మీ ఆయన SMOKE చేస్తారా ? మీ పిల్లలు? చుట్టుపక్కల వాళ్ళు? అసలు మీరు ఎక్కడుంటున్నారు ?

By Info Pinky

Updated On:

Lung Detox | Ayurvedic medicine for smokers |

Join WhatsApp

Join Now

మీ ఆయన SMOKE చేస్తారా ? మీ పిల్లలు? చుట్టుపక్కల వాళ్ళు? అసలు మీరు ఎక్కడుంటున్నారు ? Lung Detox Kadha | దగ్గుకు తక్షణ ఉపశమనం | Lungs detox home remedy | How to clean lungs naturally |

మనందరికీ ఈ క్రింద ఉన్న సమస్యలు జీవితంలో ఎప్పుడోకప్పుడు ఎదురవ్వక తప్పదు. అది మనమే కావచ్చు లేదా మనకి బాగా కావలసినవాళ్లు కుడా అయ్యిఉండవచ్చు.  

అవి కాలుష్యం/ప్రోగ తాగటం/ ప్రోగ తాగేవారితో ఉండటం/అపరిశుభ్ర ప్రదేశాలు, Factories దగ్గరలో నివశించడం/Daily traffic లో ఎక్కువసేపు Drive చెయ్యటం etc etc etc.  – బయట దుమ్ము, ధూళి (pollution), Cigarette పొగ/ వాహనాల పొగలతో నిండిన గాలిని పీల్చిన తర్వాత, ఇంటికి తిరిగి వచ్చాక గొంతులో ఎదో తెలియని బరువుగా/గరగర/దగ్గు వస్తుందో రాదో అన్నట్టు ఉంటుంది కదా?  శ్వాస తీసుకోవడంలో కష్టం, ఛాతీ మీద ఒత్తిడి. ఇది కేవలం ఒక్కరికే కాదు, Cities లో నివసించే ప్రతి Familyకీ రోజువారీ అనుభవం. ఎందుకు? ఎందుకంటే మన ఊపిరితిత్తులు (lungs) ప్రతిరోజు PM2.5 (సూక్ష్మ ధూళి కణాలు), కార్బన్ మోనాక్సైడ్ (CO), ఫ్యాక్టరీల నుంచి వచ్చే విషపదార్థాలు వంటి వాటితో యుద్ధం చేస్తున్నాయి. అవికాదన్నట్టు మన ఇళ్లలో ఎవరోఒకరు లేదా మనమే or మన చుట్టుపక్కన ఉండేవాళ్ళలో ఎవరోఒకరు SMOKE చెయ్యటం! ఏదోఒక రకంగా మన ఊపిరితిత్తులు (LUNGS) Effect అవుతూనే ఉంటాయి. 

ఊపిరితిత్తులు మన శరీరంలోని అద్భుతమైన ఫిల్టర్లు (Filters). మనం ఊపిరి పీల్చిన ప్రతిసారి చాల చెత్త చెదారం మరియు కొన్ని కోట్ల సూక్ష్మ కణాలు ముక్కు/నోటి ద్వారా మన శరీరంలోకి వచ్చేస్తాయి. వాటన్నిటిని తన్ని తరమతానికి మనదగ్గర 2 ఊపిరితిత్తులు మాత్రమే ఉన్నాయి,  కానీ, ఇప్పుడున్న ప్రపంచంలో రోడ్లమీద కాలుష్యం తప్ప ఇంకేమిలేదుగా! ఈ ఫిల్టర్లు కాలక్రమేణా మలినాలతో నిండిపోతాయి. ఫలితంగా, దగ్గు, శ్వాసకోశ సమస్యలు (respiratory issues), అలర్జీలు, immunity (రోగనిరోధక శక్తి) తగ్గడం వంటి సమస్యలు మొదలవుతాయి. చిన్నపిల్లలు దీనికి ముందే effect అవ్వుతారు, traffic లో తిరిగే లేదా SMOKE చేసే మన ఇంట్లోవాళ్ళు effect అవుతారు! అప్పుడే మనం … నిమ్ము తగ్గాలంటే ఏం చేయాలి?How to clean lungs naturally, Lung Repair, ఊపిరితిత్తుల పునరుద్ధరణ, దగ్గుకు తక్షణ ఉపశమనం (instant Relief for Cough), Ayurvedic remedy for lungs detox, Ayurvedic medicine for smokers, ఊపిరితిత్తులు క్లీన్ అవ్వాలంటే ఏం చేయాలి? etc etc etc” ఇలాంటివి Google లో సెర్చ్ చేస్తాము. అవునా? కాదా?

🌿 నిమ్ము తగ్గాలంటే ఏం చేయాలి? Ayurveda role in Lung Detoxication?

ఆధునిక వైద్యంలో ఉపిరితిత్తులని శుభ్రం చెయ్యటం (lungs detoxification) కోసం అనేక మందులు, ఇన్హేలర్లు ఉన్నాయి. కానీ, ఆయుర్వేదం మనకు ఒక సహజమైన, దీర్ఘకాలిక పరిష్కారాన్ని అందిస్తుంది. ప్రాచీన కాలం నుండి, కషాయాలు (herbal decoction) శరీరంలోని విషపదార్థాలను తొలగించడానికి ఉపయోగించబడ్డాయి. ఈ కషాయం నిజంగా పనిచేస్తుందా? 100 కి 200% పనిచేస్తుంది. పనిచేయకపోతే? About section లో ఇచ్చిన email ID కి మెయిల్ చెయ్యండి or direct గా కింద కామెంట్ చెయ్యండి నేనే డైరెక్టుగా response ఇస్తాను. అనే ప్రశ్నకు సమాధానం, అవును! ఎందుకంటే…?

  • ఇది శ్లేష్మాన్ని విచ్ఛిన్నం చేస్తుంది (mucolytic action).
  • శ్వాసనాళాలను విశాలం చేస్తుంది (bronchodilation).
  • ఆక్సీకరణ ఒత్తిడిని (oxidative stress) తగ్గిస్తుంది.
  • రోగనిరోధక శక్తిని (immunity) పెంచుతుంది.

🤔 ఈ కషాయం (Ayurvedic Decoction) ఎవరికి అవసరం? Who Can use Lung Detox Herbal Decoction?

ఈ కషాయం కేవలం ఒక ” home remedy” మాత్రమే కాదు, ఇది ఒక preventive healthcare సాధనం. ముఖ్యంగా ఈ Immunity Booster ఈ క్రింది వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది.


పట్టణాల్లో/ ధూమపానం

  • పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు: ప్రతిరోజు ట్రాఫిక్, SMOKE కి గురవుతున్నవారు.
  • ధూమపానం చేసేవారు (smokers): సిగరెట్లలోని టార్ (tar) ఊపిరితిత్తులకు హాని చేస్తుంది.
  • Smoke చేసేవారితో ఉన్నవారు కుడా బాగా effect అవుతారు.

పిల్లలు/వృద్దులు

  • సీజనల్ Flu, వైరల్ జ్వరాల తర్వాత: శరీరం బలహీనపడిన సమయంలో మరియు eosinophilia/ఉబ్బసం లాంటివి ఉన్నవాళ్లకు.
  • పిల్లలు: స్కూల్ బస్సులలో ప్రయాణించే పిల్లలు ఎక్కువ కాలుష్యానికి గురవుతారు.
  • వృద్ధులు, ఆస్తమా (asthma) రోగులు: ఇతరేతర శ్వాసకోశ సమస్యలు వాళ్ళకి.

దీనిని మీరు ఎలా ఐనా పిలవచ్చ! ఎందుకంటే ఇది చేసే పని కేవలం మన ఊపిరితిత్తుల మీద మాత్రమే కాదు!

🌿 ఊపిరితిత్తుల శుద్ధి కషాయం (Lung Detox Herbal Decoction): తయారీ విధానం & శాస్త్రీయ వివరణ

ఇక్కడవరకు చదివారు! ఇయితే interesting గానే రాస్తున్నాను అనుకుంట! సరే  ఇప్పటివరకు మనం ఎందుకు ఈ కషాయం అవసరం, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అనే అంశాలను చర్చించాము. ఇప్పుడు మనం ఈ  కషాయాన్ని ఇంట్లో ఎలా సులభంగా తయారు చేసుకోవచ్చు, ఇందులోని ప్రతి పదార్థం ఎలా పనిచేస్తుంది, మరియు దీన్ని ఎప్పుడు? ఎవరు? ఎలా వాడాలి? అనే వివరాలను గురించి తెలుసుకుందాం.

ఆయుర్వేద కషాయం

🍵 కషాయం (Lung Detox Herbal Decoction) తయారీ విధానం: వివరంగా

ముందుగా, ఈ కషాయాన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు మనకు సులభంగా ఇంట్లోనే లభిస్తాయి. ఇప్పట్లో అందరి ఇళ్లలో ఉండటం లేదు, ఒకవేళ ఉన్నా? దాని ఇంగ్లీష్ పేరు అడుగుతున్నారు. అందుకే Telugu /English mix చేసి నేను ఈ article రాస్తున్నానండీ!

🔬 Lung Detox Herbal Decoction: ఈ Immunity Booster కషాయంలోని పదార్థాలు ఎలా పనిచేస్తాయి?

ఒకటి గుర్తుపెట్టుకోవాలి! మనం ఒక రోగానికి మందు వేస్తున్నాం అంటే? అసలు దాని కర్త, కర్మ, క్రియ, ముందుగా తెలుసుకోవాలి. గొర్రెల్లా Medical shop వాడు ఇచ్చిన ప్రతీది మింగటం తప్ప, అసలు దాని వెనకాల ఏముందో కూడా 99% జనాలకి తెలియదు! కానీ మన ఆయుర్వేదం అలాకాదు సుమా! ముందుగా ఏది ఎలా , ఎందుకు,ఎప్పుడు పనిచేస్తుందో తెలుసుకున్నాకే వాడమని చెపుతుంది. ఆలా తెలుసుకోవటం వాళ్ళ మనకు తెలియకుండానే మనలో ఎదో తెలియని నమ్మకం వస్తుంది. (Tune Your Brain First 🧠ఇది ఇందుకు పని చేస్తుందన్నమాట! ఇది వేసుకున్నానా? ఇలా పనిచేస్తుందా? ఇప్పుడు కొంచెం బాగుందిలే! అని మనసుకి అనిపిస్తుంది. )

1. పసుపు (Turmeric) : పసుపులో కర్క్యుమిన్ (Curcumin) అనే సక్రియ పదార్థం ఉంటుంది. ఇది ఒక శక్తివంతమైన ఆంటీ-ఇన్ఫ్లమేటరీ (Anti-inflammatory) మరియు ఆంటీఆక్సిడెంట్ (Antioxidant) లక్షణాలని కలిగి ఉంటుంది. దెబ్బ తగిలినప్పుడు ఉన్న వాపును (Inflammation) తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అంతేకాదు, ఇది శరీరంలోని విషపదార్థాలను (Toxins) తొలగించడంలో కూడా ఉపయోగపడుతుంది. దీని గురించి ఒక Separate Article రాస్తానులెండి! అందులో అసలు పసుపు చరిత్ర మొత్తం మాట్లాడుకుందాం!

2. నల్ల మిరియాలు (Black Pepper): నల్ల మిరియాలలో పిపెరిన్ (Piperine) అనే పదార్థం ఉంటుంది. ఇది పసుపులోని కర్క్యుమిన్ శోషణను (Absorption) 20 రెట్లు పెంచుతుంది. అంటే, పసుపుతో నల్ల మిరియాలు కలిస్తే రచ్చ రచ్చ చేస్తాయి. మన Body లోని రక్తాన్ని  స్వచ్ఛ భారత్ (SWACHH BHARAT) చేస్తాయి. 

3. అల్లం (Ginger): అల్లంలో జింజరోల్ (Gingerol) అనే పదార్థం ఉంటుంది. ఇది ఒక నాచురల్ ఎక్స్పెక్టోరెంట్ (Natural Expectorant), అంటే ఇది శ్వాసనాళాలలోని శ్లేష్మాన్ని (Mucus) విచ్ఛిన్నం చేసి, దానిని బయటకు గెంటేస్తుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఉన్న ఇబ్బందిని బాగా తగ్గిస్తుంది. పైన చెప్పిన నల్ల మిరియాలూ, పసుపు, ఈ అల్లం కలిస్తే ఏంజరుగుతుంది? ఒకసారి మీరే అర్ధం చేసుకోండి! రచ్చ రంబోలా అవుతుంది!

4. నిమ్మరసం (Lemon Juice): నిమ్మపండు విటమిన్ సి (Vitamin C) తో నిండి ఉంటుంది, ఇది ఒక శక్తివంతమైన ఆంటీఆక్సిడెంట్ (Antioxidant). ఇది శరీరంలోని ఫ్రీ రేడికల్స్ (Free Radicals)ని తాట తీయడంలో సహాయపడుతుంది, ఇవి కాలుష్యం మరియు సిగరెట్ పొగ వల్ల ఏర్పడతాయి. అదనంగా, విటమిన్ సి కొల్లాజెన్ (Collagen) Synthesys చెయ్యటంలో  ఉపయోగపడుతుంది. ఇది ఊపిరితిత్తులలోని కణజాలాల (Tissues) పంచర్ పనులు బాగా చేస్తుంది. నిమ్మరసం కషాయానికి ఒక Natural పులుపును ఇస్తుంది,  కొంచెం taste కుడా బాగుంటుంది! ఇప్పటివరకు చెప్పిన నాలుగు కలిస్తే ఏం అవుతుంది? మనకి తెలియకుండానే మన body లో ఒక WORLD WAR 3 Start అయ్యిపోతుంది! 

5. తేనె (Honey)ఇంక మన Honey పాప! తేనెలో ఆంటీమైక్రోబయల్ (Antimicrobial) మరియు ఆంటీఇన్ఫ్లమేటరీ (Anti-inflammatory) గుణాలు ఉంటాయి. ఇది గొంతులో ఉన్న గర గర (Irritation) మరియు దగ్గును (Cough) శాంతింపజేస్తుంది. తేనెలో ఉన్న ఎంజైమ్లు (Enzymes) శరీరంలోని విషపదార్థాలను పిచ్చ కొట్టుడు కొట్టడంలో పైన చెప్పిన వాటికీ సహాయపడుతుంది. కానీ, గమనిక: 1 సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తేనె (Honey)ఇవ్వకూడదు.

6. తులసి ఆకులు (Basil Leaves)తులసమ్మ ని “ఎల్లి మందు” అని కూడా పిలుస్తారు. ఇది ఒక ఆడాప్టోజెన్ (Adaptogen), అంటే తులసమ్మ మన శరీరాన్ని ఒత్తిడి (Stress) మరియు వ్యాధుల నుండి రక్షిస్తుంది. తులసమ్మ లో యూజినాల్ (Eugenol) అనే పదార్థం ఉంటుంది, ఇది శ్వాసనాళాలను విశాలం (Bronchodilation) చేయడంలో సహాయపడుతుంది. ఇంకా చెప్పాలంటే! మన తులసమ్మ, మన ఇమ్యూనిటీని (Immunity) పైన చెప్పిన అన్నిటికన్నా తొందరగా పెంచుతుంది. Example : China వైరస్లతో (Viruses) పోరాడడంలో సహాయపడుతుంది. అందుకే మన పూర్వికులు అందరు ఇళ్లల్లో తులశమ్మని ఉంచుకుని, రోజు పూజలు చేసేవారు.

ఈ దగ్గు కాషాయం (Lung Detox Herbal Decoction) తయారు చేసే ప్రక్రియను తెలుసుకుందాం

STEP 1: ఒక చిన్న పాత్రలో ఒక కప్పు నీటిని తీసుకుని, బాగా మరిగించండి. నీరు మరిగే సమయంలో దానిలో పసుపు, నల్ల మిరియాలు, తరిగిన అల్లం వేసి, 5 నిమిషాలు మరిగించండి. ఈ సమయంలో, ఈ మూడు పదార్థాలు నీటిలో కరిగి, వాటి సారాన్ని విడుదల చేస్తాయి. కొంచెం బాగా మరగనివ్వండి! మంచి smell వచ్చేవరకు.

STEP 2: ఇప్పుడు ఆ మరిగిన దానిలో తులసి ఆకులు కుడా వేసి, మరో 2 నిమిషాలు మరిగించండి. తులసి ఆకులు వేసిన తర్వాత, ఆ గిన్నెలో నుంచి మంచి Smell వస్తుంది! దానినికూడా పీల్చి Enjoy చెయ్యండి, చాలామంచిది!

STEP 3: ఇప్పుడు ఆ మరిగిన కషాయాన్ని శుభ్రంగా ఉన్న చిక్కం తో వడకట్టండి. మొత్తాన్ని ఒక శుభ్రమైన steel లేదా గాజు గ్లాసులోకి తీసుకోండి. వడకట్టిన తర్వాత మిగిలిన పదార్దాన్ని కావాలంటే మీరు TEA time లో use చేసుకోవచ్చు. 

STEP 4: ఇప్పుడు ఆ ద్రవంలో నిమ్మరసం, తేనె కలపండి. నిమ్మరసం విటమిన్ సి (Vitamin C) తో నిండి ఉంటుంది, ఇది శరీరానికి ఆంటీఆక్సిడెంట్స్ ను (Antioxidants) అందిస్తుంది. తేనె గొంతును శాంతింపజేస్తుంది మరియు ఈ కషాయానికి ఒక సహజమైన తీపినిస్తుంది.

STEP 5: ఇప్పుడు ఈ కషాయం కొంచెం వేడి తగ్గేవరకూ ఆగండి, తర్వాత నెమ్మదిగా సిప్ చేస్తూ తాగండి. ఈ కషాయాన్ని తాగిన తర్వాత కనీసం 30 నిమిషాలు వరకు ఏమీ తినకండి, ఎందుకంటే ఈ సమయంలో కషాయంలోని పదార్థాలు శరీరంలో పూర్తిగా శోషించబడతాయి.

NOTE : Thyroid ఉన్నవాళ్లు ఒకసారి doctor ని అడిగి తెలుసుకోవటం మంచిది. ఎందుకంటే వాళ్ళు పరగడుపునే Tablet వేసుకుంటారుగా!

ఇంకా అవ్వలేదు చివరివరకు చదవండి. ఒక్కరోజు తాగేసి అయ్యిపోయింది అనుకోకండి సుమా! ఒక వారం రోజులు challenge గా తీసుకుని, మీరు మీ ఇంట్లో అందరు తాగి చూడండి. ఫలితం కనపడితే అంతేచాలు!

ఇది చదవకుండా వెళ్ళకండి!

ఒకసారి ఆగండి! ఇక్కడవరకు చదివారు అంటే.. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. కుదిరితే ఒక Comment చేసివెళ్ళండి! మీకు తెలిసినవాళ్లకు SMOKING చేసేవాళ్ళకు ఇది పంపించండి, మర్చిపోకండి. తెలిసిన Friends కీ WhatsApp groups లలో షేర్ చెయ్యండి.

చాలామంది నాకెందుకులే అనుకోవటంవల్లే మనదేశం ఇలా అయ్యింది . medical shops ఎక్కువ అయ్యాయి! చిన్నపిల్లలు, ఆడవాళ్లు ఉన్నారని తెలిసినా కుడా Public గా SMOKE చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటానికి తీరిక లేకుండా పరుగులుపెడుతున్నారు. మనలో ఒక్కరైనా ఒక్కసారి ఆగి ఆలోచిస్తే మనమందరం మునుపటి భారతదేశాన్ని చూడగలం అని ఆసిస్తూ…..

ఇట్లు,
మీ చెల్లి, మీ పక్కింటి అక్క, మీ మంచి కోరుకునే ఒక శ్రేయోభిలాషి!

ayurvedic lung detoxayurvedic lungs healthbest lung detox kadhacough తర్వాత ఊపిరి తాక్యతను ఎలా రికవర్ చేసుకోవాలి?detox lung teadetox lungs at homedetox lungs drink recipedetox lungs naturallyherbal lung detoxhow to detox lungslung detoxlung detox drinklungs cleansing kadhalungs cleansing remedylungs detox benefitslungs detox for smokerslungs detox home remedylungs detox kadha ఎలా తయారు చేస్తారు?lungs detox recipelungs detox supplementationlungs detox syruplungs detox tipslungs detox turmericlungs detoxificationlungs health drinklungs health కోసం ఆదివారం రీమిడీ ఏది?natural lung cleansepollution lungs detoxఊపిరి capacity పెంచాలంటే ఏ టీ తాగాలి?ఊపిరి డిటాక్స్ కోసం best పదార్థాలు ఏవి?ఊపిరి శరీరం శుభ్రం కావడానికి ఏదైనా టిప్?ఊపిరి శుద్ధి పానీయాన్ని ఎలా తయారు చేయాలి?ఊపిరి సమస్యలకు హోమ్ రీమిడీస్ ఏవి?ఊపిరితిత్తుల కోసం ఏ ఆయుర్వేద కషాయం?ఊపిరితిత్తులకు మంచి మందు ఏది?ఊపిరితిత్తులకున్న సువాసన కోసం చట్రింగ్ చేయాలంటే ఏ పానీయం?ఊపిరితిత్తులు ఎలా శుద్ధి చేయాలి?ఊపిరితిత్తులు డిటాక్స్‌కి ఇంట్లో ఏమి పనికొస్తుంది?ఊపిరితిత్తులు స్ట్రాంగ్ గా చేసుకోవాలని వుంటే ఏ పానీయం?కఫాన్ని తగ్గించే కషాయం ఎలా తయారు?కర్ఫ్యూ సమయంలో ఊపిరితిత్తులు డిటాక్స్ ఎలా చేసుకోవచ్చు?గుండెపోటు వచ్చినపుడు ఊపిరి కషాయం తీసుకోవచ్చా?ఘనే వాయు కాలుష్యానికి ఊపిరి రక్షణ ఎలా ఇవ్వాలి?డే క్యాచ్‌షన్ నుండి ఊపిరి ఎలా డిటాక్స్?పొగతాగినవారి ఊపిరితిత్తులు ఎలా శుభ్రం అవుతాయి?వాతావరణ కాలుష్యానికి శ్వాస రక్షణ చిట్కా ఏంటి?శరీరంలో ఆక్సీజన్ సరఫరా వచ్చేలా ఊపిరి షుద్ధి చిట్కాలు ఏటి?శీతాకాలంలో ఊపిరి ఇబ్బంది ఎలా తీసుకోవాలి?శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌కి ఇంట్లో remedy ఏంటి?స్కూల్ పిల్లల ఊపిరి ఆరోగ్యానికి నిటికి చిట్కేంటి?

Leave a Comment