LinkedIn Job Automation in Telugu – రోజూ Jobs కి Manually Apply చేసి చేసి అలసిపోయారా? ఇప్పుడు AI మీ తరపున Apply చేస్తుంది!
నేను మీకు ఒక విషయం చెప్పాలి.
నాకు Coding రాదు. Programming అంటే ఏమిటో నాకు సరిగ్గా తెలియదు. JavaScript అంటే ఏదో ఒక Language అని తెలుసు, కానీ ఒక్క line కూడా నేను రాయలేను.
అయినా సరే, నేను ఈ రోజు మీకు చెప్పబోతున్న System నేను Build చేశాను. పూర్తిగా. ఒంటరిగా. ఒక్క Rupee కూడా ఖర్చు పెట్టకుండా.
ఎలా అంటే, Claude AI FREE గా వాడుకున్నాలెండి.
Claude.ai కి వెళ్ళండి. అది Free. అక్కడ మీకు ఏమి అర్థం కాకపోయినా అడగండి. అది Telugu లో కూడా Explain చేస్తుంది. ఈ Blog లో ఏదైనా Doubt వస్తే, ఈ Blog మొత్తం Copy చేసి Claude కి Paste చేయండి. అడగండి. అది మీకు Guide చేస్తుంది.
ఇప్పుడు మీకు ఒక్క Question అడుగుతాను.
మీరు LinkedIn తెరిచి, Jobs వెతికి, ఒక్కో Job చదివి, Resume Attach చేసి, Apply Button నొక్కుతున్నారా? రోజూ? గంటలు గంటలు?
అయితే ఈ Blog మీ కోసమే.
LinkedIn Job Automation అంటే ఏమిటి? Complete గా అర్థం చేసుకోండి
చాలా మంది Automation అంటే Coding అనుకుంటారు. కానీ అది కాదు.
Automation అంటే, మీరు చేసే Repetitive పనులు ఒక System చేయడం. మీరు రోజూ LinkedIn తెరిచి Jobs చూస్తారు కదా, అదే పని ఒక System చేయడం. మీరు Resume Attach చేస్తారు కదా, అది కూడా System చేయడం.
ఈ Blog లో మనం Build చేయబోతున్న System ఏమి చేస్తుందంటే:
మీరు ఒక చిన్న Form Fill చేస్తారు. మీరు ఏ Job వెతుకుతున్నారో, ఏ City లో, ఏ Type Job కావాలో అని. అంతే. మిగతాది అంతా ఈ System చేస్తుంది.
ఏం చేస్తుందంటే, LinkedIn లో Active గా ఉన్న Jobs Scrape చేస్తుంది. అంటే వెతికి తీసుకొస్తుంది. తర్వాత మీ Resume చూసి, మీ Skills తో ఆ Job Match అవుతుందా లేదా అని AI Check చేస్తుంది. Match అయిన Jobs కి మీ Resume ని ఆ Job కి Specific గా Rewrite చేస్తుంది. ఆ Company లో Decision తీసుకునే వ్యక్తి Email వెతుకుతుంది. Directly వాళ్ళ Email కి మీ Resume Attach చేసి Mail పంపిస్తుంది.
ఒక్క Click తో. మీరు లేకుండా.
ఇది Job Application Automation without Coding Telugu లో Build చేయగలిగే System. ఒక్క Rupee కూడా Basic Setup కి అవసరం లేదు.

ఈ System Build చేయడానికి ముందు, ఈ Table చూడండి
Node to Node flow మొత్తం ముందు అర్థం చేసుకోండి. తర్వాత Step by Step చేద్దాం.
| Step | Node Name | ఏం చేస్తుందంటే | తర్వాత ఎక్కడికి వెళ్తుందంటే |
|---|---|---|---|
| 1 | Form Trigger | మీరు Fill చేసిన Job Details తీసుకుంటుంది | Edit Fields కి |
| 2 | Edit Fields | కావాల్సిన 3 Fields మాత్రమే తీసుకుంటుంది | Code Node కి |
| 3 | Code Node | LinkedIn Search URL తయారు చేస్తుంది | Get Resume Template కి |
| 4 | Get Resume Template | Google Docs నుంచి మీ Resume తీసుకుంటుంది | Scrape LinkedIn Jobs కి |
| 5 | Scrape LinkedIn Jobs | Apify వాడి LinkedIn Jobs Scrape చేస్తుంది | Wait కి |
| 6 | Wait | 3 Minutes వేచి ఉంటుంది | HTTP Request కి |
| 7 | HTTP Request | Scrape అయిన Jobs Data తీసుకుంటుంది | Limit Results కి |
| 8 | Limit Results | Testing కోసం 1 Job మాత్రమే తీసుకుంటుంది | Filter Jobs with AI కి |
| 9 | Filter Jobs with AI | మీ Skills Match అవుతాయా అని Check చేస్తుంది | Filter True and Website కి |
| 10 | Filter True and Website | Match అయిన Jobs మాత్రమే తీసుకుంటుంది | Rewrite Resume కి |
| 11 | Rewrite Resume | ఆ Job కి Specific గా Resume మారుస్తుంది | Markdown to HTML కి |
| 12 | Markdown to HTML | Resume Format సరిగ్గా చేస్తుంది | Create New Resume కి |
| 13 | Create New Resume | కొత్త Google Doc Create చేస్తుంది | Update a Document కి |
| 14 | Update a Document | Resume Content ఆ Doc లో పెడుతుంది | Get Email కి |
| 15 | Get Email | Decision Maker Email వెతుకుతుంది | Share Resume కి |
| 16 | Share Resume | Google Drive నుంచి Resume Download చేస్తుంది | Create Draft Email కి |
| 17 | Create Draft Email | Resume Attach చేసి Mail పంపిస్తుంది | Done |
ఇది చూసి Panic అవ్వకండి. ఒక్కో Step చాలా Simple గా ఉంటుంది. Claude ఉంది కదా.
How to Apply Jobs Automatically Using n8n – మనకు కావాల్సిన Tools
Tools List and Cost
| Tool | ఏం చేస్తుందంటే | ఎక్కడ దొరుకుతుందంటే | Cost |
|---|---|---|---|
| n8n | Automation Platform | n8n.io | Free Self-hosted |
| Claude AI | మీ Free Guide | claude.ai | Free |
| Apify | LinkedIn Scraper | apify.com | 3 Days Free Trial |
| AnyMailFinder | Decision Maker Email | anymailfinder.com | Free Credits |
| Google Docs | Resume Storage | docs.google.com | Free |
| Google Drive | Resume Download | drive.google.com | Free |
| Gmail | Email Sending | gmail.com | Free |
| OpenAI API | AI Filtering and Rewriting | platform.openai.com | Free Credits |
ఇవన్నీ Free. కానీ Apify కి 3 Days Free Trial మాత్రమే. తర్వాత Paid అవుతుంది. Testing కి 3 Days చాలు.
Build చేయడానికి ముందు ఒక్క పని చేయండి
మీ Resume Google Docs లో పెట్టుకోండి. ఇది చాలా Important.
Google Docs తెరవండి. New Document Create చేయండి. మీ Resume అక్కడ Paste చేయండి. ఆ Document తెరిచి Address Bar లో URL కనిపిస్తుంది కదా, అది Copy చేయండి. పక్కన పెట్టుకోండి. Step 4 లో అది కావాలి.
n8n Automation Tutorial for Beginners in Telugu – Step by Step Node Setup
Step 1: Form Trigger Node
n8n తెరవండి. New Workflow Create చేయండి. ఇప్పుడు మొదటి Node Add చేయాలి.
Search Bar లో “n8n form” అని Type చేయండి. “On Form Submission” అనే Node కనిపిస్తుంది. దాన్ని Click చేయండి.
ఇప్పుడు ఈ Node లో Form Fields Add చేయాలి.
| Field Label | Field Type | Example |
|---|---|---|
| Job Title | Text | Backend Developer |
| Job Location | Text | Hyderabad |
| Job Type | Dropdown | Full-time |
Job Type Dropdown లో ఈ Options Add చేయండి.
| Dropdown Options |
|---|
| Full-time |
| Part-time |
| Internship |
| Contract |
Form Title ఏదైనా ఇవ్వండి. Example: “Get Latest Job Postings” అని ఇవ్వొచ్చు.
Node Connection:
Form Trigger Node ➜ Edit Fields Node
Step 2: Edit Fields Node (Set Node)
Form నుంచి చాలా Data వస్తుంది. Submitted Time, Form Mode, అన్నీ వస్తాయి. కానీ మనకు కావాల్సింది మూడే.
Search Bar లో “Edit Fields” అని Type చేయండి. Pencil Symbol ఉన్న Node కనిపిస్తుంది. దాన్ని తీసుకోండి.
ఇప్పుడు Form Trigger Node Execute చేయండి. Test Form తెరుచుకుంటుంది. అక్కడ ఒక్కసారి Details Fill చేసి Submit చేయండి. అప్పుడు Output లో Data కనిపిస్తుంది.
ఆ Output లో నుంచి ఈ మూడు Fields Map చేయండి.
| Field Name | Map చేయాల్సిన Value |
|---|---|
| Job Title | Form లో Job Title |
| Job Location | Form లో Job Location |
| Job Type | Form లో Job Type |
Node Connection:
Edit Fields Node ➜ Code Node
Step 3: Code Node – LinkedIn Search URL తయారు చేయడం
ఇక్కడ JavaScript Code ఉంటుంది. భయపడకండి. మీరు ఒక్క Line కూడా రాయాల్సిన అవసరం లేదు.
Claude.ai కి వెళ్ళి ఈ Message Paste చేయండి:
“Claude, I am building an n8n workflow for LinkedIn Job Automation. I need a JavaScript Code Node that takes Job Title, Job Location and Job Type from the previous node and builds a LinkedIn jobs search URL. Job Type values will be Full-time, Part-time, Internship or Contract. Convert them to LinkedIn URL codes F, P, I, C respectively. Give me the exact code to paste in n8n Code Node.”
Claude మీకు Exact Code ఇస్తుంది. దాన్ని Copy చేసి n8n Code Node లో Paste చేయండి.
LinkedIn URL Code Table:
| Job Type | LinkedIn Code |
|---|---|
| Full-time | F |
| Part-time | P |
| Internship | I |
| Contract | C |
| Temporary | T |
| Volunteer | V |
Output లో searchUrl వస్తుంది. ఇది తర్వాత Apify కి వెళ్తుంది.

Node Connection:
Code Node ➜ Get Resume Template Node
Step 4: Get Resume Template – Google Docs Node
Search Bar లో “Google Docs” అని Type చేయండి. “Get a Document” అనే Node కనిపిస్తుంది. దాన్ని తీసుకోండి.
Credentials Section లో మీ Google Account Connect చేయండి. Google తో Login అవుతుంది. Permission ఇవ్వండి.
ఇప్పుడు “Document ID or URL” అనే Field కనిపిస్తుంది. ఇందాక Copy చేసిన మీ Resume Google Doc URL అక్కడ Paste చేయండి.
Execute Step Click చేయండి. మీ Resume Content Output లో కనిపిస్తుంది. ఇది తర్వాత AI కి వెళ్తుంది.
Node Connection:
Get Resume Template Node ➜ Scrape LinkedIn Jobs Node
Step 5: Scrape LinkedIn Jobs – Apify HTTP Request
ఇక్కడ Apify API Key కావాలి. ఎలా తీసుకోవాలంటే:
| Step | చేయాల్సింది |
|---|---|
| 1 | apify.com కి వెళ్ళండి |
| 2 | Free Account Create చేసుకోండి |
| 3 | Left Side లో Settings Click చేయండి |
| 4 | API and Integrations Click చేయండి |
| 5 | Create a New Token Click చేయండి |
| 6 | Token Copy చేసుకోండి |
ఇప్పుడు n8n లో Search Bar లో “HTTP Request” Type చేయండి. Node తీసుకోండి.
ఈ Settings చేయండి:
| Setting | Value |
|---|---|
| Method | POST |
| URL | https://api.apify.com/v2/acts/bebity~linkedin-jobs-scraper/runs |
| Query Parameter Name | token |
| Query Parameter Value | మీ Apify API Key |
| Body Type | JSON |
| Max Results | 10 |
| Parse Job Description | true |
| Parse Company Details | true |
Claude Code Free Alternative – NVIDIA Free API తో DeepSeek V3 Pro Setup చేసుకోవడం ఎలా
Claude Code Free Alternative – NVIDIA Free API తో DeepSeek V3 Pro …
n8n WhatsApp AI Agent ఎలా Setup చేయాలి | Meta Business Suite తో Complete Integration Guide 2026
n8n WhatsApp AI Agent ఎలా Setup చేయాలి | Meta Business Suite తో …
AP Colleges లోని DTFC ద్వారా Tech Consulting Agency Start చేయడం ఎలా? – Zero Investment తో B2B Business
AP Colleges DTFC Telugu Guide: Zero Investment తో Tech Consulting Agency ఎలా …
AP లో RuTAG Smart Village Centre ద్వారా Rural Tech Startup ఎలా పెట్టాలి – Kuppam, Mangalagiri, Pithapuram లో అందుబాటులో ఉన్న Opportunities.
AP Smart Village Startup Guide In Telugu: RuTAG Opportunities for Students, Freelancers …
Body లో searchUrl Value ఏమి పెట్టాలంటే, Code Node నుంచి వచ్చే searchUrl ని Map చేయండి.
Node Connection:
Scrape LinkedIn Jobs Node ➜ Wait Node
Step 6: Wait Node – 3 Minutes
Apify Jobs Scrape చేయడానికి Time పడుతుంది. 3 Minutes Wait చేయాలి.
Search Bar లో “Wait” Type చేయండి. Node తీసుకోండి.
| Setting | Value |
|---|---|
| Wait Amount | 3 |
| Unit | Minutes |
అంతే. ఈ Node Automatic గా 3 Minutes Wait చేసి తర్వాత Node కి వెళ్తుంది.
Node Connection:
Wait Node ➜ HTTP Request Node
Step 7: HTTP Request Node – Scraped Data తీసుకోవడం
Apify Scrape చేసిన Data తీసుకోవడానికి ఇంకో HTTP Request Node కావాలి.
Scrape LinkedIn Jobs Node నుంచి Dataset ID వస్తుంది. ఆ ID తో ఇక్కడ Request పంపిస్తాం.
| Setting | Value |
|---|---|
| Method | GET |
| URL | Apify Dataset URL with Dataset ID |
| Query Parameter 1 Name | token |
| Query Parameter 1 Value | మీ Apify API Key |
| Query Parameter 2 Name | format |
| Query Parameter 2 Value | json |
URL లో Dataset ID ని Scrape LinkedIn Jobs Node Output నుంచి Map చేయండి.
Output లో Full Job List వస్తుంది JSON Format లో.
Node Connection:
HTTP Request Node ➜ Limit Results Node
Step 8: Limit Results Node
Testing చేసేటప్పుడు అన్ని Jobs కి Apply చేయడం Waste. ముందు 1 Job Test చేయండి. అన్నీ సరిగ్గా పని చేస్తే తర్వాత Limit పెంచండి.
Search Bar లో “Limit” Type చేయండి. Node తీసుకోండి.
| Setting | Value |
|---|---|
| Max Items | 1 (Testing కి) |
తర్వాత 50 Plus కి Apply చేయాలంటే, ఈ Value పెంచండి.
Node Connection:
Limit Results Node ➜ Filter Jobs with AI Node
FREE Zoho CRM: A Simple Tool for Real B2B Founders
FREE Zoho CRM: A Simple Tool for Real B2B Founders If you’re a B2B founder …
Insider Tips for Siift.ai Market Validation for Founders and AI-Powered Lean Startup Validation
Disclaimer: We have no affiliation with Siift.ai. We do not receive a single rupee or …
The Ultimate Guide to Leapter AI Logic Enforcement for Startups and Verifying AI Agent Behavior with Logic Layers
The Ultimate Guide to Leapter AI Logic Enforcement for Startups and Verifying AI Agent Behavior …
Parloa Deep Dive: The definitive enterprise voice AI for solo founders
Parloa Deep Dive: The definitive enterprise voice AI for solo founders Providing direct phone support …
Step 9: Filter Jobs with AI – Auto Apply LinkedIn Jobs Using AI in Telugu
ఇది చాలా Important Step. ఇక్కడ AI మీ Skills చూసి, Job Description చూసి, Match అవుతుందా లేదా అని చెప్తుంది.
Search Bar లో “OpenAI” Type చేయండి. OpenAI Node తీసుకోండి. మీ OpenAI API Key Add చేయండి.
ఈ Node లో మీ Skills పెట్టాలి. Example:
| Your Skill Category | Example Skills |
|---|---|
| Automation Tools | n8n, Zapier, Make.com |
| AI Tools | OpenAI API, Claude AI |
| Programming | JavaScript, Python Basics |
| Databases | Google Sheets, Airtable |
| Other | API Integration, Webhooks |
మీ Skills తో Prompt ఇలా ఉంటుంది. Claude కి ఇలా అడగండి:
“Claude, I need an n8n OpenAI node prompt. It should take a job description and compare it with my skills list. Skills are: (మీ Skills ఇక్కడ పెట్టండి). It should respond only in JSON format with a field called Decision with value true or false. Give me the exact system prompt and user prompt.”
Claude Exact Prompt ఇస్తుంది. దాన్ని Node లో Paste చేయండి.
Output Format:
| AI Output | అర్థం |
|---|---|
| Decision: true | మీ Skills Match అయ్యాయి |
| Decision: false | Match కాలేదు |
Node Connection:
Filter Jobs with AI Node ➜ Filter True and Website Node
Step 10: Filter True and Website Node – Switch Node
AI True అని చెప్పిన Jobs మాత్రమే తర్వాత వెళ్తాయి. False అయినవి ఆగిపోతాయి.
Search Bar లో “If” Type చేయండి. IF Node తీసుకోండి.
రెండు Conditions పెట్టాలి:
| Condition | Value |
|---|---|
| Condition 1 | AI Decision equals true |
| Condition 2 | Company Name is not empty |
రెండూ True అయినప్పుడు మాత్రమే ముందుకు వెళ్తాం. Company Name ఉండటం అవసరం ఎందుకంటే, Email వెతకాలంటే Company Domain కావాలి.
Node Connection (True Path):
Filter True and Website Node ➜ Rewrite Resume Node
Step 11: Rewrite Resume – AI Resume Customization Automation n8n
ఇది మొత్తం System లో అన్నిటి కంటే Powerful Step.
మీ Resume ఉంది కదా. అది అన్ని Jobs కి Same గా ఉంటుంది. కానీ AI ఆ Resume చదివి, ఆ Specific Job Description చదివి, మీ Resume ని ఆ Job కి Perfect గా Rewrite చేస్తుంది.
Search Bar లో “OpenAI” Type చేయండి. మళ్ళీ ఒక OpenAI Node తీసుకోండి.
Claude కి ఇలా అడగండి:
“Claude, I need an n8n OpenAI node prompt for Resume Rewriting. It should take a job description and my existing resume content, and rewrite my resume to match that specific job. The output should be in Markdown format starting with #. Give me the exact prompts.”
Claude Prompt ఇస్తుంది. Node లో ఇవి Map చేయండి:
| Input | Source Node |
|---|---|
| Job Description | HTTP Request Node Output |
| My Resume Content | Get Resume Template Node Output |
Node Connection:
Rewrite Resume Node ➜ Markdown to HTML Node
Step 12: Markdown to HTML Node
AI ఇచ్చిన Resume Markdown Format లో ఉంటుంది. దాన్ని Google Docs లో Proper గా పెట్టడానికి HTML కి Convert చేయాలి.
Search Bar లో “Markdown” Type చేయండి. “Markdown to HTML” Node కనిపిస్తుంది.
Node తెరవండి. Operation లో “HTML to Markdown” కాదు, “Markdown to HTML” Select చేయండి.
Input లో Rewrite Resume Node నుంచి వచ్చిన Content Map చేయండి.
Node Connection:
Markdown to HTML Node ➜ Create New Resume Node
Step 13: Create New Resume – Google Docs Node
ప్రతి Job కి కొత్త Google Doc Create అవుతుంది. ఆ Doc లో Rewritten Resume పెడతాం.
Search Bar లో “Google Docs” Type చేయండి. “Create a Document” Node తీసుకోండి.
| Setting | Value |
|---|---|
| Credentials | మీ Google Account |
| Drive | My Drive |
| Folder | మీకు కావాల్సిన Folder |
| Title | Job Title (HTTP Request Node నుంచి) |
Node Connection:
Create New Resume Node ➜ Update a Document Node
Step 14: Update a Document – Google Docs Node
ఇప్పుడు కొత్త Doc Create అయింది. ఆ Doc లో Resume Content Insert చేయాలి.
Search Bar లో “Google Docs” Type చేయండి. “Update a Document” Node తీసుకోండి.
| Setting | Value |
|---|---|
| Credentials | మీ Google Account |
| Document URL | Create New Resume Node Output ID |
| Action | Insert |
| Text | Markdown to HTML Node Output Content |
Node Connection:
Update a Document Node ➜ Get Email Node
Step 15: Get Email – AnyMailFinder API – Send Resume Automatically to Decision Makers n8n
ఇక్కడ Decision Maker Email వెతుకుతాం. CEO, Founder, Co-Founder వాళ్ళ Email వెతుకుతాం.
AnyMailFinder API Key ఎలా తీసుకోవాలంటే:
| Step | చేయాల్సింది |
|---|---|
| 1 | anymailfinder.com కి వెళ్ళండి |
| 2 | Free Account Create చేసుకోండి |
| 3 | Dashboard లో API Key కనిపిస్తుంది |
| 4 | Copy చేసుకోండి |
Search Bar లో “HTTP Request” Type చేయండి. Node తీసుకోండి.
| Setting | Value |
|---|---|
| Method | POST |
| URL | https://api.anymailfinder.com/v5.1/find-email/decision-maker |
| Header Name | Authorization |
| Header Value | మీ AnyMailFinder API Key |
| Body Parameter 1 | domain = Company Name + .com |
| Body Parameter 2 | decision_maker_category = ceo |
Node Connection:
Get Email Node ➜ Switch Node (Email Check)
Step 16: Switch Node – Email దొరికిందా లేదా Check చేయడం
Email దొరకకపోవచ్చు. అందుకే Check చేయాలి.
Search Bar లో “Switch” Type చేయండి. Node తీసుకోండి.
| Condition | Path |
|---|---|
| Email Field is not empty | Path 1 – Mail పంపిస్తాం |
| Email Field is empty | Path 2 – Skip చేస్తాం |
Node Connection (Path 1 – Email Found):
Switch Node ➜ Share Resume Node
Step 17: Share Resume – Google Drive Download
Gmail కి Resume Attach చేయడానికి, Google Doc ని Binary Format లో Download చేయాలి.
Search Bar లో “Google Drive” Type చేయండి. “Download a File” Node తీసుకోండి.
| Setting | Value |
|---|---|
| Credentials | మీ Google Drive Account |
| File ID | Update a Document Node Output Document ID |
Output లో Binary File వస్తుంది. ఇది Automatically Gmail కి Attach అవుతుంది.
Node Connection:
Share Resume Node ➜ Create Draft Email Node
Step 18: Create Draft Email – Gmail Node – Google Docs Gmail Automation Using n8n Telugu
చివరి Step. Resume తో Mail పంపడం.
Search Bar లో “Gmail” Type చేయండి. “Send a Message” Node తీసుకోండి. మీ Gmail Account Connect చేయండి.
| Setting | Value |
|---|---|
| To | Get Email Node నుంచి వచ్చిన Email |
| Subject | Job Title |
| Message | మీ Introduction Email Body |
Attachment Add చేయడానికి:
Node లో Options Click చేయండి. “Add Attachments” కనిపిస్తుంది. Click చేయండి. Attachment Field లో Share Resume Node నుంచి వచ్చిన Binary Data పెట్టండి.
Node Connection:
Create Draft Email Node ➜ Done
Workflow Complete.
Complete Node Connection Flow – ఒక్కసారి చూడండి
Form Trigger Node >>> Edit Fields Node >>> Code Node >>> Get Resume Template Node >>> Scrape LinkedIn Jobs Node >>> Wait Node (3 Minutes) >>> HTTP Request Node >>> Limit Results Node >>> Filter Jobs with AI Node >>> Filter True and Website Node >>> (True Path Only) Rewrite Resume Node >>> Markdown to HTML Node >>> Create New Resume Node >>> Update a Document Node >>> Get Email Node >>> Switch Node (Email Check) >>> (Email Found Path) Share Resume Node >>> Create Draft Email Node >>> Done. Mail Sent.ఇది Test చేయడానికి Checklist
Build అయ్యాక ఒక్కసారి ఈ List Check చేయండి.
| Check | Status |
|---|---|
| Google Docs Resume URL Pasted | Done or Pending |
| Apify API Key Added | Done or Pending |
| OpenAI API Key Added | Done or Pending |
| AnyMailFinder API Key Added | Done or Pending |
| Gmail Account Connected | Done or Pending |
| Google Docs Account Connected | Done or Pending |
| Google Drive Account Connected | Done or Pending |
| Limit Results Set to 1 for Testing | Done or Pending |
| Workflow Active ON | Done or Pending |
అన్నీ Done అయిన తర్వాత Form Submit చేయండి. Mail వచ్చిందా Check చేయండి.
LinkedIn Jobs Scraper n8n Apify Tutorial – Common Errors and Solutions
| Error | Reason | Solution |
|---|---|---|
| Apify Request Failed | API Key Wrong | API Key మళ్ళీ Copy Paste చేయండి |
| Google Docs Not Found | URL Wrong | Resume Doc URL మళ్ళీ Check చేయండి |
| Email Not Sent | Gmail Not Connected | Gmail Credentials మళ్ళీ Add చేయండి |
| AI Filter Always False | Skills List Empty | OpenAI Prompt లో Skills Add చేయండి |
| Wait Node Skipped | Workflow Not Saved | Save చేసి మళ్ళీ Test చేయండి |
Claude AI తో ఏ Doubt అయినా Solve చేయవచ్చు
ఇది చాలా Important Section. దీన్ని Skip చేయకండి.
మీకు ఈ Workflow Build చేయడం Difficult గా అనిపిస్తే, ఒక్క పని చేయండి.
claude.ai కి వెళ్ళండి. Free Account Create చేసుకోండి.
ఈ Blog మొత్తం Copy చేయండి. Claude కి Paste చేయండి. తర్వాత ఇలా అడగండి:
“Claude, ఈ Blog లో చెప్పిన LinkedIn Job Automation Workflow నాకు n8n లో Build చేయాలి. నా Details అడుగు. నేను చెప్తాను. తర్వాత n8n కి Import చేయగలిగే JSON File Generate చేసి ఇవ్వు.”
Claude మీకు ఏమి అడుగుతుందంటే:
| Claude అడిగే Question | మీరు చెప్పాల్సింది |
|---|---|
| ఏ Job వెతుకుతున్నారు? | మీ Job Title |
| ఏ City లో? | మీ City Name |
| మీ Skills ఏమిటి? | మీ Experience and Skills |
| Apify API Key ఉందా? | Yes or No |
| AnyMailFinder API Key ఉందా? | Yes or No |
| OpenAI API Key ఉందా? | Yes or No |
మీరు అన్నీ చెప్పాక, Claude మీకు ఒక JSON File ఇస్తుంది.
ఆ JSON File n8n లో Import చేయండి. Workflow Ready అయిపోతుంది.
ఎలా Import చేయాలంటే, n8n లో Top Right Corner లో Menu ఉంటుంది. “Import from File” లేదా “Import from JSON” Option ఉంటుంది. Claude ఇచ్చిన JSON అక్కడ Paste చేయండి. Import Click చేయండి. మీ Workflow Ready.
n8n Workflow Tutorial for Beginners in Telugu – చివరగా ఒక్క విషయం
నేను ఈ System Build చేసినప్పుడు చాలా సార్లు Errors వచ్చాయి. Nodes Connect అవ్వలేదు. API Keys Work అవ్వలేదు. Emails వెళ్ళలేదు.
ప్రతిసారి నేను Claude కి అడిగాను. “ఈ Error వస్తోంది, ఏం చేయాలి?” అని. Claude ప్రతిసారి Solve చేసింది.
నేను Coder కాదు. నాకు Programming రాదు. కానీ ఈ System Work అవుతోంది.
మీరూ చేయగలరు.
Job వెతుకుతున్న ప్రతి Telugu Youth కి ఈ Blog Share చేయండి. ఒక్కడు కాదు, వందమంది Benefits పొందాలి.
మళ్ళీ Doubt వస్తే, Claude.ai తెరవండి. Free. 24 గంటలు Available. Telugu లో కూడా Answer చేస్తుంది.
LinkedIn Job Automation in Telugu తెలుగులో ఇప్పుడు మీకు తెలిసింది. Build చేయండి. మీ Job వెతుకుండంగా మీ System Apply చేస్తుంది.










