ఇల్లు దాటకుండానే జేబు నిండాలంటే… 14 Small Business Ideas Telugu లో, ₹10,000 లోపు పెట్టుబడితో మొదలయ్యేవి
మొన్న ఊరెళ్ళినప్పుడు వీధి అరుగు మీద కూర్చున్న నా చిన్ననాటి ఫ్రెండ్ ఒక్కసారిగా అడిగేసాడు. “ఏ రా, సిటీలో ఏం జరుగుతోంది? కొత్తగా ఏమైనా Businesses ideas ఉంటె చెప్పారా !” అని. “చిన్నవాళ్లు చేసుకునే యాపారం మాత్రమే చెప్పరోయ్” అన్నాడు . నేను నవ్వుకున్నా, ఎందుకంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు వ్యాపారం అంటే పెద్ద షాపు తెరవడం, లక్షలు పెట్టుబడి పెట్టడం కాదు. ఒక్క గదిలో కూర్చుని, చేతిలో ఉన్న నైపుణ్యంతో నెలకి పాతిక ముఫ్ఫై వేలు సంపాదించే వాళ్ళు ఇప్పుడు కోకొల్లలు.
ఇక్కడ ఆడోళ్ళ వ్యాపారాలు, మగోళ్ళ వ్యాపారాలు అని వేరుగా ఏమీ ఉండదు. కావాల్సింది ఒక్కటే — ఏ ప్లాట్‌ఫామ్ ఎంచుకున్నామన్నది. అది ఆఫ్‌లైన్ కావొచ్చు, ఆన్‌లైన్ కావొచ్చు. ఇంతకుముందు నేను Best Small Business Ideas In Telugu Part 1 లో తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టే ఆలోచనలు చెప్పా, Part 2 లో 100+ Latest Small Business Ideas Telugu లో రాశా. ఇవాళ Part 3 లో ఇంకో పద్నాలుగు ఐడియాలు తీసుకొచ్చా. ప్రతీదీ ఒక్కో రకంగా ఉంటుంది — ఏదో ఒకటి మీ ఇంటికి, మీ ఊరికి, మీ చేతిలో ఉన్న ఖాళీ టైమ్‌కి ఖచ్చితంగా సూట్ అవుతుంది. మొదలెడదాం పదా.
అసలు ఇందునూ ఏముంది?
1. ఇంట్లో ఖాళీ గదిలోనే Mushroom Grow Kit వ్యాపారం | Home Based Business Idea for Women Telugu లో
ఒక్క క్షణం ఆలోచించండి. మీ ఇంట్లో ఖాళీగా ఉన్న ఒక 10×10 గది ఉందా? ఎండ పడకుండా, కాస్త తేమగా ఉంటే చాలు. అంతే, మీ వ్యాపారానికి స్థలం రెడీ అయిపోయినట్టే. చేసేది ఏంటంటే, ఒక కవర్‌లో శుభ్రం చేసిన వరిగడ్డిని mushroom spawn తో కలిపి pack చేయడం. దాన్ని కొన్న కస్టమర్ ఇంటికి తీసుకెళ్ళి రోజుకి రెండుసార్లు నీళ్ళు స్ప్రే చేస్తే చాలు, 12 నుండి 15 రోజుల్లో fresh oyster mushrooms చేతికి వస్తాయి, కోసుకుని కూర వండుకోవచ్చు.
ఇదెందుకు క్లిక్ అవుతుందంటే, ఇప్పుడు apartment లో ఉండేవాళ్ళకి “మా ఆహారం మేమే పండించుకున్నాం” అనే ఫీలింగ్ కావాలి. దానికోసమే terrace gardening, organic food అని వెతుకుతున్నారు. మీరు వాళ్ళకి ఆ అనుభవాన్నే అమ్ముతున్నారు, కేవలం మష్రూమ్ కాదు.
ఖర్చు ఎంతవుతుంది? వరిగడ్డి, polythene covers, spawn, spray bottle కలిపి ₹5,000 నుండి ₹10,000 లోపే అయిపోతుంది. నేర్చుకోవడానికి డబ్బు అక్కర్లేదు — దగ్గర్లో ఉన్న Krishi Vigyan Kendra లో రెండు రోజుల ఉచిత శిక్షణ ఉంటుంది, లేదా YouTube లో చూసి కూడా నేర్చుకోవచ్చు. చిన్న స్థాయిలో అమ్మడానికి FSSAI Basic Registration సరిపోతుంది, దీన్ని FoSCoS పోర్టల్ లో ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర్లో MeeSeva సెంటర్‌కి వెళ్ళినా అయిపోతుంది.
అమ్మకం ఎలా? WhatsApp Status లో మీ కిట్ నుండి వచ్చిన మష్రూమ్ వీడియో పెట్టండి, “10 రోజుల్లో ఇంట్లో పండినవి” అని రాయండి. Organic షాపులకి వెళ్ళి 5 sample kits ఇచ్చి, అమ్ముడైతే ప్రతి kit కి కమిషన్ ఇస్తానని చెప్పండి. ఆదివారం apartment పార్క్‌లో ఫ్రీ డెమో పెడితే అక్కడే చాలామంది కొనేస్తారు. ఒక్కసారి కొన్న కస్టమర్ మళ్ళీ మళ్ళీ వస్తాడు, ఎందుకంటే మూడు నెలలకి spawn అయిపోతుంది. తర్వాత mushroom pickle, mushroom powder కూడా అమ్మొచ్చు — ఒక్క Mushroom Grow Kit మొదలైతే మిగతా ప్రొడక్ట్‌లు వాటంతట అవే వస్తాయి.
కొన్ని సందేహాలు: మష్రూమ్ ఎండిపోతోంది అని కస్టమర్ కంప్లైంట్ చేస్తే? గది చల్లగా ఉందా, రోజుకి రెండుసార్లు స్ప్రే చేస్తున్నారా అని అడగండి — చాలాసార్లు ఇదే తప్పు జరుగుతుంది. ఇంకో సందేహం, ఒకేసారి ఎన్ని కిట్లు తయారు చేయాలి? మొదట్లో పది కిట్లతో మొదలుపెట్టి, డిమాండ్ చూసుకుని పెంచుకోవడమే మంచిది, ఎందుకంటే spawn తాజాగా ఉన్నప్పుడే బాగా మొలకెత్తుతుంది. హాస్టళ్ళ దగ్గర, PG ల దగ్గర ఉండే యూత్‌కి కూడా ఇది ఒక కొత్త experiment లాగా నచ్చుతుంది, వాళ్ళకి తక్కువ ధరకే offer ఇస్తే word-of-mouth marketing వేగంగా జరుగుతుంది.
2. కొబ్బరి చిప్పలతో Coconut Shell Products | Small Scale Business Ideas Telugu లో
గుడి దగ్గర, కొబ్బరి బండ్ల పక్కన కుప్పలుగా పడేసిన చిప్పలు చూసే ఉంటారు. అందరికీ అవి చెత్త. కానీ కళాకారుల కళ్ళకి అదే పెట్టుబడి, అదికూడా దాదాపు సున్నా ఖర్చుతో. ఎందుకంటే హోటళ్ళు, cafes ఇప్పుడు plastic ని తగ్గించేసి eco-friendly bowls, spoons, candle holders వెతుకుతున్నాయి.
ఎలా చేయాలంటే, ముందుగా మీ ఏరియాలో ఉన్న కొబ్బరి కొట్టు వాళ్ళతో మాట్లాడండి, “మీరు పడేసే చిప్పలు నాకు ఇవ్వండి” అని అడగండి — వాళ్ళకి కూడా శుభ్రం చేసే బాధ తప్పుతుంది కాబట్టి ఉచితంగానే ఇస్తారు. చిప్పల్ని రెండు రోజులు నీళ్ళలో నానబెట్టి, పీచు తీసేసి sand paper తో బాగా రుద్దితే, పొయ్యి మీద కాస్త వేడి చేస్తే నల్లగా మెరుస్తాయి. Coconut oil రాస్తే తినే సామాన్లకి కూడా వాడొచ్చు, candle కావాలంటే లోపల wax పోస్తే చాలు.
కొనేవాళ్ళు ఎవరంటే, soup bowls, ice cream cups కోసం హోటళ్ళు వందల కొద్దీ order ఇస్తాయి. Diwali టైంలో companies eco గిఫ్ట్స్ కోసం వెతుకుతాయి, bowl-spoon-candle holder కలిపి ఒక సెట్ చేసి అమ్మొచ్చు. ఈ ఐడియా మీద నేను ఇంతకుముందు ఒక పూర్తి గైడ్ రాశాను — ఏఏ tools కావాలి, ఎలా polish చేయాలి, ఏ ధరకి అమ్మాలి అనేది స్టెప్ బై స్టెప్ Coconut Shell Products Business లో ఉంది, ఒకసారి చూడండి. అలాగే కొబ్బరి మీదే ఆసక్తి ఉంటే, పచ్చి కొబ్బరి బండ్ల వ్యాపారం మీద రాసిన Coconut Selling Business కూడా చదవండి, ఇది కూడా అదే ముడిసరుకుతో వేరే యాంగిల్.
Amazon Karigar ప్రోగ్రామ్‌లో చేరితే packing, delivery అంతా వాళ్ళే చూసుకుంటారు, మీరు సరుకు పంపిస్తే చాలు. బయటదేశాల కస్టమర్లు కావాలంటే Etsy లో “Handmade Coconut Bowl” అని పెడితే డాలర్లలో రేటు వస్తుంది. మొదట ₹500 తో sand paper, knife కొని 4-5 వస్తువులు చేసి, Photos తీసి Instagram లో పెడితే చాలు — ఆర్డర్ వస్తే advance తీసుకుని సరుకు చేయండి, రిస్క్ ఏమీ ఉండదు.
చిప్పకి రంధ్రం చేసేటప్పుడు చేతికి దెబ్బ తగలకుండా hand drill వాడండి, పదునైన అంచుల దగ్గర జాగ్రత్తగా ఉండండి. క్వాలిటీ నిలబెట్టుకోవడమే ఇక్కడ అసలైన సవాలు — ప్రతి బౌల్ ఒకేలా polish అవ్వాలి, లేదంటే కస్టమర్ నమ్మకం పోతుంది. మీ ఏరియాలో జరిగే craft fairs, weekend markets లో స్టాల్ పెడితే, జనాలు నేరుగా చేతితో పట్టుకుని చూసి కొంటారు, అది Online కంటే వేగంగా నమ్మకం కలిగిస్తుంది. ఒక్కసారి మీ బ్రాండ్ పేరు స్థిరపడితే, hotels, resorts తో యేడాదికి ఒకసారి bulk order agreement కూడా చేసుకోవచ్చు.
3. వాడిపోయిన పూలతో … Dried Flower Craft | Best Home Based Business Idea In Telugu
పెళ్ళి అయ్యాక, పూజ అయ్యాక గుట్టలుగా పడేసే పూలు రెండు రోజుల్లోనే వాడిపోతాయి. వాటిని పడేయకుండా dry చేసి photo frames, bookmarks, keychains చేస్తే, అమ్మేది వస్తువు కాదు, ఒక జ్ఞాపకం. పెళ్ళిలో వేసుకున్న దండని frame కట్టి ఇస్తే దాన్ని “Memory Frame” అంటారు, దీనికి మంచి రేటు కూడా వస్తుంది — ఖర్చు దాదాపు సున్నా, frame మాత్రమే కొనాలి.
పూలు dry చేయడానికి machine ఏమీ అక్కర్లేదు. చదువుకునే పుస్తకాల మధ్య పూలు పెట్టి 10 రోజులు వత్తి ఉంచొచ్చు, లేదా Silica Gel అనే పొడి డబ్బాలో పెట్టి మూత పెడితే 3 రోజుల్లో రంగు పోకుండా ఎండిపోతాయి. ఇక్కడి నుండి పెళ్ళి దండ frames, resin keychains, laminated bookmarks, transparent phone case లు — ఇలా ఎన్నో చేయొచ్చు. ఈ ప్రాసెస్ మొత్తం, ముఖ్యంగా resin తో పూలు preserve చేసే టెక్నిక్ నేను Dried Flower Craft Business ఆర్టికల్‌లో పూర్తిగా, ఫోటోలతో సహా వివరించాను, అక్కడ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది.
Event చేసేవాళ్ళతో, flower decoration వాళ్ళతో మాట్లాడి “మీరు పడేసే పూలు నాకు ఇవ్వండి, రిటర్న్ గిఫ్ట్‌లు నేను చేసి ఇస్తా” అని చెప్పండి. Instagram లో వాడిపోయిన దండ నుండి అందమైన frame అయ్యే వరకు వీడియో పెడితే బాగా షేర్ అవుతుంది, ఎందుకంటే జనాలకి ఆ “before-after” మ్యాజిక్ చాలా నచ్చుతుంది.
రేంజ్ చూస్తే, చిన్న laminated bookmark ₹50 నుండి మొదలై, resin keychain ₹150-250, పెద్ద A4 memory frame ₹800-1,500 దాకా వెళ్తుంది. కొంతమంది ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళు తమ డెస్క్ మీద పెట్టుకోవడానికి చిన్న pressed-flower art frames కూడా కొంటున్నారు, ఇది కొత్త customer segment. ఒక్కసారి మీ దగ్గర ఐదారు designs రెడీ అయితే, వాటినే catalog గా పెట్టి పెళ్ళి సీజన్‌లో ముందుగానే bookings తీసుకోవచ్చు — advance తీసుకుంటే మీకు క్యాష్‌ఫ్లో సమస్య కూడా ఉండదు.
4. తాటాకు తో వ్యాపారం – Palm Leaf Craft | Village Business Idea In Telugu
మన తాతల కాలంలో తాటాకు చాప, బుట్టలు మామూలు వస్తువులు. ఇప్పుడు అవే “Boho Decor”, “Sustainable” పేరుతో పట్నంలో మంచి రేటుకి అమ్ముడవుతున్నాయి. పల్లెలో తాటాకు ఉంది, అల్లేవాళ్ళు ఉన్నారు, కానీ అమ్మే దారి లేదు. ఆ దారి మీరు చూపిస్తే, ఇక్కడ మీ పని అల్లడం కాదు, అమ్మడం.
మీ ఊర్లో ఉన్న ఐదుగురు ఆడవాళ్ళతో ఒక గ్రూప్ కడితే, వాళ్ళు వస్తువులు చేస్తారు, మీరు ఆర్డర్లు తేవడం, packing చేయడం, Instagram నడపడం చూసుకుంటే చాలు. ఒక్కో వస్తువుకి కూలి ఇచ్చి, మిగిలిన మార్జిన్ మీది.
| వస్తువు | కొనేవాళ్ళు | ధర |
|---|---|---|
| భోజనం బుట్టలు | ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళు | ₹180 – ₹300 |
| టేబుల్ మ్యాట్స్ (6) | గృహప్రవేశ బహుమతులు | ₹450 – ₹700 |
| గోడకు వేలాడేవి | Cafes, కొత్త ఇళ్ళు | ₹600 – ₹1,200 |
| Laptop Covers | కాలేజీ పిల్లలు | ₹350 – ₹500 |
“తాటాకు బుట్ట” అని ఉత్తిగా పెడితే ఎవరూ పట్టించుకోరు, కానీ “ఫలానా ఊర్లో లక్ష్మమ్మ గారు చేత్తో అల్లిన బుట్ట” అని ఫోటోతో పెడితే కొనేవాడికి ఒక అనుబంధం ఏర్పడుతుంది — కథ చెప్పడం ఇక్కడ చాలా ముఖ్యం. ఇక్కడ కూడా Amazon Karigar లో చేరితే packing, delivery బాధ ఉండదు. కొత్తగా బిజినెస్ మొదలుపెడుతున్నట్టు అయితే Part 1 లో నేను రాసిన low-investment ఆలోచనలు కూడా ఒకసారి చూడండి, అవి కూడా ఇలానే ఊర్లో దొరికే ముడిసరుకుతో మొదలయ్యేవే.
గ్రూప్‌లో పనిచేసేటప్పుడు నాణ్యత ఒకేలా ఉండేలా చూసుకోవడం ముఖ్యం — మొదట్లో ప్రతి వస్తువుని మీరే check చేయండి, సైజు, అల్లిక ఒకేలా లేకపోతే customer రిపీట్ అవ్వడు. ఒక్కసారి trust ఏర్పడితే, cafes, resorts లాంటి చోట్ల wall decor, table setting కోసం yearly contract కూడా తీసుకోవచ్చు. ఈ మోడల్‌లో మీరు మధ్యవర్తి కాదు, ఒక చిన్న బ్రాండ్ — అదే మీకు ఎక్కువ మార్జిన్ ఇస్తుంది.
5. రాళ్ల మీద బొమ్మలు – Stone Painting Business | Simple Business Ideas In Telugu
Mandala art, Doodles అంటే ఇష్టమా? అయితే వాగు దగ్గరికి వెళ్ళి నున్నగా ఉండే రాళ్ళు ఏరుకోండి, అదే మీ పలక. శ్రావణి అనే అమ్మాయి B.Tech మధ్యలో ఆపేసి ఇంట్లో ఖాళీగా ఉండేది. Instagram లో mandala చూసి, గ్రౌండ్‌లో దొరికిన రాయిపై వేసి “Paper Weight” అని ₹99 కి Reels చేసింది. అది చూసిన ఒక Architect తన office కోసం ముప్ఫై అడిగాడు, అక్కడి నుండి మొదలైంది. ఖర్చు? రాళ్ళు ఉచితం, రంగులు కొద్దిగా మాత్రమే. ఇప్పుడు నెలకి రెండొందల రాళ్ళు చేస్తుంది.
ఏమేం చేయొచ్చు: పేర్లు రాసిన రాళ్ళు బహుమతికి, fridge magnets, తోటలో మొక్కల దగ్గర పాతే name tags, office బల్ల మీద పెట్టుకునే motivational రాళ్ళు, పండుగలకి తగ్గట్టు themed రాళ్ళు. సామాన్లు కూడా చాలా తక్కువ — రాళ్ళు ఏరుకోవచ్చు లేదా చేపల దుకాణంలో కిలో లెక్కన దొరుకుతాయి, రంగుల కోసం Fevicryl లాంటి non-toxic acrylic colors వాడితే మంచిది, బ్రష్‌లు, varnish కలిపి మొత్తం ₹500 లోపే.
మీ బొమ్మలు Pinterest లో పెడితే బయటదేశాల్లో ఎంత ఇష్టపడతారో తెలుస్తుంది, అక్కడి నుండి Etsy షాప్ లింక్ ఇస్తే డాలర్లలో అమ్మొచ్చు. Meesho లో “₹100 లోపు return gifts” అని పెడితే పుట్టినరోజులకి, పెళ్ళిళ్ళకి ఆర్డర్లు వస్తాయి, గిఫ్ట్ షాపులకి 10 sample ఇచ్చి “అమ్ముడైతే డబ్బు ఇవ్వండి” అనొచ్చు. రోజుకి ఒక్క రాయి వేస్తే నెలకి ముప్ఫై డిజైన్లు రెడీ అవుతాయి, అవే మీ portfolio.
రంగు వేసిన తర్వాత varnish spray తప్పకుండా వేయాలి, లేదంటే ఎండకి, వానకి రంగు వెలిసిపోతుంది — ఇది చాలామంది మొదట్లో మర్చిపోయే చిన్న విషయం, కానీ దీని వల్లే customer రిపీట్ ఆర్డర్ ఇవ్వకుండా ఆగిపోతాడు. Door-stopper size రాళ్ళు తీసుకుని వాటి మీద మీ ఊరి పేరు, ఇంటి నంబర్ రాస్తే గృహప్రవేశ గిఫ్ట్‌గా బాగా అమ్ముడవుతుంది. ఒక్కసారి మీ style ఏర్పడితే, అదే మీ signature అవుతుంది, జనాలు మీ పేరు చెప్పి వెతుక్కుంటూ వస్తారు.
6. వెదురుతో టేబుల్ సామాను – Bamboo Desk Organizer | Small Scale Business Ideas In Telugu
ఇప్పుడు అందరూ Work From Home చేస్తుండటంతో బల్ల శుభ్రంగా, అందంగా ఉంచుకోవాలనుకుంటున్నారు. Plastic organizer కంటే వెదురుతో చేసినవి అందంగా, గట్టిగా ఉంటాయి కాబట్టి డిమాండ్ ఎక్కువగా ఉంది. వెదురు కట్ట మార్కెట్‌లో ₹300-400 కి దొరుకుతుంది, దాన్ని చిన్న ముక్కలుగా కోసి, sand paper తో రుద్ది, కొబ్బరి నూనె రాస్తే సహజమైన మెరుపు వస్తుంది. Ruler, knife, fevicol ఉంటే చాలు, అల్లడం రాకపోయినా ఊర్లో పెద్దవాళ్ళకి వచ్చు, మీరు నాణ్యత సరిచూస్తే సరిపోతుంది.
| వస్తువు | ధర |
|---|---|
| Pen & Mobile Stand | ₹180 – ₹250 |
| 3-in-1 Organizer Set | ₹450 – ₹650 |
| File Tray | ₹300 – ₹400 |
| Custom Name Engraved | ₹500 – ₹800 |
Stationery షాపుల్లో 5 sample ఇచ్చి అమ్ముడైతే డబ్బులు తీసుకోండి, చిన్న కంపెనీలు కొత్త సంవత్సరం గిఫ్ట్‌లుగా bulk order ఇస్తాయి. Flipkart Seller లేదా Meesho Supplier Panel లో లిస్ట్ చేస్తే online orders కూడా వస్తాయి, photos మాత్రం మంచి వెలుతురులో తీయండి. ఈ ఐడియా నచ్చితే, చెక్కతో చేసే Wooden Educational Toys Business కూడా ఒకసారి చదవండి, అదే స్కిల్‌తో వేరే మార్కెట్‌లోకి వెళ్ళొచ్చు.
కోతలు ఎప్పుడూ ఒకే కొలతతో చేయాలి, లేదంటే set లో ముక్కలు అమరవు — ఒక్కసారి ఒక ruler template చేసుకుంటే ప్రతిసారీ కొలతలు తీసుకోవాల్సిన పని ఉండదు, టైమ్ కూడా ఆదా అవుతుంది. Corporate gifting seasons లో (New Year, Diwali) companies ఒకేసారి 50-100 sets ఆర్డర్ ఇస్తాయి కాబట్టి ఆ టైమ్‌కి ముందే HR departments ని సంప్రదించడం మంచిది. Product photos తీసేటప్పుడు తెల్లటి బ్యాక్‌గ్రౌండ్ మీద, natural light లో తీస్తే online listing కి బాగా పనికొస్తాయి.
7. పిల్లల ఆట వస్తువులు – Home Made Wooden Educational Toys | Best Home Business Ideas Telugu లో
చిన్న పిల్లల తల్లిదండ్రులు ఇప్పుడు plastic toys కంటే చెక్క బొమ్మలు కొనడానికే ఇష్టపడుతున్నారు, ఎందుకంటే అవి విరగవు, రంగులు పిల్లలకి హాని చేయవు. Montessori బడులు, ఇంట్లో పిల్లలకి నేర్పించే తల్లులు “educational toys” అంటే వెతుకుతున్నారు.
- వేప, తేకు మిగిలిన ముక్కలు వడ్రంగి షాపుల్లో తక్కువ ధరకే దొరుకుతాయి, పెద్ద machines అక్కర్లేదు.
- Counting Pegs (1-10 రంధ్రాలు, చిన్న పుల్లలు), Alphabet Tracing board, Shape Sorter లాంటి సులువైనవి మొదలుపెట్టండి.
- అంచులు అన్నీ నునుపుగా రుద్దాలి, చిన్న ముక్కలుగా విడిపోకూడదు, రంగుకి Fevicryl Non-Toxic Colors వాడాలి, varnish బదులు Beeswax లేదా coconut oil వాడితే మంచిది.
- ప్రతి బొమ్మ మీద “Child Safe”, “Non-Toxic” అని రాయండి, తల్లులకు నమ్మకం కుదురుతుంది.
మీ ఊర్లో, దగ్గర పట్నంలో LKG, UKG బడులకి వెళ్ళి శాంపిల్ చూపిస్తే ఒక్కో బడి పది సెట్లు కొన్నా చాలు, పిల్లల పుస్తకాల సంతలో stall పెట్టినా బాగుంటుంది. ఈ ఐడియా గురించి నేను పూర్తిగా, ప్రతి tool తో సహా Wooden Educational Toys Business Telugu లో వివరంగా రాశాను, తప్పకుండా చదవండి.
Preschool teachers తో మంచి సంబంధం పెట్టుకోవడం ఇక్కడ కీలకం — వాళ్ళు నచ్చిన toy ని క్లాస్‌రూమ్‌లో వాడితే, తల్లులు దాన్నే వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తారు. Packaging కూడా simple గా, cloth bag లో పెట్టి ఇస్తే “eco-friendly toy” అనే feel మరింత బలపడుతుంది. ధరల విషయంలో entry-level toy ₹150-200 దగ్గర పెట్టి, పెద్ద combo sets ₹600-900 దాకా pricing చేస్తే, అన్ని బడ్జెట్ల తల్లిదండ్రులకి ఏదో ఒకటి అందుబాటులో ఉంటుంది.
8. కథ చెప్పే బుక్‌మార్క్‌లు – Handmade Bookmark Brand | Handmade Business Ideas In Telugu
పుస్తకాలు చదివే అలవాటు మళ్ళీ వస్తోంది, కానీ పేజీ గుర్తు పెట్టుకోవడానికి కాగితం ముక్కలు పెడుతున్నారు. అందంగా చేత్తో చేసిన Bookmark ఇస్తే, అది కేవలం పేజీ మార్కర్ కాదు, ఒక feeling. “పుస్తకం చదివాక ఈ bookmark నాకు తిరిగి ఇవ్వు” అని రాస్తే అది ఒక కథ అవుతుంది, ప్రేమికులు, స్నేహితులు దీన్ని బహుమతిగా ఇస్తారు.
గట్టి అట్ట, రంగు కాగితాలు, ఎండిన పూలు (పైన చెప్పిన Dried Flower Craft టెక్నిక్ ఇక్కడ కూడా వాడొచ్చు), కవితలు రాసిన చిన్న కాగితాలు, దారం పూస, lamination sheet — ఇవి చాలు. ఒక్కో bookmark కి అయ్యే ఖర్చు ₹5-8, అమ్మే ధర ₹35-99. Customer ఫోటో చిన్నగా print తీసి అతికిస్తే Personalized Gift అవుతుంది, ధర ఇంకా పెరుగుతుంది. పండుగలకి తగ్గట్టు theme మార్చొచ్చు — సంక్రాంతికి గాలిపటం బొమ్మ, ఉగాదికి మామిడి ఆకు.
“Bookmark” అని కాకుండా ఒక పేరు పెట్టండి, ప్రతి bookmark కి చిన్న కథ రాయండి, జనాలు కథకి connect అవుతారు. పుస్తకాల షాపుల్లో cash counter దగ్గర పెడితే, కాలేజీ fests లో stall పెడితే బాగా అమ్ముడవుతాయి. కంపెనీలు diary, pen తో పాటు bookmark కూడా gift గా ఇస్తాయి కాబట్టి corporate orders కూడా వెతకొచ్చు.
మీకు ఇంకో ఐడియా కావాలంటే, నెలవారీ “Bookmark Box” అని పెట్టి, ప్రతి నెలా కొత్త డిజైన్‌తో ఒక bookmark subscription మొదలుపెట్టొచ్చు — చదివేవాళ్ళకి ఇది ఒక చిన్న surprise లా అనిపిస్తుంది, మీకు స్థిరమైన ఆదాయం వస్తుంది. Reading clubs, book cafes తో టై-అప్ చేసుకుంటే వాళ్ళు కొనిన ప్రతి పుస్తకంతో పాటు మీ bookmark ఇస్తారు, అది మీకు ఉచిత ప్రచారం.
9. పాత బట్టలకు కొత్త రూపం ఇచ్చే వ్యాపారం | Upcycled Fabric Products | Low Investment Business Ideas In Telugu
మీ ఇంట్లో పాత చీరలు, జీన్స్, చిరిగిన దుప్పట్లు ఉన్నాయి కదా. వాటిని పడేయకుండా Sling Bags, Pouches, Cushion Covers, Scrunchies చేస్తే? “Sustainable Fashion” అంటే ఇష్టపడే జనాలకి పాత వస్తువుని కొత్తగా వాడటం గొప్ప అనుకుంటారు. పాత పట్టు చీరతో చేసిన sling bag కి ఒక కథ ఉంటుంది కాబట్టి మంచి రేటు వస్తుంది — “మా అమ్మమ్మ చీర ఇది” అని చెప్పిన వెంటనే దానికి విలువ పెరుగుతుంది.
మొదట మీ ఇంట్లో, చుట్టాలింట్లో ఉన్న పాత బట్టలు సేకరించండి, అందరూ ఉచితంగానే ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి అవి బరువు. “మీ చీర – మా డిజైన్” అని Customer దగ్గర పాత చీర తీసుకొని వాళ్ళకి నచ్చిన bag కుట్టి ఇస్తే కుట్టు కూలి మాత్రమే తీసుకోవాలి, బట్ట ఖర్చు ఉండదు. చీరలు అమ్మే boutiques తో tie-up చేస్తే, చీర కొన్న వాళ్ళు matching bag కూడా కొంటారు, నగరంలో జరిగే Sunday flea markets లో stall పెడితే ఒక్క రోజులోనే ఇరవై అమ్ముడవుతాయి.
జీన్స్ ముక్కలతో మొబైల్ పౌచ్‌లు, పాత దుప్పట్ల ముక్కలతో patchwork cushion covers, చిన్న చిన్న గుడ్డ ముక్కలతో scrunchies, hairbands కూడా చేసి combo గా అమ్మొచ్చు — ఒక్కటి కొన్నవాడు మిగతావి కూడా కొనే అవకాశం ఎక్కువ. ఇలాంటి eco-friendly, upcycling ఆలోచనలు నచ్చితే పండ్ల తొక్కలతో cleaning products చేసే Bio Enzyme Cleaner Business కూడా ఒకసారి చూడండి, రెండూ ఒకే ఆలోచనా విధానంలో వచ్చేవి — చెత్తని సొమ్ముగా మార్చడం.
10. మొలకెత్తే కాగితం – Seed Paper Products | Trending Business Ideas In Telugu
Seed Paper అంటే వాడేసిన కాగితం ముద్దలో పువ్వుల విత్తనాలు, కూరగాయల విత్తనాలు కలిపి చేసిన కాగితం. దీన్ని నేలలో పాతిపెడితే మొక్క వస్తుంది. పెళ్ళి పత్రికలు, Visiting Cards దీంతో చేస్తే “చెత్త” కాదు, “మొక్క” అవుతుంది. Companies అన్నీ “Green Initiative” చెప్పుకోవాలి అనుకుంటున్నాయి, పెళ్ళి చేసుకునేవాళ్ళు కూడా “మా పెళ్ళి వల్ల చెట్లు పెరగాలి” అనుకుంటున్నారు కాబట్టి డిమాండ్ పెరుగుతోంది.
పాత News papers, పుస్తకాలు చించి నీళ్ళలో నానబెట్టి, mixer లో ముద్దగా చేసి, అందులో తులసి, టమాటా, బంతి, మిరప విత్తనాలు కలిపి, ఒక బట్టతో ఒత్తి ఎండలో ఆరబెడితే కాగితం రెడీ. ఇది నేర్చుకోవడానికి YouTube videos ఉన్నాయి, ఒక్క రోజు ప్రయత్నిస్తే వచ్చేస్తుంది.
| వస్తువు | ధర |
|---|---|
| పెళ్ళి పత్రికలు | ₹15 – ₹40 |
| Visiting Cards (100) | ₹800 – ₹1,500 |
| Gift Tags (50) | ₹250 |
| Notebooks | ₹80 – ₹150 |
| Calendars | ₹200 – ₹350 |
విత్తనాలతో చేసే వేరే ఆలోచన నచ్చితే, ఖాళీ భూముల్లో గాలికి వేయగలిగే Seed Ball Manufacturing Business కూడా చూడండి, ఇది కూడా విత్తనాలతోనే వచ్చే eco business. అలాగే ఇంట్లో వ్యర్థాలతోనే మొదలయ్యే Pet Waste Compost Business కూడా ఇదే కేటగిరీలోకి వస్తుంది.
Wedding Planners ని కలిసి శాంపిల్ చూపిస్తే ఒక్క పెళ్ళికి 500 కార్డుల ఆర్డర్ రావొచ్చు. Etsy లో “Plantable Paper” అని పెడితే బయటదేశాల వాళ్ళు కూడా కొంటారు. School projects కి teachers “పర్యావరణం” మీద ఇలాంటివి చేయమని చెప్తారు కాబట్టి అక్కడి నుండి కూడా customers వస్తారు.
కాగితం ఆరబెట్టేటప్పుడు నేరుగా బలమైన ఎండలో పెట్టకండి, నీడలో గాలి బాగా తగిలేలా ఆరబెడితే విత్తనాలు చెడిపోకుండా ఉంటాయి. మందం ఒకేలా ఉండేలా ఒత్తడం అలవాటు చేసుకుంటే, కార్డు print చేసేటప్పుడు సమస్య రాదు. IT కంపెనీలు, startups తమ CSR activities లో భాగంగా ఇలాంటి plantable diaries, notebooks bulk గా కొంటున్నాయి కాబట్టి, LinkedIn లో చిన్న companies HR లతో మాట్లాడితే మంచి ఆర్డర్లు రావొచ్చు.
11. పండుగ అలంకరణ సామాను – Handmade Festival Decor | Home Business Ideas For Women In Telugu
ప్రతి పండుగకి ఇల్లు అలంకరించుకోవడం మన అలవాటు, కానీ మార్కెట్‌లో దొరికేవి ఒక్కసారి వాడి పడేసే plastic వస్తువులు. వాటి బదులు చేత్తో చేసిన తోరణాలు, దీపాల స్టాండ్‌లు ఇస్తే? ఏకేసారి అన్నీ చేయక్కర్లేదు, ఏ పండుగ దగ్గర్లో ఉందో దానికి తగ్గట్టు తయారుచేయండి — సంక్రాంతికి జనపనార బొమ్మలు, ధాన్యం కంకులు, ఉగాదికి cloth తో చేసిన మామిడి ఆకుల దండలు (ఒక్కసారి కొంటే మూడేళ్ళు వాడొచ్చు అని చెప్పాలి), వినాయక చవితికి clay బొమ్మలు, దీపావళికి clay ప్రమిదలు, రంగు రంగుల కాగితం దీపాలు.
పండుగకి ఒక నెల ముందే తయారీ మొదలుపెట్టి, WhatsApp Business Status లో ఫోటోలు పెట్టండి. Apartment groups లో “Pre-Booking” అని పెడితే ఇరవై ఇళ్ళు కూడా పది వస్తువులు చొప్పున అడిగితే రెండొందల ఆర్డర్లు వస్తాయి. పేరంటాలు చేసే వాళ్ళకి చిన్న ప్రమిదలు, దండలు రిటర్న్ గిఫ్ట్‌గా చేసి ఇవ్వొచ్చు. మీ business ని Google Business Profile లో పెట్టి రివ్యూలు తెచ్చుకుంటే స్థానికంగా వెతికేవాళ్ళకి కనిపిస్తారు, ఈ digital marketing స్కిల్ మీద నేను రాసిన Google Reviews Management ఆర్టికల్ కూడా ఒకసారి చూడొచ్చు.
ఏడాది మొత్తానికి ఒక calendar వేసుకుంటే మీకు తయారీ ప్లానింగ్ సులువు అవుతుంది — జనవరిలో సంక్రాంతి సరుకు, మార్చిలో ఉగాది, ఆగస్టు-సెప్టెంబర్‌లో వినాయక చవితి, అక్టోబర్-నవంబర్‌లో దసరా-దీపావళి, డిసెంబర్‌లో క్రిస్మస్. ప్రతి సీజన్ అయిపోగానే మిగిలిన సరుకుని discount కి అమ్మేయకుండా, తర్వాత సంవత్సరం కోసం భద్రపరిస్తే ముడిసరుకు ఖర్చు తగ్గుతుంది.
12. మీ ఊరి పేరుతో T-Shirt బిజినెస్ (Print-on-Demand) | Village Name Merchandise | Unique Business Ideas In Telugu
మీ ఊరి పేరు మీద T-Shirt, Coffee Mug ఉంటే ఎలా ఉంటుంది? “I Love Bhimavaram” లాంటివి ఇప్పుడు బాగా trend లో ఉన్నాయి. దీనికి Design రావాల్సిన అవసరం కూడా లేదు — Print-on-Demand అనే పద్ధతిలో మీరు కేవలం Design చేస్తే, Company వాళ్ళే print వేసి, customer కి direct పంపిస్తారు, మీరు సరుకు కొనక్కర్లేదు, ఇంట్లో పెట్టుకోక్కర్లేదు.
మొదట Canva లో ఫ్రీగా Design చేయండి — మీ ఊరి పేరు, ఒక మంచి బొమ్మ, లేదా మీ యాసలో ఒక మాట (“Aithey Enti”, “Bhale Undi Ra” లాంటివి) రాయండి. తర్వాత Blinkstore లేదా Qikink లాంటి Indian websites లో ఫ్రీగా Account open చేసి Design upload చేయండి, ధర మీరే నిర్ణయిస్తారు. T-Shirt తయారీ ఖర్చు తీసేసి మిగిలేదంతా మీ లాభమే.
| Design ఆలోచన | ఎవరు కొంటారు |
|---|---|
| ఊరి పేరు + PIN Code | బయట రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు |
| యాస మాటలు | కాలేజీ కుర్రాళ్ళు |
| ఊరి ఫుడ్ స్పెషల్ | Food Lovers |
Design చేసేటప్పుడు simple గా ఉండాలి — ఎక్కువ colors, ఎక్కువ text పెడితే print అంత clean గా రాదు. మొదట మీ పేరుతో, మీ ఊరి పేరుతో ఒక T-shirt వేసుకుని మీరే వేసుకుని ఫోటో పెడితే, “నాకు కూడా కావాలి” అని మీ ఫ్రెండ్స్ అడుగుతారు, అక్కడి నుండి organic గా ఆర్డర్లు మొదలవుతాయి. మీ ఊరి WhatsApp group, college alumni group ల్లో లింక్ షేర్ చేస్తే ఆ కమ్యూనిటీ మొత్తం మీ customers అయ్యే అవకాశం ఉంది.
ఇలాంటి Laptop-and-Internet-only ఆలోచనలు, ముఖ్యంగా పల్లెటూరి యూత్ కోసం నేను AI Side Hustle in Village ఆర్టికల్‌లో ఇంకా వివరంగా రాశాను. అలాగే మీరు Content Creation వైపు కూడా వెళ్ళాలనుకుంటే Cinematic Village Podcast Setup చూడండి, ఇది కూడా ఒక్కడితోనే మొదలయ్యే వ్యాపారమే.
13. మన సంప్రదాయ కమ్మరి డిజైన్లను ప్రపంచానికి అమ్మడం | Traditional Iron Craft Blueprints | Unique Business Ideas In Telugu
మన ఊర్లో కమ్మరి కొలిమి దగ్గర నాగలి, గొడ్డలి, కత్తి చేయడం చూసే ఉంటారు. ఆ పని ఇప్పుడు తగ్గిపోతోంది, కానీ వాళ్ళకి తెలిసిన కొలతలు, డిజైన్లు చాలా విలువైనవి. వాటిని కాగితం మీద Blueprint లాగా గీసి PDF చేసి అమ్మితే? అమెరికా, యూరప్ దేశాల్లో “Blacksmithing” అంటే hobby గా నేర్చుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి మన నాగలి design, మన కత్తి shape తెలియదు.
మీ ఊర్లో వయసు మీద పడిన కమ్మరి తాతని కలిసి కొలతలు అడగండి, ఆయనకి రోజుకి కూలి ఇవ్వండి, ఆయన చెప్పింది వీడియో తీయండి. మీకు drawing రాకపోయినా IbisPaint X అనే Free App లో గీయొచ్చు, పొడవు-వెడల్పు-మందం అన్నీ రాయాలి. ఆ బొమ్మని Canva లో పెట్టి PDF గా చేసి Etsy లో “Indian Traditional Axe Blueprint” అని అమ్మండి, డౌన్‌లోడ్ అయిపోతుంది, మీరు పంపించక్కర్లేదు. వ్యవసాయ పనిముట్లు (నాగలి, గునపం), వంటగది వస్తువులు (రోకలి బండ, రుబ్బురోలు), పాత తాళం డిజైన్లు — ఇలా చాలా రకాలు చేయొచ్చు.
ఇలాంటి Zero-Investment tech-based ఆలోచనలు నచ్చితే, కాలేజీల్లో ఉన్న DTFC సెంటర్ల ద్వారా మొదలుపెట్టే Tech Consulting Agency కూడా చూడండి, ఇది కూడా ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా మొదలయ్యేదే.
14. చేత్తో చెక్కిన Rubber Stamps | Handmade Rubber Stamp | Unique Business Ideas In Telugu
ఆఫీసులో, పెళ్ళి పత్రికల మీద వేసే Rubber Stamps పెద్ద machines లో చేస్తారు, కానీ ఇంట్లో చేత్తో చేసే Stamps కి ఇప్పుడు డిమాండ్ వస్తోంది. Carving Rubber Sheet, Carving Tools, Ink Pad కలిపి ₹2,000-5,000 లోపే మొదలుపెట్టొచ్చు.
కాగితం మీద Design గీసి, Rubber Sheet మీద గీతల మీద గీరి, Carving Tool తో చుట్టూ ఉన్న rubber తీసేస్తే Design పైకి లేస్తుంది, దాన్ని చెక్క దిమ్మకి అతికిస్తే Stamp రెడీ. పెళ్ళి కార్డులు డిజైన్ చేసేవాళ్ళు పేర్లతో Custom Stamp అడుగుతారు, Small Business Owners తమ లోగోతో చేయించుకుంటారు, Teachers “Good Work” stamps పిల్లల పుస్తకాల మీద వేయడానికి కొంటారు, Mehndi Artists తమ పేరు-నంబర్‌తో stamp చేయించుకుంటారు.
మీ చదువు, స్కిల్ ప్రకారం క్రాఫ్ట్ వ్యాపారానికి బదులు వేరే దారి చూడాలనుకుంటే, resume, job applications మీద పనిచేసే AI Resume Optimization Service లేదా విద్యార్థులకి సాయపడే Scholarship Application Assistance లాంటివి కూడా ఒకసారి చూడండి, ఇవి కూడా ఇంట్లో కూర్చునే చేసేవే.
చివరిగా ఒక మాట చెప్పాలని ఉంది!
ఇక్కడ చెప్పిన పద్నాలుగు ఐడియాల్లో ఏదొక్కటి మీ ఇంటికి, మీ చేతిలో ఉన్న టైమ్‌కి, మీ ఊర్లో దొరికే సామలకి ఖచ్చితంగా సరిపోతుంది. పెద్ద పెట్టుబడి పెట్టి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ₹500 తో మొదలుపెట్టి నెమ్మదిగా పెంచుకుంటే చాలు. ఆర్డర్లు ఎక్కువైతే n8n WhatsApp AI Agent పెట్టుకుని customer messages కి ఆటోమేటిక్‌గా రిప్లై ఇవ్వొచ్చు, వ్యాపారం పెద్దగా ఎదిగాక MSME loan తీసుకుని scale చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ వ్యాపారం వైపు మొగ్గు చూపేవాళ్ళు Roadside Laundry Business లాంటి ఐడియాలు కూడా చూడొచ్చు.
నేను ఎలా మొదలుపెట్టానో, ఇలాంటివి రాయడానికి కారణం ఏంటో తెలుసుకోవాలంటే నా Biography పేజీ ఒకసారి చదవండి. ఏ ఐడియా మొదలుపెడుతున్నారో కామెంట్‌లో చెప్పండి, తర్వాత భాగంలో దాని మీద పూర్తి గైడ్ రాస్తా.