Vedas In Telugu | Can Dalit Read VEDAS? ఈ ప్రపంచంలో జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికీ సమానంగా లభించాల్సిన ఒక మూల హక్కు. మనిషి పుట్టుక పుట్టిన ప్రతి ఒక్కరికి జ్ఞానం మీద పూర్తి హక్కు ఉండాలి. కానీ మన చరిత్రలో కొన్ని వర్గాలపై, ముఖ్యంగా దళితులపై, ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని పొందే అవకాశాల విషయంలో అన్యాయం జరిగింది అని కొన్ని మత మార్పిడి ముఠాలు ప్రచారం చేశాయి, చేస్తున్నాయి, చేస్తూనే ఉంటాయి. వేదాలు చదవడం వంటి గొప్ప జ్ఞాన మార్గానికి దళితులను దూరం పెట్టే ప్రయత్నాలు, ఆచారాలు భారత దేశ చరిత్రలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు (బ్రిటిష్ కుక్కలు, వారి మాత మార్పిడి ముఠాలు వచ్చేవరకు). ఈ వివక్ష ఎందుకు? ఎవరు పెట్టారు?

దీనికి సమాధానం: కేవలం మనం మతం మారటానికి మాత్రమే! వేదాలలో వాస్తవంగా అలాంటి నిషేధం ఉందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం వేదాలను పరిశీలించాలి, చరిత్రను తిరగవేయాలి.
ఈ ప్రశ్న సూటిగా ఉన్నప్పటికీ, దాని వెనుక దాగిన భావాలు చాలా లోతైనవి. ఇది కేవలం వేదాలు చదవవచ్చా లేదా అనే విషయం కాదు; ఇది సమానత్వంపై, మానవ హక్కులపై, ధర్మంపై ప్రశ్న. వేదాలు అంటే ఏమిటి? అవి ఎవరికీ? దళితులు చదవడాన్ని ఎందుకు విమర్శించారో తెలియక పోతే, మనం నిజమైన ధర్మాన్ని గ్రహించలేము. మనం ఈ Article లో ఒక గొప్ప ప్రశ్నను సరదాగా, సరళమైన భాషలో, హృదయాన్ని తాకే విధంగా విశ్లేషించుకుందాం: “దళితులు వేదాలు చదవచ్చా?”
ఈ article ద్వారా మనం వేదాల అసలు ఉద్దేశం, వర్ణ వ్యవస్థ తత్త్వం, అంబేడ్కర్ గారి దృక్పథం, రాజ్యాంగ హక్కులు, ప్రస్తుతం జరుగుతున్న మార్పులు, వేదాల ఆధ్యాత్మిక సందేశం, అసలు దొంగలు ఎవరో కుడా తీసుకుందాం. దళితులు వేదాలు చదవడం కేవలం ఒక చర్య కాదు – అది ఒక ఆత్మగౌరవ ఉద్యమం, ఒక నిశ్చయబద్ధమైన నైతిక ప్రకటన. మనం ఈ Article చివరకు వెళ్లేలోపు, మన హృదయాలు మనమే ప్రశ్నించుకుంటాం – సమాజంగా మనం నిజంగా సమానత్వాన్ని అభ్యసిస్తున్నామా లేదా అని.

Vedas in Telugu! Can Dalit Read Vedas? వేదాల అసలైన ఉద్దేశం ఏంటీ?
వేదాల అసలు తత్త్వం ఏమిటి? వేదాలు అంటే పూజలు, మంత్రాలు మాత్రమే కాదు. అవి జీవితానికి మార్గదర్శకాలు అని వేదాలలోని ఒక శ్లోకం చెబుతుంది::
“ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయ చ”
అంటే – మనం మన ఆత్మకి విముక్తి కోసం, ప్రపంచానికి మంచికోసం జీవించాలి. ఇది ఏ ఒక్క వర్గానికో, కులానికో మాత్రమే వర్తించదు. ఇది సమస్త మానవాళికి వర్తిస్తుంది. వేదాలు ఏ భాషలో రాయబడ్డాయో, ఎవరు అవి చెప్పారో కాదు, ఆ జ్ఞానాన్ని ఎవరు అర్థం చేసుకొని జీవన విధానంగా మార్చుకుంటారన్నదే ముఖ్యం. కాబట్టి, ఎవరు కావాలన్నా వేదాలు చదవవచ్చు. దళితులు కూడా చదవచ్చు. మనల్ని పక్క దారి పట్టించి, మనం వేదసారం తెలుసుకోకుండా చేసింది ఎవరో గుర్తు చేసుకోండి ఒకసారి? ఎవేరికి ఆ అవసరం ఎక్కువగా ఉండిఉండచ్చు?
సరే! Point కి వచ్చేదాం! normal తెలుగులో మాట్లాడుకుందామా?
మనం అందరం భారతమాత ముద్దు బిడ్డలం. అన్న చెల్లెళ్ళం, అక్క తమ్ముళ్ళం. మన వృత్తి ని బట్టి మన కులాలు ఏర్పడ్డాయి, కులాన్ని బట్టి వృత్తి ఏర్పడలేదు!
“మళ్ళీ చెపుతున్నా! వృత్తి ని బట్టి మన కులాలు ఏర్పడ్డాయి, కులాన్ని బట్టి వృత్తి ఏర్పడలేదు!“
దానిని మనకి reverse లో చెప్పారు, మనం కుడా reverse లోనే అర్ధం చేసుకుని గొర్రెల్లా తలాడించాము! దీని వల్ల ఎవరికీ ఉపయోగం? సరిగ్గా ఆలోచించండి?
ఇంకా simple గా చెప్పుకుంటే! మనం ఒక కుటుంభం కదా… మన మధ్య ఆస్తి గొడవలు రాలేదు, పదవుల కోసం గొడవలు లేవు, డబ్బు కోసం కొట్టుకోలేదు, చదువు, ఆరోగ్యం,పిల్లలు,బంగారం,పొలం, స్థలం, etc etc etc దేనికోసం గొడవలు రాలేదుగా?
కనీసం వేదాలు చదవటం కోసం ఐనా గొడవ వచ్చిందా? అసలు గొడవేలే లేని మన కుటుంబంలోకి కొత్త మతాల వాళ్ళు వచ్చి, కొత్త కొత్త దేవుళ్లను పరిచయం చేసి, మన కుటుంబాన్ని నాశనం చేసారు!
అవునా? కాదా? నువ్వే ఆలోచించు. “అసలు మనం దళితులము అని మనకి ఎవరు చెప్పారో ఐనా తెలుసా? 100% తెలియదు.“

Focus Keyword
వర్ణ వ్యవస్థ – జన్మ కాదు, గుణమే ప్రధానమైనది!
పాతకాలంలో వర్ణవ్యవస్థ అనేది మనలోని గుణాలు (SKILLS), కర్మలు ఆధారంగా ఉండేది.
“చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః”
ఇది చాలా స్పష్టంగా చెబుతోంది – వర్ణాలు మన కర్మల ఆధారంగా నిర్ణయించబడాలి. కాబట్టి ఒక వ్యక్తి బ్రాహ్మణుడిగా పిలవబడాలంటే, అతను జ్ఞానాన్ని పంచడం, ధర్మాన్ని అనుసరించడం, శాంతిని కోరడం వంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఈ లక్షణాలు దళితుల్లో ఉండకపోతాయా? ఇవి సామర్థ్యం మీద ఆధారపడినవి, జన్మ మీద కాదు. Simple గా మన భాషలో చెప్పాలంటే నువ్వు ఎవరికి పుట్టావు? ఎక్కడ పుట్టావు? ఎలా పుట్టావు అనేది important కాదు, ఎందుకు పుట్టావు, ఎం చేస్తున్నావు, ధర్మం గా బ్రతుకుతున్నావా లేదా అనేదీ important .
వేదాలలో నిజంగా నిషేధముందా?
ఇక్కడ మనం సూటిగా మాట్లాడాలి. వేదాలలో ఎక్కడా ‘దళితులు చదవకూడదు’ అని లేదు. అసలు “దళితులు” అనే పదం కుడా ఎక్కడ లేదు. ఈ ఆంక్షలు మనుషులే పెట్టారు. మనలో మనం కొట్టుకుని చావటానికి, మనల్ని పాలించిన బ్రిటిష్ కుక్కలు మరియు కొన్ని మాత మార్పిడి దొంగలు కలిసి మనల్ని గొర్రెలుగా చేసి ఆదుకున్నారు. వేదాలు దైవవాణి. వేదాలు సమానత్వాన్ని మాత్రమే ప్రేరేపించాయి. వేదాలను అందరికీ ప్రవేశపెట్టే ఉద్దేశ్యంతో రచించబడిన వాక్యాలు అనేకం ఉన్నాయి. కాబట్టి, ఈ నిషేధం ఒక సామాజిక పథకం, ఆధ్యాత్మిక నియమం కాదు.
భారత రాజ్యాంగం – విద్య మీద (Including వేద విద్య) ప్రతి ఒక్కరికి హక్కు
“Article 15 of the Indian Constitution prohibits discrimination on grounds of religion, race, caste, sex, or place of birth, ensuring equality for all citizens. Article 17 abolishes untouchability and its practice, prohibiting any disability arising from it and making its enforcement an offense punishable by law”
పైన ఉన్న చట్టాలు మనం వేదాలు చదువుకోవడాన్ని గాని, ఆధ్యాత్మికతను పెంపొందించుకోవటానికి గాని ఉన్న హక్కులపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని చెబుతున్నాయి. కాబట్టి దళితులు వేదాలు చదవకూడదు అనే ఆలోచన రాజ్యాంగాన్ని అవమానించడం వంటిది. ఒక అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్యంలో, జ్ఞానం అందరికీ సమానంగా లభించాలి.
మన ఎవరికీ తెలియని కొన్ని వాస్తవాలు
కొన్ని వేద పాఠశాలలు దళితుల కోసం నిర్మించబడుతున్నాయి,
ఉదాహరణకి:
తంజావూరులోని వేద పాఠశాలలు
కేరళలోని వేద పాఠశాలలు
ఎలాంటి 20+ విధ్యాసంస్థలలో 80% పైగా దళిత విద్యార్థులు ఆనందంగా చదువుకుంటున్నారు. కులాన్ని పక్కన పెట్టి విధ్యకి ప్రాముఖ్యతనిస్తున్నాయి. వీరు మార్పు చిహ్నాలు. అలాగే, సోషల్ మీడియా, ఆన్‌లైన్ వేదికల ద్వారా వేద విజ్ఞానం అందరికీ చేరుతోంది. ఇది చరిత్రలో ఒక గొప్ప మలుపు.
ఆధ్యాత్మికత – ఆత్మకి కులం లేదు (ఋగ్వేదం చెబుతుంది)
“ఏకం సత్, విప్రా బహుధా వదంతి”
అంటే – “సత్యం ఒక్కటే, దాన్ని వివిధ మార్గాల్లో చెప్పొచ్చు. సత్యాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతిఒక్కరికి వేదాలు అందుబాటులో ఉన్నాయి.”
మన ఆత్మలో శుద్ధి ఉంటే చాలు, శరీరం ఏ కులానికి చెందిందో సంబంధం లేదు. ఆధ్యాత్మికత అనేది మన లోపలి ఆత్మను పరిశీలించడమే కాని, శరీరానికి లేదా సమాజ సృష్టించిన గుర్తింపులకు సంబంధించినది కాదు. ఇది మన హృదయంలో ఉదయించే ప్రశాంతతకి, ఆలోచనల స్వేచ్ఛకి సంబంధించినది.
గౌరవం తిరిగి పొందే మార్గం – మీ ఇంటికి మీరు రండి!
వేదాలను చదవడం అంటే కేవలం మంత్రాల పఠనం మాత్రమే కాదు… మన ఇంటికి తిరిగి రావటం! మన అమ్మ గోరుముద్ద రుచి చూడటం! మన ధర్మాన్ని మనం సవ్యంగా నిర్వర్తించడం! కులాల పేరుతొ విడిపోయిన మనం అన్నదమ్ములమైన మళ్ళీ కలవటం!
ఇదివరకుటి రోజులు పోయాయి, నీకు డౌట్ గా ఉంటే! ఏ మతం ముందు పుట్టింది? ఏ ధర్మం గొప్పది? ఇలాంటి Questions Google ని అడిగితే, నాకన్నా బాగా చెపుతుంది. AI ని అడిగితే చరిత్ర మొత్తం బట్టలు లేకుండా నీ ముందు నుంచుంటుంది. ఇంకెందుకు లేటు? మొదలెట్టు!
Single లైన్ లో —వేదాలు మనకు ఇస్తున్న సందేశం?
ఋగ్వేదంలో ఈ శ్లోకం ఉంది:
“సంగచ్ఛధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం”
అంటే – “మనం అందరం కలసి నడవాలి, కలసి మాట్లాడాలి, కలసి ఆలోచించాలి. ఇది సమానత్వానికి శబ్దంగా నిలుస్తుంది………!” వేదాలు ప్రజల మధ్య భేదాలు తొలగించడానికి మాత్రమే ఉన్నాయి.
CLIMAX– వేదాలు అందరికి కావాలి
ఈ రోజు మనం మార్పు కోసం గళం విప్పాలి. వేదాలు మనం అందరమూ చదవాలి, అర్థం చేసుకోవాలి. ఇది మన పూర్వీకుల జ్ఞానం. ఇది దళితులకు కూడా చెందినది. కాబట్టి, దళితులు వేదాలు చదవవచ్చు అనే ప్రశ్నకు సమాధానం చాలా స్పష్టంగా ఉంది – అవును. అది వేద బద్ధంగా, ధర్మబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, మానవబద్ధంగా సరైనదే.
ఎక్కడినుంచో ఎవడో వచ్చి చేసిన పంచాయితీలు చాలురా బాబు! వేదాలు మన అందరివీ, మన వేదాలు మనం చదువుకుందాం! అందరం ఒకటిగా ఉందాం! CM YOGI ADITYANAD & PM MODI JI చెప్పినట్టు Batenge to Katenge’ & EK hey to safe hey
చివరిగా ఒక్క మాట చెప్పాలని ఉంది. మనల్ని ఇదివరకు పాలించిన British కుక్కలు లేవు, అప్పటి పాత ప్రభుత్వాలు లేవు, మళ్ళీ రావు. కొత్తగా వేరే మాతాలు పుట్టవు, ఒక వేల పుట్టినా? వాళ్ళు మళ్ళీ మన భారత దేశం వైపు చూడను కుడా చూడరు! ఉన్న హిందూ వ్యతిరేక దరిద్రులకు Future లేదు. నువ్వే బాగా ఆలోచించు… మన ఇంటికి తిరిగి వచ్చెయ్యి!
ఇట్లు,
నీ చెల్లి, మీ పక్కింటి అమ్మాయి, నీ మంచి కోరుకునే ఒక శ్రేయోభిలాషి!
1 thought on “వేదాలు గురించి తెలుగులో తెలుసుకుందాం! దళితులు వేదాలు చదవచ్చా?”