No-Code AI SaaS Business in Telugu (Coding లేకుండా AI SAAS Building)
ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి No-Code AI SaaS Business in Telugu. అంటే కోడింగ్ లేకుండా ఓన్ గా సాస్ అప్లికేషన్ బిల్డ్ చేయడం, మరియు నో-కోడ్ టూల్స్ తో ఇన్‌కమ్ జనరేట్ చేయడం ఎలా అనే దాని గురించి చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం.
నిజం చెప్పాలంటే, ఈ మధ్య యూట్యూబ్ లో చూస్తే చాలు, తెలిసినోడు తెలియనిోడు ప్రతి ఒక్కడూ ఈ నో-కోడ్ టూల్స్ ట్రెండ్ మొదలైనప్పటి నుండి ఆడికి ఆడే పెద్ద సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లాగా ఫీల్ అయిపోతున్నాడు. యాక్చువల్లీ వాడు ఒక ఇంటర్ ఫెయిల్యూర్ గాడు అయి ఉంటాడు. నీకు నాకు తెలియక, అయిబాబోయ్ వాడు పెద్ద పీకుడుగాడు అనుకుని వాడి భజన చేస్తూ వాడికే లైకులు కొట్టి హీరోలను చేసి పడేస్తున్నాం. పేర్లు ఎందుకులే గానీ, చాలా మంది ఇలాంటి క్రింజ్ వీడియోలు చేసుకుంటూ పెద్ద పెద్ద హీరోలు అయిపోయారు.
AI ని వాడి లక్ష రూపాయలు ఎలా సంపాదించాలి, AI ని వాడి కోటీశ్వరుడు ఎలా అయిపోవాలి, AI ని వాడి వేసుకున్న బట్టలు ఎలా ఇప్పేయాలి, AI ని వాడి బూతు బొమ్మలు ఎలా చేయాలి, ఇలా ఎవరికి నచ్చిన డొమైన్‌లో వాడు పులిహార కలుపుకుంటూ పోతున్నాడు. అసలు హైలైట్ జోక్ ఏంటంటే, వాడి కంటెంట్ మనం కన్జ్యూమ్ చేస్తున్నాం తప్ప మనకి దానివల్ల పావులా ఉపయోగం కూడా ఉండదు. నిజం, ఎందుకంటే చాలా మంది ఈ అసలు రహస్యాలు చెప్పరు. ఇలాంటివి ఎవడూ బయటపెట్టడు. అరేయ్ మన టైమ్ వేస్ట్ అయిపోతుంది రా అని మనకి కూడా తెలియకుండా వాళ్ల వీడియోలు గంటల తరబడి చూస్తూ ఉండిపోతాం.
మరికొంతమంది ఐటి గురువులు వచ్చి ఏదో కొత్త టెక్నాలజీ నిన్న రాత్రి వచ్చిందని చెప్తారు. కానీ హిస్టరీ చూస్తే, నేను ఆ మధ్య ఒక వెబ్‌సైట్ చూశాను. అది ethicalfounder.com అని. దాంట్లో “The First AI Baby” అని ఒక బ్లాగ్ చదివాను. అసలు ఫస్ట్ AI ఎప్పుడు వచ్చిందో తెలిస్తే నాకు మబ్బులు ఎడిపోయాయి. ఎప్పుడో 1960 లోనో 1970 లోనో ఆల్రెడీ ఫస్ట్ AI బేబీ వచ్చేసింది. మనకి మాత్రం 2010 లోనో 2020 లోనో వచ్చినట్టు చాలా చోద్యంగా జనాలు చెప్తున్నారు. ఇదంతా పక్కన పెడితే, ఈ పులిహారగాళ్లందరూ వచ్చి ఇప్పుడు మనకి ఏదో నిన్న రాత్రి AI ఊడిపడినట్టు బిల్డప్ ఇస్తున్నారు.

కాంటెక్స్ట్ ఏంటంటే, AI అనేది ఎప్పటినుంచో ఉంది బ్రో. 1960, 1970ల నుంచే ఉంది. కంప్యూటర్ తయారైనప్పటి నుంచే ఉంది. కానీ నార్మల్ సిటిజన్, నీలాంటోడి చేతిలోకి, నాలాంటోడి చేతిలోకి వచ్చింది ఈ మధ్యకాలంలోనే. అది చెప్పట్లా ఎవడూ. ఏదో ఈరోజే పుట్టింది అన్నట్టుగా చెప్తున్నారు. సరే, ఈ సోల్లు అంతా పక్కన పెడదాం బ్రో. మెయిన్ కంటెంట్ లోకి వచ్చేద్దాం.
అసలు సాస్ (SaaS) అంటే SOFTWARE AS A SERVICE అంటే ఒక సాఫ్ట్‌వేర్ లేదా ఒక టూల్‌ను ఇంటర్నెట్ ద్వారా మంత్లీ లేదా ఇయర్లీ సబ్‌స్క్రిప్షన్ ఫీజు కట్టించుకుని జనాల చేత డబ్బులు కట్టించి, ఏదో ఒక రకంగా వాళ్ల జేబులో డబ్బులు మన జేబులోకి వచ్చేలా చేయడం. దీని కోసం మీరు ఎలాంటి కోడింగ్ రాయనవసరం లేదు. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ OpenAI, Claude, Perplexity, Gemini లాంటి API లను కనెక్ట్ చేసి ఒక అప్లికేషన్ బిల్డ్ చేసి కస్టమర్లకి అమ్మి డబ్బులు సంపాదించుకోవడమే ఈ No-Code AI SaaS Business in Telugu యొక్క అసలు కథ.
Why No-Code AI SaaS Business is a Huge Opportunity in 2026? (ఎందుకు నో-కోడ్ AI సాస్ అనేది 2026 లో ఒక గ్రేట్ అపర్చునిటీ?)
ఈ 2026 లో AI SaaS Business ఎందుకు ఇంత పెద్ద అపర్చునిటీగా మారింది అంటే దానికి కొన్ని ముఖ్యమైన రీజన్స్ ఉన్నాయి. నువ్వు నేను పక్కపక్కన కూర్చుని మాట్లాడుకుంటున్నట్టు విను బ్రో. నేను నీతోనే మాట్లాడుతున్నా.
1. Zero Coding Skills Needed (కోడింగ్ నాలెడ్జ్ అస్సలు అవసరం లేదు)
దీనికి నీకు ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. అసలు కోడింగ్ అనేది నువ్వు నేర్చుకోక్కర్లేదు, అవసరమే లేదు. నీకు ఏ ఎదవ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా పర్లేదు. నీకు ఏంటంటే ఒక ఐడియా వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. నీకు వచ్చే ఐడియానే నీ పెట్టుబడి. అది ఒక పాయింట్.
2. Low Initial Investment (తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయొచ్చు)
చాలా తక్కువ పెట్టుబడి బ్రో. ఇంకా గట్టిగా మాట్లాడితే కొన్ని టూల్స్ మనకి ఫ్రీగా కూడా దొరుకుతాయి.
3. Fast Time to Market (ప్రొడక్ట్ ని చాలా స్పీడ్ గా లాంచ్ చేయొచ్చు)
చాలా స్పీడ్‌గా లాంచ్ చేయొచ్చు. కోడింగ్‌తో ఆరు నెలలు పట్టేది, నువ్వు ఒక రోజు లేదా రెండు రోజుల్లో చేయొచ్చు. మరి ఆ పులిహారగాడు చెప్పినట్టు గంటలో అయిపోయింది, పది నిమిషాల్లో అయిపోయింది, పది నిమిషాల్లో కంపెనీ పెట్టేసాను, ఇరవై నిమిషాల్లో ఇరవై వేలు సంపాదించాను లాంటి లంగా కబుర్లు అన్నీ అవ్వవు బ్రో. అది నీకు అవ్వదు, నాకు అవ్వదు. ఒకవేళ అలా అయిందంటే ఎంత గమ్మున అయిందో అంత గమ్మున సంక నాకిపోతుంది, అది గుర్తుపెట్టుకో. ఈజీగా వచ్చింది ఈజీగానే పోతుంది. ఎవడో చెప్పాడు అని క్రెడిట్ కార్డ్ పెట్టి లాగిన్ అయిపోకండి.
4. High Profit Margins (లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయి)
లాభాలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్ తక్కువ. నువ్వు బాగా బాగా ఖర్చులు పెట్టేసి, బాగా బాగా సబ్‌స్క్రిప్షన్లు చేయాల్సిన అవసరం లేదు. ఒకటో రెండో టూల్స్ కొంటావ్. ఫస్ట్ ఫ్రీ వర్షన్ చూస్తావ్, ఏది బాగుందో దాన్ని వాడుకుంటావ్.
“మన పర్మనెంట్ ఈమెయిల్ ఐడీలు ఎక్కడపడితే అక్కడ ఇవ్వకండి బ్రో. దేశ భద్రత, ప్రైవసీ మనకి చాలా ముఖ్యం. ఏ టూల్ పడితే ఆ టూల్ కి నీ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి సంక నాకిపోకు.”
రకరకాల షార్ట్‌కట్లు ఉన్నాయి, ప్రైవసీని గౌరవించి, దేశ భద్రతను మైండ్ లో పెట్టుకుని ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలు, ఇంటి అడ్రస్ ఇవ్వకుండా ఏదో ఒక టెంపరరీ ఈమెయిల్ ఐడీతో లాగిన్ అవ్వండి. వాడు ఫ్రీగా యాక్సెస్ ఇస్తేనే వాడండి, డైరెక్ట్ గా డబ్బులు అడిగితే ఒక్క రూపాయి కూడా తీయకండి. ఎందుకంటే ఎవడి వ్యాపారం ఎప్పుడు సంక నాకిపోతుందో ఎవరికీ తెలియదు.
5 Steps to Build a No-Code AI SaaS Product (నో-కోడ్ AI సాస్ ప్రొడక్ట్ బిల్డింగ్ ప్రాసెస్)
ఇప్పుడు ఐదు స్టెప్స్ ఉన్నాయి బ్రో. కింద నేను సింపుల్ స్ట్రక్చర్ ఇచ్చాను, అది ఒకసారి చూడు.

Step 1: Market Research & Niche Selection (మార్కెట్ రీసెర్చ్ మరియు నిష్ ఎంపిక)
మార్కెట్‌ను రీసెర్చ్ చేయడం మరియు నిష్ ఎంచుకోవడం. నువ్వు ఏ టాపిక్‌లో పీకుడుగాడివో అది ఫస్ట్ తెలుసుకోవాలి. నువ్వు బయట జనాలు చెప్పే పులిహార కబుర్ల కన్నా, నీ మనసు, నీ బుర్ర చెప్పే పులిహార కబుర్లు మాత్రమే వినాలి.
చాలా మంది ఏం చెప్తారంటే, నువ్వు తయారుచేసే ప్రొడక్ట్ చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అంటారు. నేనేమంటానంటే, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఎవడో ఒకడు ఉంటాడు, దాన్ని పక్కన పెడదాం కొంతసేపు. కానీ నువ్వే ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేయి బ్రో. అవును, నువ్వే ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేయి. ఎలా అంటే, ఏదో తలనొప్పి వస్తే డోలో 650 వేసేసుకోవాలి లేదంటే తలనొప్పి తగ్గదు అన్నట్టు మనల్ని ఎలా తయారుచేసేశారో, అలా నువ్వు కూడా “అయ్య బాబోయ్, అసలు ఈ టూల్ లేకపోతే మీ పనులన్నీ ఆగిపోతాయి” అన్నట్టు ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేసేయ్. అప్పుడు జనాలు “అవును కదా, టైమ్ సేవ్ అవుతుంది” అని నీ టూల్ వాడటం మొదలెడతారు .
ఉదాహరణకు:
- రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కోసం: AI తో ప్రాపర్టీ డిస్క్రిప్షన్ జనరేట్ చేసే టూల్.
- Local రెస్టారెంట్ల కోసం: AI తో కస్టమర్ రివ్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్.
- ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ల కోసం: AI రీల్స్ స్క్రిప్ట్ అండ్ హుక్ రైటర్ టూల్.
- లీగల్ ప్రొఫెషనల్స్ కోసం: కాంట్రాక్ట్ అనాలసిస్ టూల్ (దీంట్లో చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి బ్రో).
Step 2: Choosing the Right No-Code Stack (సరైన నో-కోడ్ టూల్స్ ని ఎంచుకోవడం)
మార్కెట్లో చాలా నో-కోడ్ ప్లాట్‌ఫారమ్స్ ఉన్నాయి. వాటికి తగ్గట్టు అవి ఒక్కొక్క టాపిక్‌లో ఉంటాయి. ఒకటి కోడింగ్ రాయడానికి బెటర్ అయితే, ఇంకొకటి విజువల్ వండర్స్ క్రియేట్ చేయడానికి బెటర్ అవుతుంది. అదంతా కూడా కింద లిస్ట్ వేసి చూపిస్తున్నాను. ఈ టేబుల్ ఒకసారి డీటెయిల్డ్‌గా చూడు. ఇందులో మనం లవబుల్ (Lovable), బబుల్ (Bubble.io), ఫ్లట్టర్ ఫ్లో (FlutterFlow), అలాగే ఫ్రేమర్ (Framer), ఎయిర్ టేబుల్ (Airtable) లాంటి టూల్స్ వాడుతాం.
| Tool Category | Best No-Code Tools in 2026 | Best For (ఉపయోగం) |
|---|---|---|
| Web App Development | Bubble.io, FlutterFlow | కాంప్లెక్స్ వెబ్ మరియు మొబైల్ అప్లికేషన్లు బిల్డ్ చేయడానికి |
| Website Building | Framer, Webflow | విజువల్ వండర్స్ మరియు ల్యాండింగ్ పేజీల కోసం |
| Database & Backend | Xano, Airtable | కస్టమర్ డేటా స్టోర్ చేయడానికి |
| AI Workflow & Logic | Zapier, n8n, Make.com | యాప్స్ కనెక్ట్ చేసి ఆటోమేషన్ రన్ చేయడానికి |
Step 3: Integrating AI APIs (AI API లతో ఇంటిగ్రేట్ చేయడం)
అంటే AI అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌ను మీ నో-కోడ్ ప్లాట్‌ఫారమ్‌కు కనెక్ట్ చేయడం. మీరు తెచ్చుకున్న నో-కోడ్ కోడ్‌ను ఒక API కి కలిపితే దానికి బుర్ర, బుద్ధి వస్తాయి. ఒక OpenAI API, లేదా క్లాడ్ (Claude) API, లేదా జెమిని (Gemini) API ని బ్యాకెండ్‌లో కనెక్ట్ చేయాలి.
ఉదాహరణకు మీరు n8n ప్లాట్‌ఫారమ్ వాడుతుంటే, ఆటోమేషన్ చేయడానికి అందులో ఉన్న నోడ్స్ వాడతావు. కానీ దానికి బ్రెయిన్ అనేది జెమిని లేదా చాట్ జీపీటీ లో ఉంటుంది. దానికి దీనికి కనెక్ట్ చేయాలి. అప్పుడు యూజర్ ఒక ప్రాంప్ట్ ఇవ్వగానే, ఆ యాప్ బ్యాకెండ్‌లో ఎవరికీ కనపడకుండా AI మోడల్‌కు ఆ మ్యాటర్ చెప్పి, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మళ్లీ మన యాప్‌లోకి తీసుకొచ్చేస్తుంది. దీన్ని నువ్వు మ్యాన్యువల్ ట్రిగ్గర్ తో అయినా చేయొచ్చు, లేదా ఆటోమేషన్‌లో అయినా పడేయొచ్చు. మ్యాన్యువల్ కోసం నువ్వు ఎదురుగా కూర్చోవాలి, ఆటోమేషన్ లూప్ లో ఉండాలంటే దానికి క్లౌడ్‌లో ఏదైనా పెయిడ్ వర్షన్ ప్లాన్ తీసుకోవాలి. స్టార్టింగ్ లో 14 రోజుల ఫ్రీ ప్లాన్ సరిపోతుంది n8n లో.
Step 4: MVP Development (మినిమం వయబుల్ ప్రొడక్ట్ బిల్డ్ చేయడం)
మొదట్లో అన్ని ఫీచర్లతో పెద్ద సాఫ్ట్‌వేర్ బిల్డ్ చేసుకోకండి. మొదట చిన్న సమస్యను సాల్వ్ చేసే ఒక MVP బిల్డ్ చేయండి.
FREE Zoho CRM: A Simple Tool for Real B2B Founders
FREE Zoho CRM: A Simple Tool for Real B2B Founders If you’re a B2B founder …
Insider Tips for Siift.ai Market Validation for Founders and AI-Powered Lean Startup Validation
Disclaimer: We have no affiliation with Siift.ai. We do not receive a single rupee or …
The Ultimate Guide to Leapter AI Logic Enforcement for Startups and Verifying AI Agent Behavior with Logic Layers
The Ultimate Guide to Leapter AI Logic Enforcement for Startups and Verifying AI Agent Behavior …
Parloa Deep Dive: The definitive enterprise voice AI for solo founders
Parloa Deep Dive: The definitive enterprise voice AI for solo founders Providing direct phone support …
అప్పట్లో ఒక యాడ్ వచ్చేది గుర్తుందా? “మా పిల్లోడు ఒక యాప్ తయారుచేశాడంట, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీల వాళ్లంతా మా ఇంటికి క్యూ కడుతున్నారు” అని. ఆ దరిద్రపు యాడ్ చూసి అప్పట్లో జగనన్న టెంప్ట్ అయిపోయి స్కూల్ పిల్లలందరికీ ట్యాబ్‌లు కొనిపెట్టేశాడు. అది ఎంత పెద్ద ఫ్రాడో తర్వాత తెలిసింది. కాబట్టి ఎవడో ఒక తుప్పాస్ గాడు వచ్చి రెండు నిమిషాల్లో యాప్ చేసేయవచ్చు అంటే నమ్మకండి బ్రో, అంత ఈజీ కాదు. దానికి చాలా పంచాయతీలు ఉంటాయి. ట్రయల్ వర్షన్‌లో దాంట్లో దీంట్లో అవ్వదు. అది బాగా గుర్తుపెట్టుకో. Permanent Income కావాలంటే మాత్రం పెయిడ్ వర్షన్‌లో ఉండాలి bro.
Step 5: Monetization & Payment Setup (పేమెంట్ సెటప్ మరియు మానిటైజేషన్)
పేమెంట్ గేట్‌వేలను లింక్ చేయడం. యూజర్ల నుండి డబ్బులు ఎలా కలెక్ట్ చేయాలి? Stripe, Razorpay, Paddle, PayU లాంటి గేట్‌వేస్ ఉన్నాయి. వీటిని మన నో-కోడ్ యాప్ తో లింక్ చేయాలి.
డబ్బులు వసూల్ చేయడానికి మూడు పద్ధతులు ఉన్నాయి బ్రో:
- Subscription Model (సబ్‌స్క్రిప్షన్ మోడల్): నెల నెలా ఇంత అని డబ్బులు కట్టడం.
- Pay and Use (పే యాండ్ యూస్): వాడుకున్నప్పుడు మాత్రమే డబ్బులు కట్టడం.
- Credit System (క్రెడిట్ సిస్టమ్): ఒకేసారి క్రెడిట్స్ కొని వాడుకోవడం.
ఇంకా నీ ప్రొడక్ట్ చాలా తోపు అనుకుంటే Yearly Plan పెట్టేయొచ్చు.
3 Main Tools for No-Code AI SaaS (నో-కోడ్ సాస్ బిల్డింగ్ కోసం 3 ముఖ్యమైన టూల్స్)
మీ సాస్ స్టార్టప్ జర్నీని ఈజీ చేయడానికి సహాయపడే 3 బెస్ట్ ప్లాట్‌ఫారమ్స్ ఇవే:

1. Lovable (Lovable.dev)
లవబుల్ అనేది ఒక ఇన్సేన్ టూల్ బ్రో. ఇది కోడింగ్ రాని వాళ్ల కోసం తయారుచేసిన ఒక AI కోడర్. నువ్వు కేవలం ప్లెయిన్ ఇంగ్లీష్ లో నీ ఐడియాను ప్రాంప్ట్ రూపంలో చెప్తే చాలు, ఇది మొత్తం యాప్‌ను డిజైన్ చేసి, కోడ్ రాసి, బ్యాకెండ్ డేటాబేస్ (Supabase) తో కనెక్ట్ చేసి నీకు ఇచ్చేస్తుంది. దీన్ని వైబ్ కోడింగ్ (Vibe Coding) అంటారు. నువ్వు ఏ డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేయక్కర్లేదు, జస్ట్ చాట్ చేస్తూ ప్రొడక్ట్ బిల్డ్ చేసేయొచ్చు.
2. n8n
ఆటోమేషన్ చేయాలి అనుకుంటే మాత్రం n8n ఇస్ పర్ఫెక్ట్. ఎందుకంటే ఇందులో 14 రోజుల ఫ్రీ ట్రయల్ దొరుకుతుంది. నేనెవరికీ కూడా డబ్బులు కట్టేసి సబ్‌స్క్రిప్షన్లు తీసేసుకోండి అని చెప్పను బ్రో. నా మాట విని ఎవడైనా డబ్బులు కట్టేస్తే మళ్లీ నన్ను తిట్టుకుంటారు. కాబట్టి ఫ్రీ ప్లాన్ లోనే ట్రై చేయి బ్రో. అసలు నోడ్ అంటే ఏంటి, నోడ్ నోడ్ కలిపితే ఏమవుతుంది, నోడ్ నోడ్ విడిపోతే ఏమవుతుంది అనేది కొంచెం నేర్చుకో.
3. Bubble.io
web అప్లికేషన్లు బిల్డ్ చేయాలి, డేటాబేస్ స్ట్రాంగ్ గా ఉండాలి, లాజికల్ వర్క్‌ఫ్లోస్ రన్ అవ్వాలి అనుకుంటే Bubble is the best. దీనికి 1000+ Plugins కూడా ఉన్నాయి. దీని ద్వారా ప్రొడక్ట్ బిల్డ్ చేయడం చాలా ఈజీ.
How to Get AI Clients & Market Your SaaS? (మీ ప్రొడక్ట్ కి కస్టమర్లను పట్టుకోవడం ఎలా?)
దీనికి నేను హెడ్డింగ్ “కస్టమర్లను ఆకర్షించడం మరియు మార్కెటింగ్” అని పెడదాం అనుకున్నా గానీ, మన తెలుగులో అలా బుక్ లాంగ్వేజ్ చెప్తే బాగుండదు. మన స్టైల్ లో “కస్టమర్లకి వల వేయడం, ఎర వేయడం” అని చెప్పుకుందాం.
నువ్వు మళ్లీ కస్టమర్లను ఎలా పట్టుకోవాలని యూట్యూబ్‌లో వీడియోల కోసం వెతికావు అనుకో, మళ్లీ ఆ చిల్లరగాళ్లు అందరూ వచ్చి వంద ఐడియాలు చెప్తారు. ఎక్కడా వెతకకు, ఒకసారి నువ్వే ప్రశాంతంగా కూర్చుని ఆలోచించు. మనం అవతలి వాడి దగ్గరికి ఎలా వెళ్లాలి?
- Cold Emailing Outreach (కోల్డ్ ఈమెయిల్స్ పంపడం): నీ నిష్ కి సంబంధించిన బిజినెస్ ఓనర్ల ఈమెయిల్స్ లిస్ట్ తీసుకుని వాళ్లకి ఈమెయిల్స్ పంపడం. మరి ఈ లిస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? మళ్లీ ఇంటర్నెట్ లో వెతికి టైమ్ వేస్ట్ చేసుకోకు బ్రో. ఈ ఎదవ వీడియోలు చూడటంలోనే సగం జీవితం అయిపోతుంది. దీని కోసం ప్రొఫెషనల్ ఈమెయిల్ సెల్లర్స్ ఉంటారు, వాళ్లని పట్టుకో. బడ్జెట్ ఉంటే దాంట్లో దిగు, లేదా నార్మల్ గా చేసుకో.
- Content Marketing & SEO (కంటెంట్ మార్కెటింగ్ మరియు ఎస్ఈఓ): మీ ప్లాట్‌ఫారమ్‌లోనే ఒక బ్లాగ్ సెక్షన్ పెట్టి, మంచి ఎస్ఈఓ కీవర్డ్స్ ఉపయోగించి కస్టమర్లను ఆర్గానిక్‌గా మీ వెబ్‌సైట్‌కి రప్పించడం.
- Build in Public (పబ్లిక్ లో బిల్డ్ చేయడం): మీరు ఎలా బిల్డ్ చేస్తున్నారో Twitter లేదా LinkedIn లో షేర్ చేయండి. మీ ప్రొడక్ట్ లాంచ్ చేశాక “నా ప్రొడక్ట్‌లో ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, మీకు దమ్ముంటే రండి” అని 150 సార్లు 150 పోస్టులు పెట్టండి. దమ్మున్నోళ్లు అందరూ వస్తారు బ్రో, వాళ్లు దమ్మున్నోళ్లు అని కాదు దోలాగాళ్లు, ఉలాగాళ్లు. వచ్చి ఏదో బొక్క ఉంది ఇందులో అని కనిపెట్టి నీకు చెప్తారు. దానివల్ల నీ ప్రొడక్ట్ గురించి మార్కెట్లో బజ్ క్రియేట్ అవుతుంది. మాస్ సినిమాలో నాగార్జున చెప్తాడు కదా: “నేను వచ్చానని 15వ తారీఖున తెలుస్తుంది…” అని, అలా నువ్వు కూడా ఒక నెల రోజులు టార్గెట్ పెట్టుకుని నీ బ్రాండ్ గురించి మార్కెట్లో పడిపోవాలి.
- Product Launching Platforms (ప్రొడక్ట్ లాంచింగ్ ప్లాట్‌ఫారమ్స్): BetaList, 100Words, Reddit కమ్యూనిటీస్ లో ప్రమోట్ చేయడం.
Pros & Cons of Building No-Code SaaS (నో-కోడ్ సాస్ బిల్డింగ్ లో లాభాలు మరియు నష్టాలు)
బ్రో, నేను చెప్పడం కన్నా మీకు మీరే ఆలోచించుకోండి. డబ్బులు పెట్టకుండా మనం ఎంతవరకు చేయగలం? డబ్బులు పెట్టకుండా చేసాం అనుకో, మాగ్జిమం నష్టాలు (Cons) అన్ని స్కిప్ కొట్టేసినట్టే.
కానీ ఇక్కడ ఒక పెద్ద కష్టం ఉంది బ్రో. ఏంటంటే: TIME IS MONEY. మన టైమ్ వేస్ట్ అవుతుంది. మనం ఆ క్రింజ్ వీడియోలు చూడటం మానేసి, తుప్పాస్ ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్లను ఫాలో అవ్వడం మానేసి, క్వాలిటీ టైమ్‌ను క్వాలిటీ కంటెంట్ మీద స్పెండ్ చేస్తే నష్టాలు అనేవి ఉండవు.
నేను పైన ఇచ్చిన ప్రతి లింక్ మీద క్లిక్ చేస్తే మీరు వేరే బ్లాగ్ లోకి వెళ్తారు. చాలా కష్టపడి క్వాలిటీ కంటెంట్ రాస్తున్నాను బ్రో.
సరే మరి, ఉంటాను బ్రో! కింద ఇచ్చిన లింకులు అన్నీ ఒకసారి నొక్కండి. చాలా వాల్యూబుల్ కంటెంట్ అది. ఇంకా గట్టిగా చెప్పాలంటే మన దాంట్లో చాలా రకాల టూల్స్ గురించి డీటెయిల్డ్‌గా రాయడం జరిగింది. అవన్నీ ఇంగ్లీష్ లో ఉంటాయి. ఒకవేళ మీకు తెలుగులో కావాలి అనుకుంటే పైన గూగుల్ ట్రాన్స్‌లేటర్ ఉంటుంది కదా, దాన్ని రైట్ సైడ్ క్లిక్ చేసి తెలుగులోకి ఈజీగా ట్రాన్స్‌లేట్ చేసుకోండి.
మళ్లీ చెప్తున్నాను బ్రో, డబ్బులు చాలా అవసరం, జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. ఎక్కడ పడితే అక్కడ పేయిడ్ ప్లాట్‌ఫారమ్స్ లో ఇన్వెస్ట్ చేయకుండా ఫ్రీ టూల్స్ తో ప్రాక్టీస్ చేయండి. ఉంటాను బ్రో!










