Cinematic Village Podcast Setup: పల్లెటూరి నిరుద్యోగ యూత్ కోసం వన్-మ్యాన్ షోతో YouTube ని దె*గే తిరుగులేని Content

ఒరేయ్ తమ్ముడు, పొద్దున లేస్తే చుట్టుపక్కల వాళ్ళ చూపులు, ఇంట్లో నాన్న అడిగే ప్రశ్నలు, అమ్మ ముఖంలో కనిపించే ఆవేదనతో నీకు లోపల పిచ్చెక్కిపోతుంటుందని నాకు బాగా తెలుసు. ఏ రోడ్డు పక్కన టీ కొట్టు దగ్గరో కూర్చుని టైమ్ వేస్ట్ చేస్తుంటే, ఎవడో ఒకడు వచ్చి Upwork లో account క్రియేట్ చేయి, Fiverr లో ఫ్రీలాన్సింగ్ చేయి, లేదా ఒక YouTube channel స్టార్ట్ చేసి సంపాదించుకో అని చాలా ఈజీగా ఒక blog post లోనో లేదంటే video లోనో ఒక బోడి సలహా పడేస్తాడు. తమ్ముడూ, ఇలాంటి లంగా సలహాలు కాకుండా నిజంగా పని చేసే WhatsApp మీద ఆటోమేటిక్ గా రిప్లై ఇచ్చే సిస్టమ్ ఎలా బిల్డ్ చేయాలో కూడా ఒకసారి చూడు.

కానీ వాస్తవంగా ఆలోచిస్తే, ఇవన్నీ చేయాలంటే నీకు హై-స్పీడ్ internet ఉండాలి, ఒక మంచి laptop ఉండాలి, English లో కమ్యూనికేట్ చేయడం రావాలి. మన పల్లెటూర్లలో ఉండే చదువుకున్న నిరుద్యోగ యూత్ అందరికీ ఇవన్నీ ఒకేసారి సాధ్యం కావు. అందుకే నీ కోసం నేను ఒక సూపర్ niche కనిపెట్టాను. ఈ niche ఏంటో చెప్తే నీకు దిమ్మ తిరిగిపోద్ది! ఇప్పటివరకు YouTube లో కూడా ఎక్కడా ఇలాంటి content లేదు. internet లో వెతికినా దొరకదు. అలాంటి దారుణమైన ఐడియా ఇది.

బ్రో, ఇలాంటి unique niches వెతికే ఓపిక లేకపోతే ready-made low investment ఐడియాల లిస్ట్ కూడా ఒకటి పెట్టాను, అక్కడ నుండి కూడా పికప్ చేసుకోవచ్చు.

నువ్వు కూడా అమెరికాలోనో లేదంటే ఇంగ్లాండ్ లోనో ఎవడో ఏదో చేశాడని దాన్ని కాపీ కొట్టాలని చూస్తే సంక నాకిపోతావు తమ్ముడూ. ఇప్పుడు internet లో లంగా పంచాయితీలు చాలా ఎక్కువైపోయాయి. ముసలి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత డాన్సులు చేయించడం, వాళ్ళకు లంగా వోణీలు కట్టడం, లేదా దరిద్రపు వల్గర్ titles పెట్టి వ్యూస్ సంపాదించడం చూసే ఉంటావు. వాళ్ళంతా content ని, ఆ ముసలి వాళ్ళ ఇజ్జత్ ని గంగలో కలిపేస్తున్నారు. నువ్వు ఆ దరిద్రపు పనులు చేయాల్సిన అవసరం లేదు. జెన్యూన్ గా, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే ఒక సరికొత్త Cinematic Village Podcast ని ఎలా స్టార్ట్ చేయాలో నీకు క్లియర్ గా చెప్తాను, జాగ్రత్తగా విను.

A complete roadmap to launching a cinematic village podcast, offering a unique opportunity for Andhra Pradesh unemployed youth looking for high-earning Telugu side hustles integrated with AI in Telugu.

Table of Contents

అసలు ఏంటి ఈ Cinematic Village Podcast? ఆ దరిద్రపు Saturated కంటెంట్ పక్కన పెట్టి అసలైన Reality లోకి రా తమ్ముడూ!

మనం ఎప్పుడూ చూసే podcastలు ఎలా ఉంటాయి తమ్ముడూ? ఒక మూసి ఉన్న రూము, పెద్ద పెద్ద ఏసీలు, కలర్ లైట్లు, మైకులు పెట్టి ఎవడో ఒక సెలబ్రిటీని పిలిచి సోది మాట్లాడుతుంటారు. ఆ సోది వినడానికి జనాలు బోర్ కొట్టేసింది. వాడెవడో నారా లోకేష్ ని తీసుకొచ్చాడు, ఇంకొకడెవడో రాణా ని తీసుకొచ్చాడు, ఇంకొకడు రామ్ చరణ్ ని తీసుకొచ్చాడు, ఇంకొకడెవడో పెద్ద తోపు పీకుడుగాడు businessman ని తీసుకొచ్చాడు ఇవన్నీ కాదు. నువ్వు ఎలాంటి వాళ్ళని తీసుకోవాలంటే చెప్తే గుండె ఆగి చచ్చిపోవాలి. అరేయ్ వీడితో podcast ఏంట్రా అని అనుకుని కంగారు పడిపోవాలి.

మన Cinematic Village Podcast వాతావరణమే వేరు. ఇది పల్లెటూరి పచ్చని వాతావరణంలో, గుండెల్ని పిండేసే ఎమోషన్స్ తో, సినిమాటిక్ విజువల్స్ తో సాగే ఒక అద్భుతమైన ప్రయాణం. మన ఊర్లలో 70 నుండి 80 ఏళ్ళ ముసలమ్మలు, తాతలు ఉంటారు. వాళ్ళ జీవితాల్లో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, కోల్పోయిన బంధాలు, బ్రిటిష్ కాలం నాటి జ్ఞాపకాలు ఉంటాయి. వాళ్ళ దగ్గరకు వెళ్లి, వాళ్ళ కథలను గౌరవంగా రికార్డ్ చేసి ప్రపంచానికి చూపించడమే ఈ కాన్సెప్ట్. ఇందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ సెటప్స్ ఉండవు, అంతా నేచురల్ రియలిజం మాత్రమే ఉంటుంది.

నేను ఒక niche కనిపెట్టా. ఆ niche చెప్తే గుండె ఆగి చచ్చిపోతారు. ఇప్పటిదాకా YouTube లో కూడా ఎక్కడా లేదు. internet లో వెతికినా దొరకదు. అలాంటి దారుణమైన niche, అది కూడా పల్లెటూరోళ్ల కోసం తయారుచేసిన niche. ఈ niche తోటి నేనే చేసుకోవచ్చు videos, but నాకు interest లేదు. But నాకు ఒక idea వచ్చింది. నీకు గానీ ఉపయోగపడతదేమో చూడు.

ఎందుకంటే ఇలాంటి ideas నువ్వు YouTube లో వెతికావనుకో ఏమని the best niche for YouTube shorts, YouTube videos, YouTube podcast and all అని నీకు random గా saturated niche ఇస్తారు. అంటే saturated అంటే చెప్తాను చూడు. చాలా దారుణంగా, దరిద్రంగా అందరూ గు*ద్ద దె*గి వదిలిపెట్టిన niche. అర్థమైందా? ఆల్రెడీ ఆ niche ని చాలా మంది గుద్ద దెంగి వదిలిపెట్టారు. దాన్నే నీకు ఎవడో ఒకడు suggest చేస్తాడు. అమెరికాలో చూసేస్తారు, ఇంగ్లాండ్ లో చూసేస్తారు, బొక్కలో దూరినా చూసేస్తారు, బ్యాలెన్స్ అయిపోయినా సరే చెట్టెక్కి మరీ చూసేస్తారు ఈ సొల్లు కబుర్లు చెప్పే నా కొడుకులు ఎక్కువైపోయారు. Okayనా? వాళ్లకు నువ్వు డబ్బులు సంపాదించి పెడుతున్నావ్ అంతే వాళ్ళ videos చూసి.

A professional guide on Cinematic Village Podcast Setup showing how village youth can build a high-income YouTube channel using low investment business ideas in telugu and self employment business ideas in telugu.

మేము నీ కోసం చేసే ఉచిత సహాయం: WordPress Portfolio Website, Free Domain మరియు Lifetime Free Hosting సెటప్!

నువ్వు ఈ జర్నీని స్టార్ట్ చేయాలని గట్టిగా డిసైడ్ అయితే, నీ వెనుక ఒక అన్నగా సపోర్ట్ ఇవ్వడానికి మేము ఎప్పుడూ రెడీగా ఉంటాం. నీకంటూ ఒక ప్రొఫెషనల్ గుర్తింపును తెచ్చుకోవడానికి ఒక professional portfolio website ని మేమే ఫ్రీగా డిజైన్ చేసి ఇస్తాం. దానికి అయ్యే hosting, domain మరియు WordPress credentials అన్నీ పూర్తి బాధ్యత మాదే. దీని కోసం నీ దగ్గర నుండి మేము ఒక్క రూపాయి కూడా ఆశించం. ఇది మా ప్రామిస్.

ఎందుకంటే, మన పల్లెటూరి కోసం నువ్వు ఏదైనా చేయాలని అనుకుంటున్నావు చూడు, ఆ ఒక్క థాట్ చాలు మాకు. ఇక్కడ ఎలాంటి దండగమారి కబుర్లు ఉండవు, అంతా ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్ లో వర్క్ అయ్యే ప్లాన్ మాత్రమే ఉంటుంది. రేపు పొద్దున నువ్వు ఈ website ని నీ ప్రూఫ్ లాగా చూపిస్తూ పెద్ద పెద్ద బ్రాండ్స్ ని, స్పాన్సర్స్ ని ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు.

Location Selection సైకాలజీ: నీ లొకేషనే 50% జనాల్ని ఎలా అట్రాక్ట్ చేస్తుందో తెలుసా?

ఒక video క్లిక్ అవ్వాలంటే thumbnail లో location చూస్తేనే జనాలు షాక్ అయిపోవాలి. నువ్వు ఏదో నార్మల్ గా ఒక ఇంట్రెస్టింగ్ రూమ్ లో కూర్చుని మాట్లాడితే ఎవడు చూడడు. నా niche ఒకసారి చూడు. నా niche ఏంటంటే cut చేస్తే ఒక పెద్ద మర్రిచేట్టు అనుకో. లేదు, ఒక పెద్ద బావి. లేదు, ఇంకా దరిద్రంగా మాట్లాడితే ఒక కాలువ గట్టు. ఇంకా గట్టిగా మాట్లాడితే గోదావరి ఒడ్డు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఎక్కడ? ఒక పాడుపడిపోయిన temple, లేదంటే గనుక ఒక పాత పెంకుటిల్లు. లేదంటే గనుక ఒక చెరువు గట్టు. లేదు, ఏ చెరువు తోటో, మామిడి తోటో, కొబ్బరి తోటో నా గుద్ద దెంగే చోటో శ్మశానం పక్కన కూర్చో. శ్మశానం పక్కన కూర్చో, దెంగేం లేదు. నీకు అక్కడ నీ locationఏ 50% జనాల్ని attract చేసేస్తాది. అర్థమైందా? నీ location.

మర్రిచెట్టు, పాడుబడిన టెంపుల్, కాలువ గట్టు, లేదా శ్మశానం పక్కన షూట్ చేయడం

ఈ locations వెనుక ఒక పెద్ద సైకాలజీ ఉంది తమ్ముడూ. జనాలు రోజువారీ నగర జీవితం చూసి అలసిపోయారు. వాళ్లకు ఏదైనా ఒక రహస్యమైన, ప్రశాంతమైన మరియు కొంచెం భయానకమైన వాతావరణం కనిపిస్తే వాళ్ళ కళ్ళు అక్కడే ఆగిపోతాయి.

మామా, ఇదే విజువల్ స్టోరీటెల్లింగ్ స్కిల్ ని YouTube ఆటోమేషన్ కోసం Veo3 సెటప్ చేసుకున్న వాళ్ళు కూడా వాడుకుంటున్నారు, ఒకసారి లింక్ మీద click చేసి చూడరా.

  • మర్రిచెట్టు బ్యాక్‌గ్రౌండ్: ఊడలు వేలాడుతున్న పెద్ద చెట్టు కింద నువ్వు పెట్టే ఆ ప్రొఫెషనల్ మైక్, ఆ పాతతరం మనిషి కూర్చుని ఉండడం చూస్తేనే సినిమా ఫీలింగ్ వస్తుంది.
  • పాడుబడిన టెంపుల్ లేదా పాత పెంకుటిల్లు: ఇవి కాలానికి ఎదురునిలిచిన గుర్తులు. మన గెస్ట్ ల జీవితాలు కూడా అలాంటివే అని ఆ విజువల్ ఆడియన్స్ కి చెప్పకనే చెప్తుంది.
  • శ్మశానం పక్కన షూటింగ్: ఇది అందరికంటే డిఫరెంట్ గా ఆలోచించే వాళ్లకు మాత్రమే సెట్ అవుతుంది. అక్కడ ఉండే నిశ్శబ్దం, ఆ ప్రశాంతత నీ podcast కి ఒక అద్భుతమైన డెప్త్ ఇస్తుంది.
An advanced guide explaining how to grow a Telugu YouTube channel through a cinematic village podcast, offering a scalable roadmap for Andhra Pradesh unemployed youth who want to master AI in Telugu for content creation.

పగటిపూట లైటింగ్ Vs నైట్ షూట్స్: ఆ చేతబడి భయాలు మరియు పక్కా రూల్స్

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకో తమ్ముడూ. హడావిడి చేద్దామని చెప్పి రాత్రి పూట మర్రిచెట్ల కిందకో, శ్మశానాల దగ్గరికో వెళ్లి కెమెరాలు పెట్టి షూట్లు చేయకు. నిన్ను అలాగే ఏమీ అర్ధరాత్రి పూట మర్రిచెట్ల దగ్గరో, శ్మశానాల దగ్గరికో వెళ్లి షూట్లు చేయమని నేను చెప్పట్లేదు. ఏదో హడావిడి చేద్దామని ఊరిలో అందరూ ఏ చేతబడి చేస్తున్నాడో అని కొట్టేస్తారురా. Okayనా? అందుకని చెప్పి అలాంటి ప్రయత్నాలు చేయకు. night shoots గట్టా పెట్టుకోకు. పట్టపగలు, సూర్యుడు ఉన్నప్పుడే మొదలుపెట్టు నీ దుకాణం.

నేచురల్ సన్‌లైట్ కంటే అద్భుతమైన లైటింగ్ ఇంకొకటి ఉండదు. నీకు ఎలాంటి ఎక్స్‌ట్రా లైట్స్ కొనాల్సిన అవసరం లేదు, నీ పైసా బొక్క పడదు. ఉదయం 7 నుండి 10 గంటల మధ్య లేదా సాయంత్రం 4 నుండి 6 గంటల మధ్య షూట్ చేస్తే లైటింగ్ చాలా సినిమాటిక్ గా ఉంటుంది. లైటింగ్ ఒక్కటే కాదు, ఎడిటింగ్ లో కూడా టైం సేవ్ చేయాలంటే CapCut లాంటి ఫ్రీ మొబైల్ యాప్ చాలు, పైసా ఖర్చు కుడా లేదుగా.

Guest Selection మరియు De-glam Realism : రంగస్థలం సమంత Vs దేవర జాన్వీ కపూర్!

ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా బుర్రకెక్కించుకో తమ్ముడూ. నువ్వు పెద్ద పెద్ద సెలబ్రిటీలను, వ్యాపారవేత్తలను పిలిచి ఇంటర్వ్యూలు చేయాల్సిన అవసరం లేదు. మన గెస్ట్ లు ఎవరో తెలుసా? మన పక్క ఊరిలో పొలం పనులు చేసుకునే అవ్వలు, తాతలు.

ఎందుకంటే నీకు ఒక విషయం చెప్తాను చూడు. ఏదో పెద్ద heroine, ఎవరు? example తీసుకో, ఇప్పుడు జాన్వీ కపూర్ ఉంది. జాన్వీ కపూర్ బట్టలిప్పేసుకుని, లేదంటేనేమో మొత్తం అన్నీ చూపించేసుకుంటా ఆ దేవర, పెద్ది సినిమాల్లో యాక్ట్ చేసింది. వచ్చిన reviews చూసుంటావు కదా, ఎంత దరిద్రంగా వచ్చాయో? థూ దీని అమ్మ జీవితం దీన్నా చూడటానికి నేను వెళ్ళింది? అనవసరంగా చరణ్ అన్న సినిమా పాడైపోయింది కదా అని చెప్పి బాధపడ్డాం కదా? అవునా? ఎందుకంటే family audience బాధపడ్డారు.

సో నేనేమంటానంటే de-glamourize చేస్తే జనాలకి నచ్చుతాది. అదే నువ్వు వెనక్కి వెళ్లి అదే రామ్ చరణ్ తోటి యాక్ట్ చేసిన సమంత ఎందులో రంగస్థలం సినిమాలో. పల్లెటూరి getup లో ఎలా ఉంది? exposing ఉంది, emotion ఉంది, attitude ఉంది, అన్నీ ఉన్నాయి. నీకు de-glam చేసి చూపించడం వల్ల అంత పెద్ద star heroine ఇంకా పెద్ద star heroine అయిపోయింది. బాసూ, ఇదే de-glam, authentic content ఎందుకు వర్క్ అవుతుందో YouTube Creator Academy లో కూడా ఆఫీషియల్‌గా చెప్తారు, ఒకసారి నువ్వు కుడా చూడు. ఎవడో YouTuber చెప్పిన సొల్లు ఎంతకాలం వింటావ్?

గంగవ్వ సక్సెస్ సీక్రెట్ & మీ ఊరిలో గంగవ్వ ఎక్కడుందో వెతకాలి

ఇప్పుడు గంగవ్వను చూసావు కదా నువ్వు YouTube లో ఓ అల్లల్లాడించేస్తా ఉంటది గంగవ్వ. ఆ గంగవ్వను చూసిన నువ్వు ఏం నేర్చుకోవాలి? మీ ఊరిలో గంగవ్వ ఎక్కడుందో వెతకాలి. నేను అలాగని గంగవ్వను పెట్టి daily vlogs చేయమని చెప్పట్లేదు. ఇలాంటి రియల్ స్టోరీస్ తో పాటు, పక్క ఊర్లో కొబ్బరి అమ్మే వ్యాపారం చేసే వాళ్ళ కథలు కూడా అదే ఎమోషనల్ కనెక్ట్ ఇస్తాయి, content angle కి use చేసుకో. detailedగా ఒక బ్లాగ్ కుడా రాసాను, కుదిరితే అదికూడా చూసెయ్యి.

  • నిజమైన పల్లెటూరి ముసలమ్మలు: వయసులో పెద్దోళ్ళని మన అమ్మమ్మలో, మన తాతయ్యలో వాళ్ళకన్నా పెద్దోళ్ళు, వయసులో ఉన్నవాళ్ళని లేదు రేపో మాపో పాపం అలా అనకూడదు, బాగా age అయిపోయిన వాళ్ళను అనుకో. అలాంటి వాళ్ళను తీసుకువచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టు.
  • మేకప్ లు వేయొద్దు: ఒరేయ్ మళ్లా చెప్తున్నాను తమ్ముడు నీకు, నువ్వు ఏంటంటే ఏదో పెద్ద professional గా కనిపించాలని వాళ్లకు makeup లు వేయడాలు ఇలాంటివి చేసావనుకో సంకనాకిపోతావు. వాళ్ళ సహజమైన ముఖాలు, ఆ ముడతలు పడిన చేతులే మన video కి నిజమైన అందం.

natural realism ఒక్కటే ఫార్ములా కాదు, ఇదే genuine energy తో ఊర్లో టీచింగ్ సైడ్ హస్టిల్ చేసే వాళ్ళు కూడా audience trust సంపాదిస్తున్నారు. చాలామంది teaching వీడియోస్ కుడా చేస్తున్నారు, but తెలుగులో లేరులే ఇంకా!

ఎందుకోసం ఈ లంగా పంచాయితీలు, ముసలోళ్ల డాన్సులు పక్కన పెట్టాలో తెలుసా?

ఇప్పుడు ఈ మధ్య ఇంకో సంత తయారైంది. ఏంటంటే జనాలందరూ ఎవడిని పడితే వాడిని తీసుకొచ్చేసి వాళ్ళ అమ్మమ్మలని, వాళ్ళ తాతలని, వాళ్ళందరినీ తీసుకొచ్చేసి వాళ్ళ చేత డాన్సులు చేయించడం, వాళ్ళకి లంగా వోణీలు కట్టడం ఈ లంగా పంచాయితీలు ఎక్కువైపోయాయి. ఈ లంగా పంచాయితీలు అన్నీ పక్కకు పెడదాం కొంతసేపు. నువ్వు ఏం చేయాలో చెప్తాను.

ఈ పంచాయితీలు వల్ల ఆ ముసలి వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. చూసే వాళ్లకు కూడా అది చాలా చీప్ గా అనిపిస్తుంది. మనం చేయాల్సింది వాళ్ళను ఎగతాళి చేయడం కాదు, వాళ్ళ జీవిత కథలను సమాజానికి చూపిస్తూ గౌరవాన్ని ఇవ్వడం. cheap content కి బదులు నీ energy ని AI voiceover business లాంటి skill-based సర్వీస్ లోకి కూడా ఒక కొత్త channel చేసుకోవచ్చు, ఒక్క skill రెండు income streams.

Low Budget Equipment: అమెజాన్ లో దొరికే ఆ దరిద్రపు 150 రూపాయల మైకులు ఎందుకు వాడకూడదు?

చాలా మంది “లక్షల రూపాయల కెమెరాలు ఉంటేనే YouTube లో వీడియోలు చేయగలము” అని ఒక పెద్ద బొక్క బోర్లా పడతారు. అదంతా సోది. నీ దగ్గర ఉన్న ఒక మంచి smartphone చాలు. ఇప్పుడు వచ్చే ప్రతి మొబైల్ లోనూ 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్స్ ఉంటున్నాయి.

నువ్వు ఇన్వెస్ట్ చేయాల్సింది కెమెరా మీద కాదు, మంచి ఆడియో క్వాలిటీ మీద. మరీ దరిద్రంగా ఐదు రూపాయలు, పది రూపాయలది ఎవడో Amazon లో అమ్ముతున్నాడు 150 రూపాయల mics అవి పెట్టకు. ఆ చీప్ మైకులు కొంటే విండ్ నాయిస్ ఎక్కువగా వచ్చి ఆడియో అంతా చండాలంగా తయారవుతుంది.

నీ దగ్గర ఉన్న Smartphone ని వాడుకుంటూ బెస్ట్ Boya Wireless Mic తో ఆడియో రికార్డ్ చేయడం

నీకు రూపాయి పెట్టుబడి లేదు. నీ mic తప్ప, నీ phone వదిలేయ్, phone ఎలాగో ఉంది కదా నీ దగ్గర. నీ mic తప్ప నీకు పెట్టుబడి అస్సలు లేదు. నువ్వు పెట్టేది ఏంటి? mic ఒక్కటే కదా ఖర్చు. ఎందుకంటే నీకు lighting అవసరం లేదు, sunlight లోనే చేస్తావు.

  • ఒక మంచి Boya Wireless Mic తీసుకో: నీ బడ్జెట్ లో వచ్చే బెస్ట్ వైర్‌లెస్ మైక్ ఇది. ఓపెన్ ఏరియాస్ లో షూట్ చేసేటప్పుడు గాలి ఎక్కువగా వస్తుంది కాబట్టి, ఆ విండ్ నాయిస్ ని కంట్రోల్ చేయాలంటే ఒక మంచి మైక్ ఉండాల్సిందే. ఈ Boya Wireless Mic ఒక్కటే నీ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్, దీని కంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు.
  • కెమెరా సెట్టింగ్స్: నీ మొబైల్ లో కెమెరా సెట్టింగ్స్ ని 1080p లేదా 4K లో 30fps కి సెట్ చేసుకో. ఎక్స్‌పోజర్ ని లాక్ చేసి షూట్ చేయడం వల్ల లైటింగ్ అప్‌ అండ్ డౌన్స్ లేకుండా సినిమాటిక్ గా వస్తుంది.
Cinematic Village Podcast Setup guide helping rural unemployed youth create powerful YouTube content, introducing village business ideas telugu and online business ideas in telugu as self employment business ideas in telugu.

The Interview Script: 70 ఏళ్ళు, 80 ఏళ్ళ ముసలమ్మలు, తాతల నోటి నుండి వచ్చే కన్నీటి కధలు

ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు ఏదో పెద్ద ప్రొఫెషనల్ జర్నలిస్ట్ లాగా ముఖం పెట్టకు తమ్ముడూ. వాళ్లతో చాలా ఆత్మీయంగా మాట్లాడు. వాళ్ళని మన సొంత అమ్మమ్మ లాగా, నాయనమ్మ లాగా గౌరవిస్తూ మొదలుపెట్టాలి.

నువ్వు ఒక ముసలమ్మను పట్టుకో. పట్టుకోమంటే గిల్లేమని కాదురోయ్. ఒక తాతను పట్టుకో. ఒక తాతనో, మామనో పట్టుకో! ఒరేయ్ combinations పట్టుకోకురోయ్. జస్ట్ ఒకరినే పట్టుకో. వాళ్ళ కొడుకుల గురించి అడుగు. వాళ్ళ కూతుర్ల గురించి అడుగు. ఎందుకు ఒంటరిగా ఉంటున్నావు అని అడుగు. వాళ్ళ personal story లోకి వెళ్ళు. వాళ్ళ personal story లోకి వెళ్లి మామా ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు? ఇంత వయసు వచ్చింది కదా ఇంకా ఎందుకు కష్టపడుతున్నావు? ఎందుకు, ఏదైనా సహాయం కావాలా? ఒరేయ్ నిన్ను సహాయం చేయమనట్లేదురా. నువ్వే అడుక్కు తినేవాడివి, నువ్వేం సహాయం చేయక్కర్లేదు.

ఇదే listening skill, empathy తో local shops కోసం Google reviews మేనేజ్ చేసే సర్వీస్ పెట్టుకున్నా క్లయింట్లతో ఇదే బాండ్ బిల్డ్ అవుతుంది.

వాళ్ళ పర్సనల్ స్టోరీస్ లోకి ఎలా వెళ్ళాలి?

ముందుగా వాళ్ళను కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలా చేయి. నీ పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళ చేతిని నీ చేతిలోకి తీసుకుని చాలా సున్నితంగా మాట్లాడటం మొదలుపెట్టాలి.

“మామా, నీ చిన్నప్పుడు మన ఊరు ఎలా ఉండేది మామా?”
“ఈ వయసు వచ్చినా కూడా ఇంకా ఎందుకు మామా ఇలా ఒంటరిగా కష్టపడుతున్నావు?”
“నీ పిల్లలు నిన్ను ఎప్పుడైనా వచ్చి చూసారా మామా? నీకు వాళ్ళ మీద కోపంగా ఉందా?”

ఈ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు వాళ్ళ మనసులోని బాధ అంతా బయటకు వస్తుంది. ఆ సమయంలో నువ్వు ప్రొఫెషనల్ యాంకర్ లా కాకుండా వాళ్ళ కష్టాన్ని వినే ఒక మనవడి లాగా ప్రవర్తించాలి.

బ్రిటిష్ కాలం నాటి జ్ఞాపకాలు మరియు నేటి తరం స్మార్ట్‌ఫోన్ ట్రెండ్స్

పాత కాలపు మనుషుల ఆలోచనలు చాలా విభిన్నంగా ఉంటాయి. వాళ్ళ వయసుకి తగినట్టుగా ప్రశ్నలు అడుగు.

“అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మనవాళ్ళు ఎలా కష్టపడేవారు మామా? నిన్ను కుడా ఏమైనా భాదపెట్టారా?”
“ఈ రోజుల్లో చిన్న పిల్లల చేతిలో కూడా స్మార్ట్‌ఫోన్లు ఉంటున్నాయి కదా, ఇవన్నీ చూస్తే నీకేమనిపిస్తుంది?”
“అప్పట్లో మీరు తిన్న ఆహారానికి, ఇప్పటి ఫుడ్స్ కి తేడా ఏంటి మామా?”

రేయ్ తమ్ముడు, google నా బ్లాగ్ చూస్తుంది అందుకే నేను చాలా చాలా కూల్గా మాట్లాడుతున్నా, బూతులు వాడకుండా, నీకు తెలుసుగా ఎలాంటి questions అడగాలో?

ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతుంటే వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ చాలా నేచురల్ గా, హృదయానికి హత్తుకునేలా ఉంటాయి.

A strategic roadmap revealing how to execute a cinematic village podcast correctly, offering a highly lucrative path for Andhra Pradesh unemployed youth looking to master ai in telugu to power their telugu side hustles.

Character కి ఇచ్చే గౌరవం: Saree, పండ్లు, తాంబూలం మరియు Blessings తీసుకోవటం

ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి తమ్ముడూ. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వాళ్లకు ఏదో ఒక వంద లేదా రెండొందల రూపాయలు చేతిలో పెట్టి పంపించేస్తే, అది చాలా ఇన్సల్టింగ్ గా ఉంటుంది. వాళ్లకు మనం ఇచ్చే గౌరవం చాలా ముఖ్యం.

మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం చేయాల్సింది ఏంటంటే:

  • ఒక మంచి చీర లేదా ధోవతి కొనిపెట్టు: నీకు వచ్చే ఇన్కమ్ లో లేదా నీ పాకెట్ మనీ లో ఒక 300 నుండి 500 రూపాయలు ఖర్చు పెట్టి ఒక అందమైన చీర లేదా ఒక మంచి పంచె కొను.
  • పండ్లు మరియు తాంబూలం: ఆ అవ్వకి లేదా తాతకి పండ్లు, పూలు ఇచ్చి పాదాలకు నమస్కారం చేసి దీవెనలు తీసుకో.

ఒకవేళ ఆ అవ్వకి భర్త లేకపోతే బొట్టు, కుంకుమ పెట్టకుండా కేవలం చీర, పండ్లు ఇచ్చి గౌరవంగా పంపించు. ఈ సీన్ ని నీ video ఎండింగ్ లో చూపిస్తే, చూసే ప్రతి ఒక్కడి గుండె కరిగిపోతుంది. ఆడియన్స్ నీకు లైఫ్ లాంగ్ ఫ్యాన్స్ అయిపోతారు.

కక్కుర్తిపడి ఆ చీప్ QR code సెటప్స్ ఎందుకు పెట్టకూడదు?

Just నువ్వు కక్కుర్తిపడి మామకు సహాయం చేయాలంటే ఈ QR code కి డబ్బులు send చేయండి , ఇలాంటివి చెప్పావనుకో, రెండు మూడు రోజులు చూస్తారు జనాలు, నాలుగో రోజున ఎవడో ఒకడు police case పెట్టేస్తాడు నీ మీద. సో అలాంటి చిల్లర పనులు చేయకు. నేను చెప్పేది long-term content.

మనం ఇక్కడికి వచ్చింది బిచ్చమెత్తుకోవడానికి కాదు, ఒక అద్భుతమైన క్రియేటివ్ వర్క్ ని గౌరవంగా చేయడానికి. జెన్యూన్ గా కంటెంట్ చెయ్, డబ్బులు YouTube ఆటోమేటిక్ గా ఇస్తుంది. సింహం, డబ్బు అడగడం కాదు, సంపాదించడం నేర్చుకోవాలి, AI startup loan ఎలా తీసుకోవాలో కూడా తెలుసుకుంటే equipment అప్‌గ్రేడ్ కి రెడీగా ఉంటావు.

YouTube Titles, Thumbnails మరియు NRI ఆడియన్స్ మ్యాజిక్: గ్లోబల్ వ్యూస్ ద్వారా వచ్చే భారీ AdSense RPM

వీడియో ఎంత బాగా చేసినా, thumbnail బాగోకపోతే ఎవడూ క్లిక్ చేయడు. నీ thumbnail డిజైన్ ఎలా ఉండాలంటే ఆ పాత పెంకుటిల్లు లేదా మర్రిచెట్టు బ్యాక్‌గ్రౌండ్ స్పష్టంగా కనిపించాలి. ఆ అవ్వ కళ్లల్లో ఉండే ఎమోషన్ thumbnail లో కనిపించాలి. ఆ సాధారణమైన అవ్వ ముందు ఒక ప్రొఫెషనల్ బ్లాక్ మైక్ ఉండాలి. ఈ విజువల్ కాంబినేషన్ చూడగానే జనాలకు విపరీతమైన క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది.

నీ titles కూడా చాలా సహజంగా, ఎమోషనల్ గా ఉండాలి. ఎక్కడా vulgar లేదా cringe పదాలు వాడొద్దు. టైటిల్స్ ఎంత బాగున్నా, AdSense policies సరిగ్గా follow చేయకపోతే channel కి రిస్క్ వస్తుంది, ఒకసారి గైడ్‌లైన్స్ చదివేసుకో.

కొన్ని బెస్ట్ టైటిల్ ఐడియాస్:

  • “నేను ఒక గుర్తుతెలియని మామతో…”
  • “ఈరోజు ఈ మామతో ఒక గుండెల్ని పిండేసే ప్రయాణం”
  • “ఎప్పుడూ చూడని podcast…”
  • “ఇలాంటి వాళ్ళని ఎవరూ podcast చేయరు…”

SEO తో పని లేకుండా గూగుల్ Algorithm ని ఆటోమేటిక్ గా లొంగదీసుకోవడం ఎలా?

ఇంకా నీ target audience అంటావా? ఒరేయ్ నువ్వు వద్దన్నా సరే వద్దన్నా సరే ప్రతి video కూడా లక్ష పైనే వెళ్ళిపోద్ది. నా లవడాలో SEO చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే Google కి తెలుసు, దేన్ని లేపాలి దేన్ని పడుకోబెట్టాలి. NRI ఆడియన్స్ కి రీచ్ అవ్వాలంటే Gemini తో content ఎలా plan చేయాలో కూడా చూసుకో, titles, descriptions ఇంకా షార్ప్ గా వస్తాయి.

నీకు పడే Likeలకి నీకే పిచ్చెక్కిపోద్ది, నేను చెప్తున్నాను కదా. చాలా మంది Americans, Australians ఇండియా నుంచి వెళ్ళిపోయిన తెలుగు వాళ్ళందరూ కూడా మన తెలుగు content ని విచ్చలవిడిగా చూస్తారు. వాళ్లకు వాళ్ళ ఊరు అన్నా, ఇలాంటి పాత ముసలమ్మల మాటలు అన్నా విపరీతమైన Nostalgia. అందువల్ల నీకు విదేశాల నుండి వ్యూస్ రావడం వల్ల భారీ AdSense RPM వచ్చేస్తుంది.

1-Year మరియు 2-Years Complete రోడ్‌మ్యాప్: మన పల్లెటూరి నుండే ఒక Digital Media Empire నిర్మించడం

నువ్వు ఈ రోజు మొదటి అడుగు వేస్తే, రాబోయే రెండు సంవత్సరాల్లో నీ లైఫ్ ఏ రేంజ్ లో చేంజ్ అవుతుందో ఇక్కడ చూడు తమ్ముడూ:

మొదటి సంవత్సరం (The Foundation Phase)

  • మన చుట్టుపక్కల ఉండే పల్లెటూర్లలో కనీసం 30 నుండి 40 ఎపిసోడ్స్ రికార్డ్ చేయి.
  • ప్రతి వీడియో క్వాలిటీ మరియు ఆడియో Genuine గా ఉండేలా చూసుకో.
  • నీకు వచ్చే మొదటి ఆదాయంతో నీ Equipment ని అప్‌గ్రేడ్ చేసుకో.

రెండవ సంవత్సరం (The Media Empire Phase)

  • నీకంటూ ఒక టీమ్‌ని బిల్డ్ చేసుకో. టీమ్ బిల్డ్ చేసుకునేటప్పుడు వాళ్ళ పేమెంట్స్, projects అన్నీ ట్రాక్ చేయడానికి ఒక సింపుల్ custom API integration సెటప్ కూడా పనికొస్తుంది.
  • కేవలం నీ జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్న Different పల్లెటూర్లని కవర్ చేయి.
  • నువ్వు ఒక బ్రాండ్ లాగా మారిపోయి లోకల్ Advertisers మరియు గ్లోబల్ Sponsors తో కనెక్ట్ అవ్వొచ్చు. sponsors తో మాట్లాడేటప్పుడు నీ brand ని ఫార్మల్‌గా చూపించాలంటే T-Hub లాంటి ప్లేస్ లో రిజిస్ట్రేషన్ కూడా క్రెడిబిలిటీ యాడ్ చేస్తుంది.

1940s, 1950s తరం కనుమరుగైపోయే ముందే వాళ్ళ హిస్టరీని రికార్డ్ చేయాల్సిన బాధ్యత

సనాతన ధర్మం బతికుండాలి, గోమాత బతికుండాలి. మన పూర్వీకులు ఒక తరం కొంతకాలంలో కనుమరుగైపోతుందని ఎవరో TV లో చెప్పారు. అంటే 1970s, 1960s batch వెళ్ళిపోతుందని చెప్పారు. నేను నీకు చెప్పింది ఎవరి గురించో తెలుసా ఇప్పుడు? దానికన్నా ముందు తరం గురించి. 1940s, 1950s batch. వాళ్ళు ఇంకా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు, ఒకసారి ఆలోచించు.

ఒకళ్ళు నీకు దొరికారు అని చెప్పి అనుకుంటే, వాళ్ళు రేపు లేరు అని తెలిస్తే ఈ podcast ని వాళ్ళ మనవలో లేదంటే వాళ్ళ తెలిసినోళ్ళో లేదంటే వేరే ఊళ్ళో వాళ్ళో… లేదు నీకు నువ్వే చేసిన interview లో మామ్మ రేపు పొద్దున చనిపోయింది అనుకో? నీకు నిజంగా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. నీలో ఉన్న మనిషి మళ్లా బతికొస్తాడు బయటికి. అన్నయ్య చెప్తున్నాడు అని గుర్తుపెట్టుకో. ఈ niche గనుక నువ్వు సరిగ్గా experiment చేసి… experiment కాదురా, ఇది డైరెక్ట్ hit ఏ.

Pros & Cons Matrix: రూరల్ ఏరియాస్ లో ఎదురయ్యే రియలిస్టిక్ సవాళ్లు

పల్లెటూర్లలో ఈ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు నీకు ఎదురయ్యే రియలిస్టిక్ మంచి చెడులను ఈ కింది టేబుల్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను:

లాభాలు (Pros)నష్టాలు (Cons)ఎలా అధిగమించాలి?
రూపాయి పెట్టుబడి లేదు కాబట్టి జీరో ఫైనాన్షియల్ రిస్క్మొదట్లో ఊర్లో వాళ్ళు హేళన చేస్తారు, నవ్వుకుంటారువాళ్ళ బోడి సలహాలు పట్టించుకోకుండా నీ పని నువ్వు చేయి
NRI audience వల్ల తక్కువ వ్యూస్ వచ్చినా భారీ ఆదాయంకొంతమంది ముసలమ్మలు మాట్లాడటానికి సిగ్గుపడతారువాళ్లతో చాలా ఆత్మీయంగా మాట్లాడి భయాన్ని పోగొట్టు
సమాజంలో మరియు నీ మండలంలో విపరీతమైన గౌరవం పెరుగుతుందిఓపెన్ ఏరియాస్ లో గాలి వల్ల విండ్ నాయిస్ వస్తుందిఒక మంచి వైర్‌లెస్ Boya mic ని మాత్రమే ఇన్వెస్ట్ మెంట్ గా పెట్టుకో
ఎడిటింగ్ లో పెద్దగా గ్రాఫిక్స్ అవసరం లేదు, నేచురల్ రియలిజం చాలురాత్రి పూట షూటింగ్స్ చేస్తే చేతబడి అని ఊర్లో తంతారుకేవలం పగటిపూట సూర్యకాంతిలోనే షూటింగ్స్ అన్నీ ప్లాన్ చేసుకో

ఈ గౌరవమే రేపు Vizag Google AI Hub లాంటి డోర్లు కూడా ఓపెన్ చేయొచ్చు, నీ పోర్ట్‌ఫోలియో ఒక్కటే చాలు. నువ్వు పీకుడుగాడివి అని వైజాగ్ గూగుల్ లో కుడా తెలిసిపోతే? పొరపాటున or కర్మకాలిపోయి నువ్వు వైజగ్ గూగుల్లో select అయ్యిపోతే? నన్ను మర్చిపోకు తమ్ముడూ…..

InfoPinky Free portfolio website support ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?

మేము ముందే ప్రామిస్ చేసినట్టు, నీకు ఉచితంగా ఒక professional portfolio website బిల్డ్ చేసి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం.

నువ్వు చేయాల్సిందల్లా ఒకటే:

  1. మా అఫీషియల్ వెబ్‌సైట్ infopinky.com ని విజిట్ చేయి.
  2. contact details లో మన email address ఉంది కదా దాంట్లో ఒక thanks mail పెట్టు. thanks bro అని చెప్పి పెట్టు.
  3. మా team నీ రిక్వెస్ట్ ని వెరిఫై చేసి, నీ కోసం ఒక బ్యూటిఫుల్ వెబ్‌సైట్ ని డిజైన్ చేసి, free hosting మరియు domain ని లైఫ్ టైమ్ ప్రొవైడ్ చేస్తుంది.

పోర్టఫోలియో వెబ్‌సైట్ ఒక్కటే సరిపోదు, దాంతో పాటు AI టూల్స్ తో నీ resume కూడా షార్ప్ చేసుకుంటే స్పాన్సర్ల ముందు నీ ప్రొఫైల్ ఇంకా బలంగా కనిపిస్తుంది.

దూల తీరిపోవాలి అందరికీ! నువ్వే Trend Set చెయ్యాలి!

ఒరేయ్ తమ్ముడు, ఇంటర్నెట్ లో గొప్పలు చెప్పుకుంటూ పీకుడుగాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నిజంగా గ్రౌండ్ లోకి దిగి కష్టపడే వాడే అసలైన హీరో. ఈ రోడ్‌మ్యాప్ లో నీకు చాలా క్లియర్ గా, ఎక్కడా సోది లేకుండా కంప్లీట్ ప్రాక్టికల్ ప్లాన్ ఇచ్చాను. తమ్ముడూ, ఏ దారి పికప్ చేసుకున్నా, ఆ డబ్బు సరిగ్గా ప్లాన్ చేసుకోవడానికి AI ఫైనాన్స్ ప్లానింగ్ కూడా ఒకసారి నేర్చుకో, సంపాదించడమే కాదు, నిలబెట్టుకోవడం కూడా ముఖ్యం.

నేనేం తుప్పాసి contentలు రాయనురా. Okayనా? తుప్పాసి contentలు, తూతూంబ్ర contentలు, cringe contentలు గురించి నేను discuss చేయను. చాలా quality ఉన్నదే మాట్లాడుతున్నాను నేను. real-life ఏదైతే దగ్గరగా ఉందో అది అందరూ accept చేస్తారు. reels కి ఏదైతే దగ్గరగా ఉందో అదే ఈరోజు trending లో నడుస్తాది కానీ రేపు outdated అయిపోద్ది. Okayనా? గుర్తుపెట్టుకోరా తమ్ముడు, ఉంటా మరి!

Shiv shankar

Mr. Shiv Shankar is an independent freelancer and digital specialist with over 7 years of hands-on experience working across multiple global freelancing platforms. Read bio above.