కొలేటరల్ లేకుండా బిజినెస్ లోన్ | Collateral Free Business Loan: CGTMSE స్కీమ్ తో ఆస్తి లేకపోయినా లోన్ పొందడం ఎలా?

కొలేటరల్ లేకుండా బిజినెస్ లోన్ | Collateral Free Business Loan: CGTMSE స్కీమ్ తో ఆస్తి లేకపోయినా లోన్ పొందడం ఎలా?

సొంతంగా ఒక బిజినెస్ ప్రారంభించాలని లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కానీ బ్యాంక్‌కి వెళ్తే మొదట అడిగే ప్రశ్న “మీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఏ ఆస్తి ఉందో చూపించండి” అని. ఆస్తి, ఇల్లు లేదా ల్యాండ్ సెక్యూరిటీగా పెట్టకపోతే బ్యాంకర్లు ముఖం మీదే లోన్ ఇవ్వమని చెప్పేసరికి చాలామందికి ప్యాంటు తడిసిపోతుందిగా. అయితే కొలేటరల్ లేకపోతే బిజినెస్ చేయలేమా? ప్రభుత్వం దగ్గర దీనికి చక్కటి పరిష్కారం ఉంది.

ఇల్లు తాకట్టు పెడితేనే లోన్ వస్తుంది అనేది 90ల కాలం నాటి మాట. ఇప్పుడు మీ దగ్గర సరైన బిజినెస్ ప్లాన్ ఉంటే ప్రభుత్వం గ్యారెంటర్ గా ఉంటుంది.

భారత ప్రభుత్వం చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల కోసం సెక్యూరిటీ లేకుండా లోన్ అందించేందుకు ఒక ప్రత్యేక ట్రస్ట్ ద్వారా గ్యారెంటీ కల్పిస్తోంది. దీనివల్ల బ్యాంకులు మీ ఆస్తులను గ్యారెంటీగా అడగవు. ఈ పూర్తి ప్రక్రియ మరియు CGTMSE స్కీమ్ వివరాలు స్పష్టంగా తెలుసుకుందాం.

కొలేటరల్ లేకుండా బిజినెస్ లోన్ నిజంగా వస్తుందా? నిజాలు ఇవే!

చాలామంది వ్యాపారులు బ్యాంకుల చుట్టూ తిరగలేక, కొలేటరల్ సెక్యూరిటీ లేదనే భయంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లి అధిక వడ్డీలు కట్టలేక నష్టపోతుంటారు. కానీ కేంద్ర ప్రభుత్వం MSME ల కోసం తెచ్చిన నియమాలు స్పష్టంగా ఉన్నాయి. వ్యాపార ప్రతిపాదన నిజమైనదైతే, బ్యాంకులు ఎలాంటి ఆస్తి హామీ లేకుండా రుణాన్ని మంజూరు చేయాల్సిందే.

బ్యాంకులు లోన్ ఎందుకు రిజెక్ట్ చేస్తాయో అసలు కారణాలు

ఈ విషయాన్ని మరింత వివరంగా అర్థం చేసుకోవడానికి కింద ఉన్న అపోహలు మరియు నిజాల పట్టికను చెక్ చేసుకోండి:

కొలేటరల్ లేకుండా Business Loan నిజంగానే వస్తుందా అనే డౌట్‌కు క్లియర్ ఆన్సర్‌తో పాటు CGTMSE Scheme, Collateral Free Business Loan, MSME Loan Without Security ఎలా పనిచేస్తాయో ఈ గైడ్‌లో ఈజీగా చెప్పాం. InfoPinky Business Advisory Team అంటే లోన్ చెప్పేసి వెళ్లిపోయే వాళ్లు కాదు. ఆంధ్రప్రదేశ్‌లో చిన్న బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ల నుంచి ఇప్పటికే బిజినెస్ చేస్తున్న వాళ్ల వరకు ప్రతి డౌట్‌ని ఓపికగా విని లీగల్, ఫైనాన్స్, బిజినెస్ ఎక్స్‌పర్ట్స్ కలిసి ఫ్రీగా గైడ్ చేసే Telugu Blogs వెనుక ఉన్న టీమ్.
సాధారణ అపోహ (Myth)నిజమైన నిబంధన (Reality)
ఇల్లు లేదా స్థలం తాకట్టు పెట్టకపోతే బ్యాంకులు రూపాయి కూడా ఇవ్వవు.CGTMSE ట్రస్ట్ ద్వారా సెక్యూరిటీ లేకుండా లోన్ రూ. 5 కోట్ల వరకు పొందే అవకాశం ఉంది.
కొత్తగా వ్యాపారం మొదలుపెట్టే వారికి ఈ లోన్ దొరకదు.కొత్త స్టార్టప్‌లు మరియు ఇప్పటికే నడుస్తున్న మైక్రో, స్మాల్ ఎంటర్‌ప్రైజెస్‌ రెండూ అర్హులే.
గవర్నమెంట్ గ్యారెంటీ లోన్ అంటే నెలల తరబడి తిరగాలి.సరైన ప్రొజెక్ట్ రిపోర్ట్ మరియు డాక్యుమెంట్లు ఉంటే డిజిటల్ ప్రాసెస్ ద్వారా త్వరగానే అప్రూవ్ అవుతుంది.
రిటైల్ వ్యాపారులకు ఈ స్కీమ్ వర్తించదు.రిటైల్ మరియు హోల్‌సేల్ ట్రేడర్లు కూడా ఈ స్కీమ్ కింద అర్హులే.

CGTMSE స్కీమ్ వివరాలు: ప్రభుత్వం మీ తరపున గ్యారెంటీ ఎలా ఇస్తుంది?

CGTMSE అంటే “Credit Guarantee Fund Trust for Micro and Small Enterprises”. దీనిని భారత ప్రభుత్వ మైక్రో, స్మాల్ & మీడియో ఎంటర్‌ప్రైజెస్ మంత్రిత్వ శాఖ మరియు SIDBI కలిసి ప్రారంభించాయి. సాధారణంగా ఒక వ్యాపారి బ్యాంకుకు వెళ్లి కొలేటరల్ లేకుండా బిజినెస్ లోన్ (collateral free business loan telugu) కావాలని అడిగినప్పుడు, బ్యాంకర్ తన డబ్బుకు రిస్క్ భావిస్తాడు. ఒకవేళ లోన్ కట్టకపోతే ఆ డబ్బు ఎలా రికవరీ చేయాలో తెలియక భయపడతాడు. వాళ్ళ స్కీమ్‌లు, ఫండింగ్ ఆప్షన్స్ చూడాలంటే SIDBI అఫీషియల్ సైట్ కి వెళ్ళండి.

ఇక్కడే క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ పిక్చర్‌లోకి వస్తుంది. ఈ ట్రస్ట్ బ్యాంకులకు హామీ ఇస్తుంది: “మీరు ఈ వ్యాపారికి లోన్ ఇవ్వండి. ఒకవేళ అతను డిఫాల్ట్ అయినా లేదా బిజినెస్ సరిగ్గా నడవక లోన్ కట్టలేకపోయినా, 75% నుండి 85% వరకు ఆ మొత్తాన్ని మేము బ్యాంకుకి చెల్లిస్తాము.” ఈ ధైర్యంతో బ్యాంకులు ఎటువంటి ఆస్తి తాకట్టు లేకుండా రుణాలను మంజూరు చేస్తాయి. దీన్నే మనం నో కొలేటరల్ MSME లోన్ అని పిలుస్తాం.

నో కొలేటరల్ MSME లోన్ పొందడానికి CGTMSE అర్హత ఎలా చెక్ చేయాలి?

లోన్ అప్లై చేయడానికి ముందు మీ వ్యాపారానికి తగిన CGTMSE అర్హత ఉందో లేదో చెక్ చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఏ ప్లాన్ లేకుండా చేతులు ఉడుపుకుంటూ బ్యాంకుకు వెళ్తే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం చేసి తప్పులు ఏంటో ముందే తెలుసుకోవాలంటే ఇది కూడా ఒకసారి చదవాలి.

  • ఉద్యమ్ రిజిస్ట్రేషన్: మీ బిజినెస్ తప్పనిసరిగా MSME కింద నమోదు అయి ఉండాలి (Udyam Registration Certificate ఉండాలి).
  • వ్యాపార స్వభావం: మ్యానుఫ్యాక్చరింగ్ (ఉత్పత్తి రంగం), సర్వీస్ సెక్టార్ (సేవా రంగం) మరియు ట్రేడింగ్ బిజినెస్‌లు అర్హత సాధిస్తాయి.
  • సిబిల్ స్కోర్: వ్యాపారస్తుడి వ్యక్తిగత సిబిల్ స్కోర్ మరియు క్రెడిట్ హిస్టరీ బాగుండాలి (సాధారణంగా 700+ ఉంటే మంచిది).
  • ప్రాజెక్ట్ రిపోర్ట్: మీ బిజినెస్ మోడల్, భవిష్యత్తు ఆదాయం, ప్రాఫిట్ మార్జిన్స్ వివరించే ప్రాక్టికల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధంగా ఉండాలి.

స్కోర్ తక్కువ ఉన్నా లోన్ ఎలా తెచ్చుకోవాలో ఇక్కడ చెప్పను బ్రో!

వ్యాపార ప్రణాళిక సరిగ్గా లేకపోతే ప్రాజెక్ట్ రిజెక్ట్ అయ్యి మీ ఆశలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి పైసా లెక్కలతో స్పష్టమైన ప్రొజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేసుకోవడం చాలా అవసరం. బిజినెస్ లోన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా రాయాలో కుడా ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫీజు ఎంత ఉంటుంది?

ఉచితంగా ఏదీ రాదు కాబట్టి, ప్రభుత్వం ఇచ్చే ఈ గ్యారెంటీ సేవకు గాను చిన్న మొత్తంలో ఫీజు వసూలు చేస్తారు. ఈ ఫీజును “Guarantee Fee” అని పిలుస్తారు. సాధారణంగా మీరు తీసుకునే లోన్ మొత్తాన్ని బట్టి ఏడాదికి 0.37% నుండి 1.35% వరకు ఈ ఫీజు ఉంటుంది.

ఉదాహరణకు, మీరు ₹10 లక్షల లోన్ తీసుకుంటే, ప్రతి సంవత్సరం బ్యాంకు ద్వారా క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్‌కు కొంత గ్యారెంటీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలు కట్టి రూపాయి రూపాకీ పోగొట్టుకుని చివరకు చొక్కా చింపేసుకుని రోడ్డు మీదపడతారు, దానికంటే ఈ చిన్న గ్యారెంటీ ఫీజు కట్టి బ్యాంకు నుండి చట్టబద్ధమైన లోన్ తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం.

సెక్యూరిటీ లేకుండా లోన్ ఇచ్చే బ్యాంకుల లిస్ట్

భారతదేశంలోని దాదాపు అన్ని ప్రభుత్వ రంగా బ్యాంకులు (Public Sector Banks), ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs) CGTMSE స్కీమ్ కింద లోన్లు ఇస్తున్నాయి.

ప్రధానంగా లోన్ ఇచ్చే కొన్ని బ్యాంకులు:

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • కెనరా బ్యాంక్
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)
  • HDFC బ్యాంక్
  • ICICI బ్యాంక్
  • SIDBI (స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)

పైన లిస్ట్‌లో ఉన్నవన్నీ బ్యాంకులే, కానీ NBFC ల దగ్గరకు వెళ్తే ప్రాసెస్ వేరేలా ఉంటుంది, వడ్డీ కూడా తేడాగా ఉంటుంది. బ్యాంక్ కి, NBFC కి తేడా ఏంటో బ్యాంక్ vs NBFC లోన్ ఆర్టికల్‌లో చాలా క్లియర్ గా చూపించాను.

మీరు బ్యాంకుకు వెళ్ళినప్పుడు మేనేజర్లు మొదట కొలేటరల్ సెక్యూరిటీ లేదా ఇల్లు తాకట్టు పెట్టమని అడిగే అవకాశం ఉంది. అప్పుడు మీరు ధైర్యంగా “నాకు CGTMSE స్కీమ్ కింద కొలేటరల్ లేకుండా బిజినెస్ లోన్ (collateral free business loan) కావాలి” అని స్పష్టంగా చెప్పండి. బ్యాంకర్లు కాగితాలు అడిగినప్పుడు అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా సబ్‌మిట్ చేయండి.

సరైన సమాచారం లేకపోవడం వల్ల చాలామంది వ్యాపారులు మంచి అవకాశాలను వదులుకుంటున్నారు. వ్యాపారం దెబ్బతిని, అప్పుల్లో మునిగిపోయిన తర్వాత నెత్తిన గుడ్డ వేసుకోవటం కంటే, ముందే బ్యాంకింగ్ నిబంధనలను, స్కీమ్ వివరాలను తెలుసుకోవడం తెలివైన పని. సరైన పత్రాలతో అప్లై చేస్తే మీ డ్రీమ్ బిజినెస్ ప్లాన్ ఎప్పటికీ బొంద పెట్టేసి మూలన పడిపోకుండా సక్సెస్ ఫుల్‌గా ముందుకు సాగుతుంది. నీకు ఏమయినా కొత్త ఐడియాస్ ఉంటే మాకు కుడా చెప్పు బ్రో , మాకు కుదిరిన సహాయం ఫ్రీగానే చేస్తాము. కామెంట్ చెయ్యి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *