How to Build a YouTube Automation Setup Using n8n and Google Veo 3

రేయ్ తమ్ముడూ! రోజుకు పది గంటలు చేతకాని దద్దమ్మలా మంచం మీద పడుకుని ఫోన్ లో Instagram Reels స్క్రోల్ చేస్తూ నీ time మొత్తం మొగ్గ చేసుకుంటుంటే నీకు కనీసం సిగ్గుగా అనిపించడం లేదారా తమ్ముడూ? నీలో ఉన్న క్రియేటివిటీ ఏమైంది? నీ Consistency ఏమైంది? అస్సలు నీ బుర్రలో గుజ్జు ఉందా లేక పిచ్చోడి చేతిలో రాయిలా నీ లైఫ్ ని ఎటు పడితే అటు నెట్టేసుకుంటూ సంక నాకడానికి సిద్ధపడుతున్నావా? దీనికి బదులు ఆ టైంని AI Automation Agency లాంటి స్కిల్ నేర్చుకోడానికి వాడితే జీవితం మారిపోతుందిగా. బయట తిరిగే ఎంతోమంది తుప్పాసి వెధవలు చెప్పే సోది కబుర్లు, బోడి సలహాలు వింటూ రోజులు గడిపేస్తే చివరికి రోడ్డు పక్కన నిలబడి అడుక్కుతినే పరిస్థితి వస్తుందిరా తమ్ముడూ. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే, ఇప్పుడైనా ఆ స్క్రోలింగ్ వదిలేసి కొంచెం టెక్నాలజీ మీద ఫోకస్ పెట్టు.

ఈరోజు నీ బద్ధకాన్ని పీకి అవతల పారేసి, రోజంతా లాప్‌టాప్ ముందు కూర్చుని గొడ్డు చాకిరి చేయకుండా, Background లో సిస్టమే మొత్తం రన్ చేసుకుంటూ వెళ్లేలా ఒక దారుణమైన ఆటోమేషన్ బిల్డ్ చేయబోతున్నాం. ఈ గైడ్ లో how to build an n8n Google Veo3 YouTube Automation setup ని నీ సిస్టమ్ లో ఎలా Configure చేయాలో ప్రతి ఒక్క పారామీటర్ తో సహా సవివరంగా చెప్పబోతున్నాను. దీనివల్ల నువ్వు పడుకున్నా సరే నీ YouTube ఛానల్ లో వీడియోలు పడుతూనే ఉంటాయి. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి, అలాగే నీ బ్యాంక్ account కి బుర్రపాడు అయ్యేలా చెయ్యటానికీ ఇదొక్కటే నీకు దారి. ఎదవ మొహం వేసుకుని కూర్చోకుండా వెంటనే ఈ మాస్టర్ గైడ్ మొత్తం చదువు తమ్ముడూ! ఇదే స్కిల్‌తో WhatsApp AI ఏజెంట్ కూడా బిల్డ్ చేసి రెండో ఇన్‌కమ్ స్ట్రీమ్ పెట్టుకోవచ్చు.

Table of Contents

అసలు ఆటోమేషన్ అంటే ఏంటి? – Why you must automate YouTube channels using AI immediately!

బయట YouTube ఆటోమేషన్ కోర్సులు అని చెప్పి నీ దగ్గర వేల రూపాయలు దండుకునే పెద్ద తోపుగాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చెప్పే సొల్లు కబుర్లు విన్నావా, నీ జేబుకి ఒక పెద్ద బొక్క పడటం గ్యారెంటీ. వాళ్ళు నీకు నెలకు లక్షలు వచ్చేస్తాయి అని సోల్లు చెప్తూ ట్రాప్ చేస్తారు. చివరికి నీకు మిగిలేది బూడిదలో పోసిన పన్నీరు మాత్రమే. అసలు నిజమైన ఆటోమేషన్ అంటే నువ్వు ఒక్క క్లిక్ కూడా చేయకుండా, నీ ఐడియా నుండి వీడియో జనరేషన్ వరకు, టైటిల్ క్రియేషన్ నుండి అప్‌లోడింగ్ వరకు అంతా బ్యాక్‌గ్రౌండ్ లో జరిగిపోవాలి. ఇప్పుడే మనం ఎలాంటి మ్యాన్యువల్ వర్క్ లేకుండా automation చేయడానికి n8n అనే కిరాక్ Open-Source టూల్ ని వాడుతున్నాం.

ఈ ఆటోమేషన్ ద్వారా నువ్వు Google షీట్ లో ఒక చిన్న ఐడియా రాసి పడేస్తే చాలు, Fal AI లో ఉన్న గూగుల్ వాడి లేటెస్ట్ Veo3 మోడల్ ఆ ఐడియాని అద్భుతమైన వీడియోగా మారుస్తుంది. ఆ తర్వాత OpenAI కి చెందిన GPT-4o-mini దానికి కిరాక్ టైటిల్స్ రాస్తుంది. ఆ వీడియో ఆటోమేటిక్ గా Google Drive లో బ్యాకప్ అయ్యి, చివరకు YouTube లోకి PRIVATE మోడ్ లో అప్‌లోడ్ అయిపోతుంది. వినడానికే పిచ్చెక్కిపోతోంది కదా? అందుకే చెప్తున్నా,

“చేతకాని వాడే ఎప్పుడూ పాత పద్ధతులని పట్టుకుని ఏడుస్తాడు. చేతనున్నవాడు టెక్నాలజీని వాడుకుని బ్యాక్‌గ్రౌండ్ లో పని పూర్తి చేసుకుని పండగ చేసుకుంటాడు.”— అని ఒక మహానుభావుడు చెప్పాడు!

ఈ వర్క్‌ఫ్లో ని నువ్వు సరిగ్గా సెటప్ చేసుకుంటే నీకు రోజుకు కనీసం నాలుగైదు గంటల టైం మిగులుతుంది. ఆ టైంలో నువ్వు వేరే పనులు చూసుకోవచ్చు లేదా హ్యాపీగా నీ లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు. కావాలంటే ఆ ఖాళీ టైంలో AI Voiceover Business లాంటి ఇంకో స్కిల్ నేర్చుకో, ఇన్‌కమ్ డబుల్ అవుతుంది.

A complete masterclass on workflow setup for YouTube automation in Telugu, showing Andhra Pradesh unemployed youth how to launch scalable Telugu side hustles using automated workflows.

Tools Setup & అకౌంట్స్ క్రియేషన్ – Detailed Prerequisites and API Key Management

రేయ్! బిల్డింగ్ కట్టేటప్పుడు పునాది ఎంత ముఖ్యమో, మన వర్క్‌ఫ్లో రన్ అవ్వడానికి ఈ కింద చెప్పే టూల్స్ సెటప్ చేయడం అంత ముخ్యం. ఏ మాత్రం అల్లాటప్పాగా తీసుకున్నా నీ వర్క్‌ఫ్లో మధ్యలోనే తుస్సుమని ఆగిపోతుంది. అప్పుడు మళ్లీ తల గోక్కంటూ నా దగ్గరికి రాకు. నీకు గూగుల్ షీట్ క్రియేట్ చేయడం కూడా రాకపోతే అసలు నువ్వు n8n Google Veo3 YouTube Automation setup ఎలా చేస్తావు తమ్ముడూ ? అందుకే కింద చెప్పిన ప్రతి స్టెప్ ని జాగ్రత్తగా ఫాలో అవ్వు. బేసిక్స్ నుండి నేర్చుకోవాలంటే Custom API Integration గైడ్ కూడా ఒకసారి చూడు.

1. Google Sheets లో డేటాబేస్ రెడీ చేసుకోవడం

ముందుగా నీ Google Drive లో ఒక కొత్త Google Sheets క్రియేట్ చెయ్. దానికి Video Google Veo3 అని పేరు పెట్టుకో. ఆ షీట్ లో కింద చెప్పిన కాలమ్స్ ని కచ్చితంగా మొదటి లైన్ లో (Header Row) క్రియేట్ చేయాలి:

  • PROMPT: ఇక్కడ నువ్వు క్రియేట్ చేయాలనుకుంటున్న వీడియో యొక్క పూర్తి డిస్క్రిప్షన్ రాయాలి.
  • DURATION: వీడియో లెంత్ సెకన్లలో రాయాలి (ఉదాహరణకు 5 లేదా 10 అని ఇవ్వాలి).
  • VIDEO: ఈ కాలమ్ ని ఖాళీగా వదిలేయ్. వీడియో తయారయ్యాక సిస్టమే ఆటోమేటిక్ గా Google Drive లింక్ ని ఇక్కడ రాస్తుంది.
  • YOUTUBE_URL: దీనిని కూడా ఖాళీగా వదిలేయ్. వీడియో YouTube లో అప్‌లోడ్ అయ్యాక ఆ లింక్ ఇక్కడికి వస్తుంది.
  • row_number: System rows ని ట్రాక్ చేయడానికి దీనిని వాడుకుంటుంది. ఇది ఆటోమేటిక్ గా n8n ద్వారా అప్‌డేట్ అవుతుంది.

ఇలాంటి డేటా ట్రాకింగ్ లాజిక్ నే Local Business Review Management సర్వీస్ లో క్లయింట్ రిపోర్ట్స్ కి కూడా వాడొచ్చు.

2. Fal AI API కీ క్రియేట్ చేసుకోవడం – setup Google Veo3 with n8n

google veo 3 ని వాడటానికి మనం Fal AI అనే ప్లాట్‌ఫామ్‌ని వాడుతున్నాం. దీనివల్ల మనకు హై-క్వాలిటీ వీడియో జనరేషన్ యాక్సెస్ దొరుకుతుంది.

  • Fal AI వెబ్‌సైట్‌కి వెళ్లి నీ గూగుల్ అకౌంట్ తో సైన్ అప్ అవ్వు.
  • నీ అకౌంట్ ప్రొఫైల్ సెక్షన్ లోకి వెళ్లి ఒక కొత్త API Key ని జనరేట్ చేసుకో.
  • ఆ KEY ని కాపీ చేసి ఒక నోట్‌ప్యాడ్ లో దాచుకో. n8n లో HTTP Request నోడ్ లో వాడేటప్పుడు Header లో దీనిని ఎలా యాడ్ చేయాలో కింద చెప్తాను.

3. OpenAI API Key మరియు క్రెడిట్స్ సెటప్

మన వీడియోలకి SEO ఫ్రెండ్లీ టైటిల్స్ రాయడానికి మనం OpenAI కి చెందిన GPT-4o-mini మోడల్ ని వాడుతున్నాం.

  • OpenAI Developer Console లోకి లాగిన్ అవ్వు.
  • నీ ప్రొఫైల్ లోని బిల్లింగ్ సెక్షన్ కి వెళ్లి కనీసం 5 డాలర్లు యాడ్ చెయ్. (450rs) ఫ్రీ ట్రయల్ Keys వాడితే రేట్ లిమిట్ ఎర్రర్స్ వచ్చి వర్క్‌ఫ్లో మధ్యలోనే మొగ్గ అయిపోతుంది. బడ్జెట్ ఇష్యూ అయితే Claude Code కి ఆల్టర్నేటివ్ option కూడా చూడు, ఖర్చు తక్కువ.
  • API Keys సెక్షన్ లోకి వెళ్లి ఒక కొత్త సీక్రెట్ కీ ని క్రియేట్ చేసుకొని కాపీ చేసి పెట్టుకో.

4. Upload-Post API ద్వారా YouTube ఛానల్ కనెక్ట్ చేయడం

వీడియో ఫైల్స్ ని డైరెక్ట్ గా YouTube లోకి అప్‌లోడ్ చేయడానికి మనం Upload-Post అనే అద్భుతమైన API సర్వీస్ ని వాడుతున్నాం.

  • Upload-Post వెబ్‌సైట్ లో రిజిస్టర్ అవ్వు. వాళ్ళు ప్రతి నెల 10 అప్‌లోడ్స్ ఫ్రీగా ఇస్తారు.
  • నీ YouTube ఛానల్ ని ప్రొఫైల్స్ ట్యాబ్ లో యాడ్ చేసుకో.
  • కనెక్ట్ అయ్యాక, నీకు ఒక API Key జనరేట్ అవుతుంది. దాన్ని కూడా దాచుకో.
  • Temp emails తో login avvu (unlimited free limit వస్తుంది , బుర్ర పెట్టారా తమ్ముడూ )

14-Node n8n Workflow Construction – ప్రతి నోడ్ ని పక్కాగా కాన్ఫిగర్ చేసే విధానం

ఇప్పుడు అసలైన టెక్నికల్ topics కి వద్దాం. నీ వర్క్‌ఫ్లో లో ఉన్న 14 నోడ్స్ ని n8n కాన్వాస్ మీద ఎలా సెటప్ చేయాలో, ఏ ఏ ఫీల్డ్స్ లో ఎలాంటి values ఇవ్వాలో ఇక్కడ చాలా వివరంగా చెప్తాను. ఏ మాత్రం తప్పు చేసినా వర్క్‌ఫ్లో మధ్యలోనే ఆగిపోయి నీకు చుక్కలు చూపిస్తుంది. ఇలాంటి టెక్నికల్ పేషన్సే No-Code AI SaaS బిల్డ్ చేసేటప్పుడు కూడా చూపించాలి.

Node 1: manualTrigger (When clicking ‘Test workflow’)

ఈ నోడ్ ని మనం కేవలం టెస్టింగ్ కోసం వాడుకుంటాం. మనం బిల్డ్ చేసేటప్పుడు ప్రతిసారి వెయిట్ చేయకుండా, ఈ నోడ్ ని క్లిక్ చేయగానే డేటా మొత్తం ఫ్లో అవుతుంది.

  • ఎలా యాడ్ చేయాలి: n8n కాన్వాస్ లో ‘+’ బటన్ క్లిక్ చేసి manualTrigger అని టైప్ చేసి యాడ్ చెయ్.
  • కాన్ఫిగరేషన్: దీనికి ఎలాంటి అదనపు సెట్టింగ్స్ అవసరం లేదు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఉంచితే చాలు.

Node 2: Schedule Trigger (scheduleTrigger)

A diagrammatic workflow illustrating YouTube automation using n8n and Google Veo 3, presenting a unique new business idea telugu.  YouTube automation workspace

మనం సిస్టమ్ ని ఆటోమేటిక్ గా, మన వేలు పెట్టే పని లేకుండా రన్ చేయాలి కాబట్టి ఈ నోడ్ ని వాడతాం.

  • ఎలా యాడ్ చేయాలి: కాన్వాస్ లో Schedule Trigger ని సెలెక్ట్ చెయ్.
  • కాన్ఫిగరేషన్: Trigger Interval ని Minutes గా సెలెక్ట్ చేసుకొని, ప్రతి 5 లేదా 10 నిమిషాలకు రన్ అయ్యేలా సెట్ చేసుకో. దీనివల్ల నువ్వు గాఢ నిద్రలో ఉన్నా సరే, సిస్టమ్ ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి నీ గూగుల్ షీట్ ని చెక్ చేసి కొత్తగా యాడ్ చేసిన ప్రాంప్ట్స్ ని రన్ చేస్తుంది. ఇదే లాజిక్ Google Gemini Ecosystem కంటెంట్ బిజినెస్ లో కూడా వర్తిస్తుంది. చాల వివరంగా బ్లాగ్ రాసాను, కుదిరితే చూడు తమ్ముడూ!

Node 3: Get new video (Google Sheets Node) – how to run YouTube automation with Google Sheets

Google Sheet లో మనం రాసిన వీడియో ఐడియాలను రీడ్ చేయడానికి ఈ నోడ్ ఉపయోగపడుతుంది.

  • ఎలా యాడ్ చేయాలి: Google Sheets అని సెర్చ్ చేసి యాడ్ చెయ్.
  • కాన్ఫిగరేషన్:
  • Resource: Row
  • Operation: Get Many
  • Document: నీ గూగుల్ డ్రైవ్ లో ఉన్న Video Google Veo3 షీట్ ని లింక్ చెయ్.
  • Sheet: Foglio1 (మొదటి ట్యాబ్).
  • Filters UI: ఇక్కడ మెయిన్ లాజిక్ సెట్ చేయాలి. Filter by Column ఆప్షన్ క్లిక్ చేసి, కాలమ్ నేమ్ VIDEO అని సెలెక్ట్ చెయ్. ఆపరేటర్ ని IsEmpty అని సెట్ చేసుకో. దీనివల్ల ఏ రో లో అయితే వీడియో లింక్ ఇంకా అప్‌డేట్ అవ్వలేదో, ఆ కొత్త రికార్డులను మాత్రమే ఇది రీడ్ చేస్తుంది.

Node 4: Set data (Set Node)

sheet నుండి వచ్చిన prompt ని మరియు length ని ప్రాసెస్ చేయడానికి వీలుగా వేరియబుల్ లా కన్వర్ట్ చేయడానికి ఈ నోడ్ వాడుతాం.

  • ఎలా యాడ్ చేయాలి: Set నోడ్ ని యాడ్ చెయ్.
  • కాన్ఫిగరేషన్:
  • Mode: Assign Values
  • Name: prompt
  • Type: String
  • Value: ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ బాక్స్ ఓపెన్ చేసి, డబుల్ కర్లీ బ్రేసెస్ లోపల $json.PROMPT అని ఇచ్చి, దాని పక్కనే వీడియో డ్యూరేషన్ ని కూడా యాడ్ చేయాలి. ఉదాహరణకు: Double curly braces open $json.PROMPT double curly braces close అని ఇవ్వాలి. దీనివల్ల ప్రాంప్ట్ టెక్స్ట్ పక్కాగా ఫార్మాట్ అవుతుంది.

Node 5: Create Video (HTTP Request Node) – connect Fal AI video API in n8n

ఈ node ద్వారానే మనం Fal AI కి కనెక్ట్ అయ్యి google veo 3 మోడల్ తో వీడియో జనరేషన్ ని ట్రిగ్గర్ చేస్తాం.

  • ఎలా యాడ్ చేయాలి: HTTP Request అని టైప్ చేసి యాడ్ చెయ్.
  • కాన్ఫిగరేషన్:
  • Method: POST
  • URL: https://queue.fal.run/fal-ai/veo3
  • Authentication:Generic Credential Type సెలెక్ట్ చేసుకొని, Header Auth ఎంచుకో.
    • Name: Authorization
    • Value: Key అని టైప్ చేసి ఒక స్పేస్ ఇచ్చి నీ Fal AI API కీ ని పేస్ట్ చెయ్ (ఉదాహరణకు: Key 123456...).
  • Headers: Content-Type: application/json అని ఒక హెడర్ ని యాడ్ చెయ్.
  • Body Parameters: JSON సెలెక్ట్ చేసుకొని, బాడీలో {"prompt": "double curly braces open $json.prompt double curly braces close"} అని మ్యాప్ చెయ్. దీనివల్ల మన ప్రాంప్ట్ Fal AI సర్వర్ కి సక్సెస్ ఫుల్ గా సబ్మిట్ అవుతుంది.

Node 6: Wait 60 sec. (Wait Node)

వీడియో రెండర్ అవ్వడానికి గూగుల్ వీయో కి కనీసం ఒక నిమిషం టైం పడుతుందిరా బాబ్జీ. రిక్వెస్ట్ పంపిన వెంటనే ఫైల్ వచ్చేయదు. కాబట్టి మనం వర్క్‌ఫ్లో ని కొద్దిసేపు హోల్డ్ లో పెట్టాలి.

  • ఎలా యాడ్ చేయాలి: Wait నోడ్ ని యాడ్ చెయ్.
  • కాన్ఫిగరేషన్:
  • Amount: 60
  • Unit: Seconds
  • దీనివల్ల వర్క్‌ఫ్లో 60 సెకన్ల పాటు ఆగి, ఆ తర్వాత నెక్స్ట్ నోడ్ కి వెళ్తుంది.

Node 7: Get status (HTTP Request Node)

60 సెకన్ల తర్వాత మన వీడియో తయారైందో లేదో Fal AI సర్వర్ ని అడిగి తెలుసుకోవడానికి ఈ నోడ్ ఉపయోగపడుతుంది.

  • ఎలా యాడ్ చేయాలి: ఇంకొక HTTP Request నోడ్ ని యాడ్ చెయ్. దానికి Get status అని పేరు పెట్టుకో.
  • కాన్ఫిగరేషన్:
  • Method: GET
  • URL: https://queue.fal.run/fal-ai/veo3/requests/ అని టైప్ చేసి దాని పక్కనే ఎక్స్‌ప్రెషన్ ద్వారా Create Video నోడ్ నుండి వచ్చిన request_id ని మ్యాప్ చెయ్. చివరగా /status అని రాయాలి.
  • Authentication: సేమ్ Fal AI Header Auth ని సెలెక్ట్ చేసుకో.

Node 8: Completed? (IF Node)

ఈ నోడ్ మన వర్క్‌ఫ్లో కి ఒక బ్రెయిన్ లాంటిది. వీడియో స్టేటస్ ని బట్టి కండిషన్ చెక్ చేస్తుంది.

  • ఎలా యాడ్ చేయాలి: IF నోడ్ ని యాడ్ చెయ్. దానికి Completed? అని పేరు పెట్టుకో.
  • కాన్ఫిగరేషన్:
  • Conditions: String Comparison సెలెక్ట్ చెయ్.
  • Value 1: Get status నోడ్ నుండి వచ్చిన రెస్పాన్స్ లోని status వేరియబుల్ ని మ్యాప్ చెయ్.
  • Operation: Equal
  • Value 2: COMPLETED
  • లూప్ లాజిక్: ఒకవేళ స్టేటస్ COMPLETED అయితే (True branch), మన వీడియో రెడీ అయిపోయినట్టు. ఒకవేళ ఇంకా క్యూ లో ఉంటే (False branch), దీని అవుట్‌పుట్ ని మళ్లీ వెనక్కి తీసుకెళ్లి ‘Wait 60 sec.’ నోడ్‌ కి కనెక్ట్ చేయాలి. దీనివల్ల వీడియో తయారయ్యే వరకు ఈ లూప్ తిరుగుతూనే ఉంటుంది.

Node 9: Get Url Video (HTTP Request Node) – render AI videos automatically via API

status కంప్లీట్ అయ్యాక, ఆ వీడియో ఫైనల్ డౌన్‌లోడ్ లింక్ ని సర్వర్ నుండి తెచ్చుకోవడానికి ఈ నోడ్ ని వాడతాం.

  • ఎలా యాడ్ చేయాలి: మరొక HTTP Request నోడ్ ని యాడ్ చెయ్.
  • కాన్ఫిగరేషన్:
  • Method: GET
  • URL: https://queue.fal.run/fal-ai/veo3/requests/ అని టైప్ చేసి దాని పక్కనే మన క్యూ ఐడీని మ్యాప్ చెయ్.
  • Authentication: సేమ్ Fal AI Header Auth క్రెడెన్షియల్స్ ని వాడుకో.
  • దీని రెస్పాన్స్ లో మనకు video.url మరియు video.file_name లభిస్తాయి.

ఇలాంటి డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్ AI Resume Optimization సర్వీస్‌లో పోర్ట్‌ఫోలియో ఫైల్స్ కోసం కూడా అవసరం పడుతుంది.

Node 10: Generate title (OpenAI Node) – generate titles using GPT-4o YouTube title generator

వీడియో అయితే రెడీ అయింది, కానీ దానికి సరైన కిరాక్ టైటిల్ లేకపోతే వ్యూస్ రావు. అందుకే GPT-4o-mini తో పవర్‌ఫుల్ SEO ఆప్టిమైజ్డ్ టైటిల్ ని క్రియేట్ చేయిస్తాం. టైటిల్స్ ఒక్కటే కాదు, SEO స్ట్రాటజీ మొత్తం Gemini తో ప్లాన్ చేసుకుంటే రీచ్ ఇంకా పెరుగుతుంది.

  • ఎలా యాడ్ చేయాలి: OpenAI నోడ్ ని యాడ్ చెయ్.
  • కాన్ఫిగరేషన్:
  • Resource: Chat
  • Model: gpt-4o-mini
  • System Prompt: “You are a YouTube SEO expert specialized in creating engaging and optimized titles. Generate a catchy, click-worthy title under 60 characters in the same language as the input prompt. Output ONLY the title.”
  • User Prompt: Input: double curly braces open $('Get new video').item.json.PROMPT double curly braces close
A complete visual diagram showing how to build a free loop workflow for YouTube automation in Telugu, enabling Andhra Pradesh unemployed youth to establish automated Telugu side hustles.

No posts

Node 11: Get File Video (HTTP Request Node)

Fal AI సర్వర్ నుండి ఆ వీడియో ఫైల్ ని బైనరీ డేటా లా డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ నోడ్ ని వాడతాం.

  • ఎలా యాడ్ చేయాలి: ఒక HTTP Request నోడ్ ని యాడ్ చెయ్.
  • కాన్ఫిగరేషన్:
  • Method: GET
  • URL: Get Url Video నోడ్ నుండి వచ్చిన video.url ని ఇక్కడ మ్యాప్ చెయ్.
  • Response Format: ఇక్కడ కచ్చితంగా File అని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే ఫైల్ బైనరీ డేటా లా n8n మెమరీ లోకి లోడ్ అవుతుంది. (ఇంత టెక్నికల్ డెప్త్ వచ్చేసిందంటే, T-Hub లాంటి incubators కి apply చేయడానికి నువ్వు రెడీ.)

Node 12: Upload Video (Google Drive Node) – setting up Google Drive backup automation for AI videos

డౌన్‌లోడ్ అయిన వీడియో ఫైల్స్ ని భవిష్యత్తు అవసరాల కోసం మన Google Drive లో భద్రపరచుకోవాలి.

  • ఎలా యాడ్ చేయాలి: Google Drive నోడ్ ని యాడ్ చెయ్.
  • కాన్ఫిగరేషన్:
  • Resource: File
  • Operation: Upload
  • File Name: {{ $now.format('yyyyLLddHHmmss') }}-video.mp4 అని ఇవ్వాలి. దీనివల్ల ఫైల్స్ మిక్స్ అవ్వకుండా కరెంట్ టైమ్‌స్టాంప్ తో సేవ్ అవుతాయి.
  • Folder ID: నీ Google Drive లో క్రియేట్ చేసిన ఫోల్డర్ ID ని ఇక్కడ పేస్ట్ చెయ్.

Node 13: Update result (Google Sheets Node) – integrating Google Sheets with YouTube API using n8n

Google Drive లో అప్‌లోడ్ అయిన వీడియో లింక్ ని తిరిగి మన షీట్ లో అప్‌డేట్ చేయడానికి ఈ నోడ్ ని వాడతాం.

  • ఎలా యాడ్ చేయాలి: Google Sheets నోడ్ ని యాడ్ చెయ్. దానికి Update result అని పేరు పెట్టుకో.
  • కాన్ఫిగరేషన్:
  • Resource: Row
  • Operation: Update
  • Document: నీ గూగుల్ షీట్ ని సెలెక్ట్ చెయ్.
  • Row Number: double curly braces open $('Get new video').item.json.row_number double curly braces close
  • Columns to Update: VIDEO కాలమ్ ని సెలెక్ట్ చేసుకొని, దానికి Google Drive నోడ్ నుండి వచ్చిన వెబ్ వ్యూ లింక్ ని మ్యాప్ చెయ్.

Node 14: HTTP Request (Upload-Post Node) – sending videos to social media using Upload-Post API workflow

A comprehensive digital entrepreneurship guide covering freelance AI business models and remote work opportunities, highlighting low investment business ideas in telugu for unemployed youth.

చివరిగా మన వీడియో ని డైరెక్ట్ గా YouTube లోలోకి అప్‌లోడ్ చేసే అల్టిమేట్ నోడ్ ఇది.

  • ఎలా యాడ్ చేయాలి: చివరి HTTP Request నోడ్ ని యాడ్ చెయ్.
  • కాన్ఫిగరేషన్:
  • Method: POST
  • URL: https://api.upload-post.com/api/upload
  • Authentication:Header Auth సెలెక్ట్ చేసుకొని..
    • Name: Authorization
    • Value: Apikey YOUR_UPLOAD_POST_API_KEY
  • Body Type: Form-Data
  • Parameters:
    • title: Generate title నోడ్ నుండి వచ్చిన కంటెంట్ ని మ్యాప్ చెయ్.
    • user: నీ Upload-Post యూజర్ నేమ్ ని రాయాలి.
    • platform[]: youtube
    • video: టైప్ ని Binary గా సెలెక్ట్ చేసుకొని, వాల్యూ గా data అని ఇవ్వాలి (మన Get File Video నోడ్ నుండి వచ్చిన బైనరీ డేటా).
  • ఈ నోడ్ సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యాక, మనకు YouTube వీడియో ఐడీ రెస్పాన్స్ గా వస్తుంది. ఆ తర్వాత ‘Update Youtube URL’ నోడ్ ని వాడి మన గూగుల్ షీట్ లోని YOUTUBE_URL కాలమ్ లో ఆ లింక్ ని అప్‌డేట్ చేసుకోవాలి.

ఎర్రర్స్ రాకుండా చేయడం ఎలా? – configuring n8n HTTP Request tutorial for video generation

రేయ్ తమ్ముడూ! ఆటోమేషన్ బిల్డ్ చేయడం ఒక ఎత్తైతే, మధ్యలో వచ్చే ఎర్రర్స్ ని హ్యాండిల్ చేయడం ఇంకొక ఎత్తు. నువ్వు ఎర్రర్స్ ని సరిగ్గా డీబగ్ చేయకపోతే, n8n Google Veo3 YouTube Automation setup అనేది మధ్యలోనే ఆగిపోయి నీకు చుక్కలు కనపడతాయి. అందుకే ఈ కింద చెప్పే Troubleshooting గైడ్ ని జాగ్రత్తగా చూసుకో.

1. Fal AI Timeout ఎర్రర్స్ ని హ్యాండిల్ చేయడం

google veo 3 అనేది చాలా హెవీ మోడల్ కాబట్టి, కొన్నిసార్లు వీడియో జనరేట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అలాంటి సమయంలో మన HTTP Request నోడ్ టైమౌట్ అయిపోయే ఛాన్స్ ఉంది.

  • Solution : n8n లో ఉన్న Create Video మరియు Get status నోడ్స్ యొక్క Settings ట్యాబ్ లోకి వెళ్ళు. అక్కడ Retry on Fail ఆప్షన్ ని ఎనేబుల్ చెయ్.
  • Retry attempts: 3 అని పెట్టు.
  • Delay between retries: 10000 (10 సెకన్లు) అని సెట్ చెయ్. దీనివల్ల ఒకవేళ ఏపీఐ ఫెయిల్ అయినా సరే, కంగారు పడకుండా సిస్టమ్ 10 సెకన్లు ఆగి మళ్లీ ట్రై చేస్తుంది.

2. OpenAI Billing / Rate Limit ఇష్యూస్

నువ్వు OpenAI కి కార్డ్ లింక్ చేయకుండా ఫ్రీ ట్రయల్ లో వాడదామనుకుంటే మాత్రం నీకు 429 Rate Limit ఎర్రర్ వస్తుంది.

  • Solution : OpenAI ప్లాట్‌ఫామ్‌లో బిల్లింగ్ సెటప్ చేసి కనీసం 5 డాలర్లు యాడ్ చెయ్. అలాగే gpt-4o-mini వాడుతున్నావ్ కాబట్టి ఖర్చు చాలా తక్కువ అవుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. డబ్బు ఇంకా ప్లాన్ కావాలంటే AI Finance Side Hustle ఐడియాలు కూడా చదువు మరి!

3. Google Sheets Connection ఇష్యూస్

గూగుల్ షీట్ లో ఒకేసారి వందల రోస్ ని రీడ్ చేయడం వల్ల రేట్ లిమిట్ ఇష్యూస్ రావచ్చు.

  • Solution : మన Schedule Trigger ని ప్రతి సెకనుకి రన్ చేయకుండా, 5 లేదా 10 నిమిషాల గ్యాప్ తో రన్ అయ్యేలా సెట్ చేసుకోవడం వల్ల గూగుల్ రేట్ లిమిట్ సమస్య ఉండదు.
Node Setup StepExact Parameter ConfigurationError Handling Action
Get new videoFilter Row where VIDEO is nullRetry on Fail: On (2 times)
Create VideoPOST https://queue.fal.run/fal-ai/veo3Dynamic input mapping, Timeout: 120s
Get StatusGET status loop with 60s delayRedirect to Wait node if status is IN_PROGRESS
Upload VideoGDrive folder upload with binary fileCatch storage limit exceptions automatically

AI వీడియోలతో YouTube ఛానల్స్ డిలీట్ అవుతాయా? – how to monetize AI videos on YouTube నిరూపించే సత్యాలు!

కొంతమంది సోషల్ మీడియాలో తిరిగే తుప్పాసి ఎదవలు ఒక దరిద్రపు సోది కబురు చెప్తుంటారు. “AI వీడియోలు పెడితే YouTube ఛానల్స్ డిలీట్ అయిపోతాయి, అసలు మోనిటైజేషన్ అవ్వదు” అని నెత్తిన నోరు బాదుకుంటూ వాగుతుంటారు. రేయ్ ఎర్రిపప్పల్లారా! ఒక్క నిమిషం బుర్ర పెట్టి ఆలోచించండిరా.

YouTube అనేది ఎవరి ప్రొడక్ట్? Google ది! Google Veo3 అనేది ఎవరి ప్రొడక్ట్? Google ది! Gemini AI అనేది ఎవరి ప్రొడక్ట్? Google ది! తన సొంత టెక్నాలజీని వాడుకుని, తన ప్లాట్‌ఫామ్‌లోనే వీడియోలు క్రియేట్ చేస్తుంటే గూగుల్ ఎందుకు బ్యాన్ చేస్తుందిరా? గూగుల్ వాడే Veo3 ని ప్రమోట్ చేసుకోవడానికి చూస్తుంటే, వీళ్ళు మాత్రం ఛానల్స్ డిలీట్ అవుతాయి అని తుప్పాసి మొహాలు వేసుకుని తిరుగుతున్నారు. అసలు Google AI వీడియోలని బ్యాన్ చేయదు, కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అదే how to monetize AI videos on YouTube కి అసలైన సీక్రెట్.

ఆ రూల్స్ ఏంటో కింద చూడు:

  • Reused Content ఉండకూడదు: నువ్వు వేరే వాళ్ళ వీడియోలని కాపీ కొట్టి, దానికి రోబోటిక్ వాయిస్ ఓవర్ ఇస్తే మాత్రం YouTube ఒప్పుకోదు. కానీ మనం ఇక్కడ చేసేది ఏంటి? Fal AI ద్వారా ప్యూర్ ఒరిజినల్ అండ్ యూనిక్ వీడియోలని మన సొంత Prompts తో జనరేట్ చేస్తున్నాం. ఇది వంద శాతం ఒరిజినల్ కంటెంట్ కిందకే వస్తుంది.
  • AI Altered Content Label: YouTube Studio లో వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు “Altered content” అనే option ఉంటుంది. అంటే ఈ వీడియోని క్రియేట్ చేయడానికి మనం AI ని వాడాము అని డిక్లేర్ చేయాలి. అలా డిక్లేర్ చేస్తే నీ ఛానల్ కి ఎలాంటి రిస్క్ ఉండదు, హ్యాపీగా యాడ్‌సెన్స్ (AdSense) మోనిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది.
  • Quality Over Quantity: రోజుకు వంద వీడియోలు పెట్టి ఛానల్ ని చెత్త కుప్పలా మార్చకుండా, క్వాలిటీ ఉన్న ఐదు లేదా పది వీడియోలు పెడితే చాలు. వ్యూస్ దారుణంగా వస్తాయి.

మొత్తం AI కే వదిలేస్తే చివరకి సంక నాకిపోతావు! The Ultimate Private to Public Strategy

ఆటోమేషన్ అంటే మొత్తం కంప్యూటర్ కే వదిలేసి నువ్వు హ్యాపీగా మందేసి పడుకోవడం కాదురా. అలా వదిలేస్తే చివరకు నీ ఛానల్ సంక నాకిపోతుంది. ఎంత ఆటోమేషన్ చేసినా, హ్యూమన్ టచ్ (Human Touch) అనేది చాలా ముఖ్యం. అందుకే మనం ఈ step-by-step n8n YouTube publishing guide లో ఒక అల్టిమేట్ సీక్రెట్ స్ట్రాటజీని వాడుతున్నాం.

  • PRIVATE Mode Upload: మన వర్క్‌ఫ్లో లో వీడియో అప్‌లోడ్ అయ్యేటప్పుడు డైరెక్ట్ గా PUBLIC లోకి వెళ్ళకూడదు. ఎప్పుడూ వీడియోని PRIVATE లేదా UNLISTED మోడ్ లోనే అప్‌లోడ్ చేయాలి.
  • Manual Verification (వారానికి ఒకసారి): నువ్వు వారానికి ఒక్క రోజు, శనివారం లేదా ఆదివారం ఒక గంట టైం కేటాయించు. YouTube Studio ఓపెన్ చెయ్. ఆ వారం అప్‌లోడ్ అయిన వీడియోల లిస్ట్‌ని చెక్ చెయ్.
  • Title and Description Optimization: GPT-4o-mini జనరేట్ చేసిన టైటిల్స్ ని ఒకసారి చూడు. దానికి తగ్గట్టుగా Tags, Description ని మ్యాన్యువల్ గా కొంచెం మార్చు. మంచి Thumbnail ని డిజైన్ చేసి యాడ్ చెయ్.
  • Voice Over Add-on : వీలైతే ఆ వీడియో బ్యాక్‌గ్రౌండ్ లో నీ సొంత వాయిస్ ఓవర్ ని కానీ, లేదా మంచి ట్రెండింగ్ మ్యూజిక్ ని కానీ యాడ్ చెయ్. దీనివల్ల నీ వీడియోకి వంద శాతం క్వాలిటీ వస్తుంది.

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే, ఈ సింపుల్ స్టెప్స్ ని ఫాలో అవ్వడం వల్ల నీ ఛానల్ ఆర్గానిక్ గా గ్రో అవుతుంది. నువ్వు కష్టపడకుండా కేవలం ఒక గంట స్మార్ట్ వర్క్ చేస్తే చాలు, మిగతా ఐదు రోజుల పనిని మన n8n వర్క్‌ఫ్లో బ్యాక్‌గ్రౌండ్ లో పూర్తి చేస్తుంది.

Free JSON File & Free WordPress Setup

బయట చాలామంది పెద్ద తోపుగాళ్ళలా బిల్డప్ ఇస్తూ సోది కబుర్లు చెప్తారు కానీ, రూపాయి ఉపయోగం ఉండే పని చేయరు. కానీ నేను అలా కాదురా. నీకు జెన్యూన్ గా హెల్ప్ చేయాలనేదే మా తాపత్రయం.

  1. Free n8n JSON Workflow File: ఈ ఆర్టికల్‌లో మనం మాట్లాడుకున్న 14 నోడ్స్ ఉన్న కంప్లీట్ n8n వర్క్‌ఫ్లో ఫైల్ (JSON) నీకు ఫ్రీగా పంపిస్తాను. నువ్వు దాన్ని జస్ట్ నీ n8n లో ఇంపోర్ట్ చేసుకుంటే చాలు, సెటప్ మొత్తం రెడీ అయిపోతుంది. దీనికోసం నువ్వు నాకు contact page లో ఉన్న మెయిల్ IDకి ఈమెయిల్ చెయ్: సబ్జెక్ట్ లో “Need Veo3 JSON” అని రాయ్, 24గంటల్లో నీ మెయిల్ కి ఫైల్ వచ్చేస్తుంది. దీనికోసం నువ్వు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు.
  2. Free WordPress Website Setup for the Needy: ఒకవేళ నువ్వు జెన్యూన్ గా పేదరికంలో ఉండి, ఏదైనా ఆన్‌లైన్ బిజినెస్ లేదా బ్లాగింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే.. నీకు ఫ్రీగా వెబ్‌సైట్ డిజైన్ చేసి ఇస్తాను. దాంతో పాటు ఒక సంవత్సరం పాటు ఫ్రీగా క్లౌడ్ హోస్టింగ్ కూడా ఇస్తాను. ఎందుకంటే ఆకలితో ఉన్నవాడి బాధ ఏంటో మాకు తెలుసు, మేము కుడా అక్కడ నుంచి వచ్చినవాళ్ళమే తమ్ముడూ. నువ్వు చేయాల్సిందల్లా నీ పరిస్థితిని వివరిస్తూ నాకు మెయిల్ చేయడం మాత్రమే. నువ్వు చెప్పేది correct అని మాకు అనిపిస్తేనే నీకు ఫ్రీ వెబ్సైటు & hosting కుడా ఇష్టము, తేడా గాళ్ళకి మేము రిప్లై కుడా ఇవ్వంరోయ్!

ఇక ఆలస్యం చేయకుండా వెంటనే నీ సిస్టమ్ లో ఈ n8n Google Veo3 YouTube Automation setup ని రన్ చెయ్. బద్ధకాన్ని వదిలేసి ఈ రోజు నుండే నీ YouTube జర్నీని స్టార్ట్ చెయ్. ఆల్ ది బెస్ట్ రా తమ్ముడు!