప్పుడప్పుడు మనం షార్ట్‌కట్‌గా AAA అని కూడా పిలవవచ్చు. మన తెలుగు వాళ్లకి AAA అనగానే అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఆ స్టార్ సింబల్ గుర్తొస్తాయి తప్ప, ఈ ఆటోమేషన్ ఏజెన్సీ అనే దాని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే మనం సోషల్ మీడియాలో స్క్రోల్ చేసేకొద్దీ మనకి కనిపించేదంతా పనికిరాని క్రింజ్ కంటెంట్ మాత్రమే. అలాంటి క్రింజ్ మనకి చూపిస్తారు తప్ప ఇలాంటి యూస్‌ఫుల్ కంటెంట్‌ను ఎవరూ చూపించరు. సరేలే, ఎలాగో వచ్చారు కాబట్టి ఈ బ్లాగ్ మొత్తం చివరి వరకు చదవండి.

ఇక్కడ నేను ప్రతి చోటా మీకు ఇంటర్నల్ లింకింగ్ ఇస్తున్నాను. అంటే మీకు ఎక్కడైనా ఒక లింక్ కనపడిందంటే దాని మీద క్లిక్ చేసి, మీరు వేరే డీటెయిల్డ్ పేజీకి వెళ్లి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. నేను కింద లింకులు కూడా ఇచ్చాను [ఇక్కడ క్లిక్ చేయండి – లింక్].

ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక బిజినెస్‌కు కస్టమర్ సపోర్ట్ కోసం AI ని ఎలా వాడాలి? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, కంటెంట్ రాయడం, వాటిని షెడ్యూల్ చేయడం లాంటి పనుల కోసం AI ని ఎలా వాడాలి? అలాగే ఆటోమేటిక్‌గా ఇన్వాయిస్‌లు జనరేట్ చేయడం, కస్టమర్లకు ఫాలో-అప్ ఈమెయిల్స్ పంపడం లాంటి వాటి కోసం AI ని ఎలా వాడుకోవాలి? ఇంకా గట్టిగా మాట్లాడితే లీడ్ జనరేషన్ చేయడం, డేటా ఎంట్రీ చేయడం, రిపోర్ట్ జనరేట్ చేయడం లాంటి పనులన్నింటినీ AI తో ఆటోమేట్ చేయవచ్చు. దీనికోసమే మనం ఒక ఏజెన్సీ పెట్టి క్లయింట్లకు సర్వీస్ ఇవ్వబోతున్నాం. దీనినే AI business models in Telugu లో ఒక బెస్ట్ మోడల్‌గా చెప్పుకోవచ్చు.

మీరు గూగుల్‌లో గాని, యూట్యూబ్‌లో గాని కొన్ని కీవర్డ్స్ సెర్చ్ చేస్తే మీకు మంచి ఐడియా వస్తుంది:

  • AI Automation Agency meaning in Telugu
  • AI Agency అంటే ఏంటి
  • Task automation చేయడం ఎలా

ఈ కీవర్డ్స్ చివర “in Telugu” అని యాడ్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్డ్ కంటెంట్ దొరుకుతుంది. రెగ్యులర్ గా ఇలాంటి కంటెంట్ సెర్చ్ చేయండి బ్రో. మీ ఫీడ్స్‌లో కూడా ఇలాంటి మంచి అప్‌డేట్స్ వస్తాయి తప్ప క్రింజ్ కంటెంట్ రాకుండా ఉంటుంది. ఆల్రెడీ మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, కాబట్టి ఇలాంటి యూస్‌ఫుల్ విషయాలు నేర్చుకోవడం చాలా అవసరం.


ఎందుకు ప్రతి ఒక్కడూ ఈ AI Automation Business లోకి దూకుతున్నాడు? Why This is a Gold Rush?

ఇప్పుడు ఈ AI Automation Business Ideas Telugu అనేది కేవలం ఒక నార్మల్ ట్రెండ్ మాత్రమే కాదు. ఇది ఒక పెద్ద ఇండస్ట్రియల్ రివల్యూషన్ లాంటిది. ఎందుకు అందరూ ఈ AAA వైపు పరిగెడుతున్నారో కొన్ని ముఖ్యమైన కారణాలు కింద చూద్దాం:

  • తక్కువ ఖర్చుతో ప్రారంభించవచ్చు (Low Entry Barrier): కేవలం 10,000 నుండి 20,000 రూపాయల బడ్జెట్‌తో ఈ బిజినెస్ మొదలుపెట్టవచ్చు. దీనికి పెద్ద పెద్ద ఆఫీసులు గానీ, భారీ పెట్టుబడులు గానీ అవసరం లేదు.
  • భారీ డిమాండ్ (High Demand): మార్కెట్లో ఉన్న 90% చిన్న బిజినెస్‌లు ఇప్పటికీ AI ని వాడటం లేదు. వాళ్లకి ఈ టెక్నాలజీ గురించి అస్సలు ఐడియా లేదు. అలాంటప్పుడు వాళ్ల పనులను మీరు సులభం చేస్తే, వాళ్ల దృష్టిలో మీరే రియల్ హీరోలు అవుతారు.
  • నెలవారీ ఆదాయం (Recurring Revenue): ఒకసారి మీరు ఒక బిజినెస్ ఓనర్‌తో మంచి రిలేషన్ బిల్డ్ చేసుకుని వాళ్ల పనులను ఆటోమేట్ చేస్తే, వాళ్లు మీకు ప్రతి నెలా ఒక ఫిక్స్‌డ్ అమౌంట్ ఇస్తూనే ఉంటారు.
  • కోడింగ్ అవసరం లేదు (No-Code Tools): దీని కోసం మీరు పెద్ద పెద్ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్లో చాలా No-code AI Automation Tools అందుబాటులో ఉన్నాయి.

“మార్కెట్ లో 90 శాతం చిన్న బిజినెస్ లు అసలు AI ని వాడట్లేదు బ్రో. వాళ్ల దగ్గరికి వెళ్లి నువ్వు ఆటోమేషన్ చేసి పెడితే నువ్వే వాళ్లకి తోపులా కనిపిస్తావ్.”

టాస్క్ ఆటోమేషన్ చేయడానికి మనకి Zapier, Make.com, ManyChat, n8n లాంటి అద్భుతమైన ప్లాట్‌ఫారమ్స్ ఉన్నాయి. మీరు గనుక నిజంగా ఇంట్రెస్ట్‌గా ఉంటే మొదట n8n workflow automation Telugu గురించి నేర్చుకోండి. వాళ్లు 14 రోజుల వరకు ఫ్రీ ట్రయల్ ఇస్తారు. ఆ 14 రోజులు మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు, చాలా విషయాలు ఈజీగా నేర్చుకోవచ్చు. నేను కింద టూల్స్ నేర్చుకోవడానికి లింకులు పెట్టాను [ఇక్కడ క్లిక్ చేయండి – లింక్].


AI Automation Agency ఎలా ప్రారంభించాలి: 4 ప్రాక్టికల్ స్టెప్స్

మనం ఈ ఏజెన్సీని స్టార్ట్ చేయడానికి ముఖ్యంగా 4 స్టెప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో క్లియర్ గా చూద్దాం.

STEP 1: మీ నిష్ (Niche) సెలెక్ట్ చేసుకోవడం

మీరు అందరికీ అన్ని పనులు చేసేస్తాను అంటే కుదరదు బ్రో. మీరు ఏ రకమైన బిజినెస్‌లకు ఆటోమేషన్ చేయాలనుకుంటున్నారో ఒక నిర్దిష్టమైన నిష్ సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు:

  • రియల్ ఎస్టేట్ ఏజెంట్లు (Real Estate): వీళ్లకు లీడ్ ఫాలో-అప్స్ చేయడం కోసం ఆటోమేషన్ సిస్టమ్స్ బిల్డ్ చేయవచ్చు.
  • ఈ-కామర్స్ స్టోర్స్ (E-commerce): కస్టమర్ సపోర్ట్, కార్ట్ రికవరీ ఆటోమేషన్స్ సెటప్ చేయవచ్చు.
  • లోకల్ రెస్టారెంట్లు (Local Restaurants): టేబుల్ రిజర్వేషన్లు, కస్టమర్ రివ్యూల మేనేజ్‌మెంట్ కోసం AI Chatbot Services Telugu ని ఉపయోగించవచ్చు.
  • ఫిట్‌నెస్ కోచ్‌లు (Fitness Coaches): వీళ్ల అపాయింట్‌మెంట్‌లు బుక్ చేసుకోవడం, లీడ్ జనరేషన్ చేయడం కోసం ఆటోమేషన్ వాడవచ్చు.

మీరు గనుక ఇంటర్నెట్‌లో “AI niche selection Telugu” లేదా “Best automation niches 2026 in Telugu” అని సెర్చ్ చేస్తే మీకు ఇంకా చాలా ఐడియాలు దొరుకుతాయి. మన ఫోన్లలో ఉండే అల్గారిథమ్స్ అన్నీ మనం ఏం సెర్చ్ చేస్తున్నాం అనే యూజర్ ఇంట్రెస్ట్ బట్టే పని చేస్తాయి. కాబట్టి కాస్త మంచి విషయాలు సెర్చ్ చేయడం అలవాటు చేసుకోండి.

STEP 2: టూల్స్ మాస్టరీ మరియు స్కిల్స్ (Tools and Skills Mastery)

మీరేమీ పెద్ద సాఫ్ట్‌వేర్ డెవలపర్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ, కనీసం ఒక 3 లేదా 4 ముఖ్యమైన టూల్స్‌లో మాస్టర్ అవ్వాలి. ఆ టూల్స్ ఏంటి, వాటి ఉపయోగం ఏంటి అనేది కింద ఉన్న టేబుల్‌లో చూడండి.

టూల్ పేరుఉపయోగం (Purpose)ప్లాన్ రేటు (Plan Rate)
Make.comవర్క్‌ఫ్లో ఆటోమేషన్ మరియు యాప్స్ కనెక్ట్ చేయడంఫ్రీ ప్లాన్ అందుబాటులో ఉంది
n8nనో-కోడ్ వర్క్‌ఫ్లో ఆటోమేషన్14 రోజుల ఫ్రీ ట్రయల్ అందుబాటులో ఉంది
GoHighLevelసేల్స్ ఫన్నెల్స్ మరియు CRM ఆటోమేషన్కొంచెం ఎక్కువ రేటు ఉంటుంది కానీ బెస్ట్
ChatGPT / Gemini / Claudeకంటెంట్ జనరేషన్ మరియు AI ప్రొంప్టింగ్ఫ్రీ మరియు పెయిడ్ వర్షన్లు ఉన్నాయి
Zapierసింపుల్ ఆటోమేషన్లు, ట్రిగ్గర్స్ మరియు యాక్షన్స్బేసిక్ ఫ్రీ ట్రయల్స్ ఉన్నాయి

ముందుగా ఎక్కువ డబ్బులు పెట్టేసి ఏ టూల్స్ కొనకండి బ్రో. జస్ట్ ఫ్రీ ట్రయల్స్ వాడుకుని బాగా ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా n8n లో 14 రోజుల ఫ్రీ ట్రయల్ ఉంటుంది కాబట్టి అందులో లాగిన్ అయి సిస్టమ్స్ ఎలా పని చేస్తున్నాయో నేర్చుకోండి.

STEP 3: సర్వీస్ ప్యాకేజీలు మరియు ప్రైసింగ్ డిసైడ్ చేయడం

మీరు క్లయింట్లకు ఆఫర్ చేసే సర్వీసులను కొన్ని ప్యాకేజీలుగా డివైడ్ చేయాలి. అప్పుడే వాళ్లకి క్లారిటీ ఉంటుంది. ఆ ప్యాకేజీల వివరాలు ఈ విధంగా ఉండవచ్చు:

ప్యాకేజీ పేరుసర్వీసులు (Services Offered)నెలవారీ ధర (Pricing)
Basic Package1 AI Chatbot, 500 ఆటో ఈమెయిల్స్, వీక్లీ రిపోర్ట్స్రూ. 15,000 / నెల
Pro Package3 ఆటోమేషన్లు, CRM + లీడ్ మేనేజ్‌మెంట్, 24/7 చాట్‌బాట్రూ. 35,000 / నెల
Enterprise Packageకస్టమ్ AI సొల్యూషన్స్, డేటా అనలిటిక్స్, స్పెషల్ సపోర్ట్రూ. 75,000 / నెల

బిగినర్స్ గా ఉన్నప్పుడు స్టార్టింగ్‌లోనే రూ. 75,000 ప్యాకేజీలు అమ్మడం కష్టం. కాబట్టి బేసిక్ లేదా ప్రో ప్యాకేజీలతో స్టార్ట్ చేయండి.

STEP 4: పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేయడం మరియు క్లయింట్లను పట్టుకోవడం

క్లయింట్లు మిమ్మల్ని నమ్మి ప్రాజెక్ట్ ఇవ్వాలంటే మీ దగ్గర కచ్చితంగా ప్రూఫ్ ఉండాలి. మరి ప్రూఫ్ రావాలంటే ఏం చేయాలి? కనీసం ఒకరిద్దరికి ఫ్రీగా వర్క్ చేసి పెట్టాలి. మీ ఏరియాలో ఉన్న ఒక రెస్టారెంట్ లేదా ఒక చిన్న బిజినెస్‌ను సెలెక్ట్ చేసుకోండి. వాళ్లకి ఫ్రీగా ఒక చాట్‌బాట్ గానీ, ఆటోమేషన్ గానీ చేసి పెట్టండి.

నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే, లోకల్ రెస్టారెంట్లకు వెళ్లి క్యూఆర్ కోడ్ మెనూలు క్రియేట్ చేసి పెట్టాడు. దాదాపు 20 రెస్టారెంట్ల దగ్గర కేవలం 500 రూపాయల చొప్పున తీసుకున్నాడు. 20 ఇంటు 500 ఎంత అవుతుందో మీరే లెక్కేసుకోండి. కానీ ఆ 20 మంది దగ్గరికి వెళ్లడానికంటే ముందు, వాడు ఒక ముగ్గురు నలుగురికి ఫ్రీగా చేసి చూపించాడు. అది నచ్చి మిగిలిన వాళ్లు కూడా వాడికి ఆర్డర్స్ ఇచ్చారు.

“మనకి మొహమాటం ఎక్కువ బ్రో. ఒక షాప్ కి వెళ్లి అడగడానికి సిగ్గు పడిపోతాం. మా నాన్న తోపు, నేను ఇంజనీరింగ్ చదివాను, నేను వెళ్లి ఆఫర్ అడగాలా అని ఫీల్ అయితే లైఫ్ లో ముందుకు వెళ్లలేం.”

క్లయింట్లను పట్టుకోవడానికి Instagram, LinkedIn చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా LinkedIn లో మంత్లీ ప్రీమియం తీసుకుని పెద్ద పెద్ద బిజినెస్ ఓనర్లను ఫాలో అవ్వండి. వాళ్లతో రిలేషన్ బిల్డ్ చేసుకోండి. అంతేగాని సోషల్ మీడియాలో క్రింజ్ వీడియోలు చేసే వాళ్లను ఫాలో అయితే టైమ్ వేస్ట్ తప్ప ఏమీ రాదు. అలాగే Fiverr, Upwork లాంటి ఫ్రీలాన్స్ ప్లాట్‌ఫారమ్స్ లో కూడా మీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోండి. స్టార్టింగ్‌లో చాలా తక్కువ రేట్లకు సర్వీస్ ఇవ్వండి, ఎందుకంటే మనకి రివ్యూలు చాలా ముఖ్యం.


బిగినర్స్ చేసే దరిద్రపు తప్పులు (Common Mistakes to Avoid)

ఈ ఆటోమేషన్ ఏజెన్సీ స్టార్ట్ చేసేటప్పుడు చాలా మంది చేసే కొన్ని కామన్ తప్పుల గురించి కూడా మాట్లాడుకుందాం:

  1. చాలా ఎక్కువ టూల్స్ నేర్చుకోవడం: ఎవడో చెప్పాడని కాన్వా నేర్చుకోవడం, ఇంకొకడు చెప్పాడని ఫోటోషాప్ నేర్చుకోవడం, వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడం లాంటివి చేయకండి. మనకి గూగుల్, యూట్యూబ్ ఉన్నాయి. మనకి ఏది అవసరమో అది మాత్రమే సెర్చ్ చేసి నేర్చుకోండి.
  2. అతిగా ప్రామిస్ చేయడం (Over-promising): క్లయింట్లకు మీ బిజినెస్ 10 రెట్లు పెరిగిపోతుంది, ఆరు నెలల్లో మీరు కోటీశ్వరులు అయిపోతారు అని లంగా కోతలు కోయకండి. ఎంతవరకు చేయగలరో అంతవరకే ప్రామిస్ చేయండి.
  3. పనికిరాని నిష్ సెలెక్ట్ చేసుకోవడం: ఎవడో కోట్లు సంపాదించాడు అని చెప్పి మీకు ఏమాత్రం అవగాహన లేని నిష్ లోకి వెళ్లకండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న, లోకల్ గా డిమాండ్ ఉన్న నిష్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి.
  4. మార్కెటింగ్ చేయకపోవడం: టూల్స్ నేర్చుకోవడం ఎంత ముఖ్యమో, మన సర్వీసులను మార్కెటింగ్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. మార్కెటింగ్ చేయకపోతే మీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా ఎవరికీ తెలియదు.

My suggestions : లోకల్ గా నెట్‌వర్క్ బిల్డ్ చేసుకోండి, లేకపోతే చాలా కష్టం అవుతుంది మొదట్లో!

చివరగా నేను చెప్పేది ఏంటంటే బ్రో, మన లోకల్ ఏరియాలోనే చాలా వ్యాపారాలు ఉన్నాయి. వాళ్లకి టెక్నాలజీ గురించి అస్సలు తెలియదు. అలాంటి వాళ్లను కలిసి వాళ్ల బిజినెస్ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని, వాటికి AI తో సొల్యూషన్స్ చూపించండి. మొదట్లో మొహమాట పడకుండా కష్టపడితే, ఆరు నెలల తర్వాత మీ పొజిషన్ చాలా బెటర్ గా ఉంటుంది.

నాది గోదావరి జిల్లా. మీది కూడా గోదావరి అయితే సంతోషం, లేదు ఏ తెనాలో , చిత్తూరో అయినా ఇంకా సంతోషం. అందరం మనోళ్ళే కదా. ఈ బ్లాగ్ కింద వీలైతే ఒక కామెంట్ పెట్టండి, లేదా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నేను కింద కొన్ని ముఖ్యమైన లింకులు ఇచ్చాను, వాటిని చూస్తే మీకు ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. ఉంటాను బ్రో!

Leave a Comment