హాయ్ అండి ! | Why Ayurvedic Morning Routine Matters?
ముందు మనం రోజుని ఎలా మొదలెట్టామో అనేది మాత్రమే ముఖ్యం ఎందుకంటే మన ఆయుర్వేదం చాల clear గా తేల్చి చెప్పేసింది ! ఉదయం నిద్రలేచి చేసే పనులు మన దినచర్యకి బలమైన పునాది లాంటివి అని చాలామందికి తెలియదు . ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఒక అద్భుతమైన ఆయుర్వేద మార్నింగ్ దినచర్య (Ayurvedic Morning Routine) మరియు 7 days Ayurvedic Diet Challenge & మనకు తెలియని కొన్ని ఆయుర్వేద ఆరోగ్య రహస్యాలు గురించి . . ఇది తెలివిగా పాటిస్తే మన రోజువారీ జీవితం ఎంత energetic గా మారిపోతుందో! మీరే చూసి ఆశ్చర్యపోతారు. ఇది ఒక రకంగా మన శరీరానికి పునరుత్తేజం ఇవ్వడమే కాదు, మన ఆత్మకి కూడా ఓ నూతన ప్రకాశాన్ని ఇస్తుంది. మన ఆయుర్వేదం ఒక రోజుని కొన్ని కాలాలుగా వివరించింది , ముందుగా అవి తెలుసుకోవాలి. తర్వాత దానికి అనుగుణంగా మన ప్లాన్ ఉండాలి.
🌄”కఫ కాలం” Explained | What is Kapha Time? | Ayurvedic Detox Window
అయ్యో, ఇప్పుడు లేటు అయ్యింది అని ఉలిక్కిపడి లేవడం అలవాటు అయ్యింది కదా? కానీ మన పూర్వీకులు ఉదయాన్నే ఎందుకు లేవాలని చెప్పారో ఆయుర్వేదం నాకన్నా బాగానే చెబుతుంది. ఉదయం 6 నుంచి 10 మధ్య “కఫ కాలం” అంటారు. ఈ కాలంలో శరీరం కొంచెం బరువుగా ఉంటుంది. ఈ సమయం శరీరాన్ని Detox చెయ్యటానికి బాగా ఉపయోగపడుతుంది. Detox జరిగితే మన శరీరం కొద్దిగా తేలికగా మారుతుంది.
అలాగే ఉదయాన్నే నిద్రలేవటం అనేది మనకు చిన్న విజయానికి మొదటిమెట్టు. ఆ ఏడిశావులే ! మేము అర్ద రాత్రిదాకా మొబైల్ లో Reels, YouTubeలో shorts చూసీ చూసీ అలసిపోయి పొద్దున్న 11am కి నిద్ర లేస్తాము అంటారా? ఇంక మీ కర్మ. మిమ్మని ఆ దేవుడు కూడా కాపాడడు .
క్రింద ఉన్నది ఒకసారి చుడండి! మీకు ఒక చిన్న అవగాహనా వస్తుంది

కఫ కాలంలో అనగా, ఉదయం 6 గంటల నుండి 10 గంటల మధ్య, ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉన్న కాలాన్ని పిత్తాశయ కాలం (పిత్తకాలం) అని అంటారు. ఈ కాలంలో సూర్యుడు ఆకాశంలో ఎత్తైన స్థానానికి వెళ్లి ఉంటాడు (నడినెత్తి మీద). ఇది ఏమి చేయడానికి అనువైన సమయం? ఈ సమయంలో మనం Main Meals (భోజనం ) చేస్తాము! మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మధ్యాహ్నం వాత కాలం. ఇది మానసిక కార్యకలాపాలకు సరైన సమయం. ఇది మొత్తం ఒక cycle లా repeat అవుతూ ఉంటుంది . మొత్తం 12 గంటలలో 3 కాలాలు ఉంటాయి , మరల Next వచ్చే 12 గంటలలో ఇంకో 3 కాలాలు repeat అవుతాయన్నమాట . అర్ధమయ్యింది అనుకుంటున్నాను .
☀️ STEP 1: వాత కాలంలో లేవడం | Wake Up During Vata Time |
“అమ్మా , ఇంకొంచెం సేపు పాడుకుంటానే ! ఇలాంటి మాటలకి ఒక వారం రోజులు STOP చెప్పండి. మన శరీరానికి సరైన సమయానికి లేవడం ఎంత ముఖ్యమో ఆయుర్వేదం చెబుతోంది. వాత కాలం అంటే ఉదయం 4:30 – 6 మధ్య సమయం. ఆ Time లో లేస్తే మన మెదడు చురుకుగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. మన ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. కళ్ళు తేలికగా తెరిచి, నెమ్మదిగా మంచంమీద నుంచీ లేచి, ఒక్కసారి కిటికీ లోనుంచి బయటకి చుడండి (ప్రపంచం మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది) వాహనాల చప్పుడు, పక్షుల కిలకిలారావాలు కుడా ఇంకా మొదలవ్వవ్. నిద్ర లేచిన తర్వాత ఇలా ఒక చిన్న ప్రార్థన చేయండి: మేము హిందువులము కాదు, అని అంటారా ? ఇయినా పర్వాలేదు.(మీ ప్రార్థన మీరు చేయండి) కింద తెలుగులో ఈ శ్లోకం యొక్క meaning కుడా పెట్టాను! మీరు నమ్మే దేవుళ్లను తలుచుకుని ప్రార్థన చెయ్యండి .
कराग्रे वसते लक्ष्मीः करमध्ये सरस्वती।
करमूले तु गोविन्दः प्रभाते करदर्शनम्॥
అంటే… మన చేతుల్లో లక్ష్మీ, సరస్వతి, విష్ణువు ఉన్నారని భావిస్తూ చేతులను చూస్తూ ఈ శ్లోకాన్ని పలకాలి. ఇది మనకి అదృష్టం కలిగించడమే కాదు, మనసులో ధనాత్మక భావనను నింపుతుంది. మన రోజంతా శుభంగా సాగుతుంది. (NOTE : మనం ఎవరిని కెలకాకుండా ఉంటె మాత్రమే మన రోజు ప్రశాంతంగా , శుభంగా సాగుతుంది).
💧 STEP 2: కాసింత వెచ్చని నీటితో Hydrate అవ్వు! (Ayurvedic Hydration)
లేచిన వెంటనే మొదట పనిగా – ఒక 250ML వేడి నీళ్లు తాగండి. దీనివల్ల మలం (Motion) సాఫీగా అవ్వటమే కాదు, రాత్రంతా తిన్నవి , అనవసరమైనవి , etc etc. అన్ని బయటకి వచ్చేస్తాయి . ఇక్కడ కొందరు అక్కలు అన్నయ్యలు అడగొచ్చు ! వేడి నీళ్ళే తాగాలా చెల్లీ ? YES ! వేడినీళ్లు తాగితేనే చెత్త మొత్తం బయటకి వచ్చేస్తుంది , FRIDGE WATER తాగితే మధ్యాహ్నం వరకు ఫుల్ మోషన్ అవ్వదు. ఇంట్లో పెద్దలు ఎప్పుడూ చెబుతారుగా – “వేడి నీళ్లు తాగితే పొట్ట శుభ్రం అవుతుంది” అని. నిజమే అది! కానీ మనం జ్వరం వచ్చినప్పుడు మాత్రమే కాచి చలార్చిన నీళ్లు తాగుతాం, అదేంటో!
తరువాత నాలుకను శుభ్రం చేయడం మర్చిపోకండి. జిహ్వా శుద్ధి అంటే నాలుకపై ఉన్న చెత్తను Clean చెయ్యటం. (Brush చేసాక చాలామంది tongue Clean చెయ్యటానికి ఇష్టపడరు, అందుకే చెపుతున్నా) ఇది జీర్ణశక్తికి చాలా మంచిది. మీ నాలుక శుభ్రంగా ఉంటే, మీ ఆహార రుచి కూడా పెరుగుతుంది. అంతేకాదండోయ్ , నోటి దుర్వాసన కూడా దూరమవుతుంది. ముక్కు, కళ్ళు, చెవులకు కూడా కడగడం మంచిది ! కానీ అవన్నీ కుడా ఇప్పుడే కడిగేస్తే దాన్ని స్నానం అంటారేమో ? కానీ ఇవన్నీ శుభ్రంగా ఉంటే మన శరీరంలో ప్రాణవాయువు స్వేచ్ఛగా ప్రసరిస్తుంది. సరేలే next step కి వెళదాం.
🍵 STEP 3: ఇంట్లో తయారయ్యే (Ayurvedic Drink Preparation)
అయ్యబాబోయ్ ! నువ్వేమి పొద్దుపొద్దున్నే బయటకి వెళ్ళక్కర్లేదు లే అక్క ! అన్ని ఇంట్లోనే ఉన్నాయిలే .
- ఒక గ్లాస్ వేడి నీళ్లు
- త్రిఫల చూర్ణం – అర టీ స్పూన్ (YouTube videos లో తయారీవిధానం చుడండి)
- తులసి ఆకులు లేదా తులసి పొడి – కొంచెం( చెట్టు విరగొట్టకూడదు సుమా)
- దాల్చిన చెక్క పొడి – చిటికెడు
- సోంపు గింజలు – అర టీ స్పూన్(బిర్యానీ తిన్నాక restaurant వాడు ఇస్తాడుగా అవే)
ఇవి అన్నీ వేడి నీటిలో వేసి, కాస్త చల్లారిన తర్వాత తేనె కలిపి తాగండి. ఇది మన జీర్ణాశయానికి బాగా పనిచేస్తుంది. శరీరం ఫుల్ క్లీనింగ్ లోకి వెళ్లిపోతుంది. అబ్బా! ఎదో తెలియని feeling వస్తుంది. ఎందుకంటే! చెడ్డది , అనవసరమైనది బయటకి పోయింది . కావలసింది లోపలి వచ్చింది . (NOTE : కొత్తకదా అలానే ఉంటుందిలే). ఇక్కడిదాకా చదివావు అంటే నువ్వు మామూలుదానివి కాదు అక్కోయ్.

🧘♀️ STEP 4: కాస్త నడవాలి ! పొద్దుపొద్దున్నే పరిగెత్తకు అక్కోయ్
ఒక 10-15 నిమిషాలు చాలు. మరీ ఎక్కువ చేస్తే అలిసిపోయి tiffin కావాలంటావు , లేకపోతె కళ్ళుతిరిగి పడిపోతావు . (కొత్త కదా అక్కాయ్ ) ఎదో ఆలా ఆలా ఇంటిచుట్టూ ఒక 4 సార్లు తిరగాలి , రోడ్ మీదకి మాత్రం వేళ్ళకు . ఎందుకంటే ! పొద్దున్నే మన జిడ్డు మొహం అందరు చూసేస్తారు or మనం Makeup వేసుకుని మరి వెళ్ళాలి. ఎందుకు చెప్పు పొద్దుపొద్దున్నే ఇంత పంచాయితీ ?
కుదిరితే సూర్య నమస్కారాలు , yoga ఇలాంటివి try చెయ్యండి .
మీరు కదలకుండా కూర్చుంటే శరీరం మరింత బరువుగా, మొద్దుగా మారిపోతుంది. కాబట్టి కాస్తంత చెమట పట్టేలా కదలండి. కదలికల వల్ల మన శరీరం ఎక్కువ ఆక్సిజన్ తీసుకుని, ఊపిరితిత్తులను విశాలంగా చేస్తుంది. కొంచెం silent / uplifting music పెట్టుకుని వ్యాయామం (or నడవండి) చేయండి – అది మనసుకూ శాంతిని ఇస్తుంది.
🚿 STEP 5: స్నానం ఏ నీలతో చెయ్యాలి ?
స్నానం చెయ్యమని కొత్తగా చెప్పేది ఏముంటుంది ? కానీ వేడినీళ్లా? చన్నీళ్లా? ఇక్కడే ఒక చిక్కు ఉంటుంది . చాలామందికి తెలియని ఒక వేద రహస్యం ఇక్కడ తెలుసుకోవాలి.
ఎవరు వేడినీళ్ల స్నానం చెయ్యాలి ?
వేడి నీటితో స్నానం చేస్తే శరీరంలో ఉన్న చెమట, నూనెతత్వం( oily skin) , మొద్దుదనం తగ్గుతుంది . దీనిని ఆయుర్వేదంలో ‘కఫం’ అంటారు. ఇది శరీరంలో తేమ, బరువు, చల్లదనం వంటి లక్షణాలను నియంత్రిస్తుంది. పొద్దున్నే వేడి నీళ్లతో స్నానం చేసినప్పుడు ఈ “కఫం“ తగ్గి శరీరం తేలికగా అనిపిస్తుంది.” వేడి నీళ్లతో స్నానం చేస్తే మీ BODY and MIND ఫ్రెష్ గా feel అవుతాయి .
ఎవరు చన్నీళ్ళ స్నానం చెయ్యాలి ?
ఇంకోపక్క , కొంతమందికి శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్లను ఆయుర్వేదం లో ‘పిత్తం’ ఎక్కువవాళ్లు అంటారు. వీరి శరీరంలో వేడి, ఆమ్లత, చికాకు ఎక్కువగా ఉంటాయి. అటువంటి వారు చల్లటి నీటితో స్నానం చేస్తే శరీరంలోని ఆ వేడి కాస్త తగ్గుతుంది, ఆమ్లత తగ్గి కొంచెం ప్రశాంతంగా కనపడతారు.
Simple గా చెప్పాలంటే:
- కఫం అంటే — శరీరంలో మొద్దుదనం, తేమ, బరువు (ఊబకాయం లాంటి లక్షణాలు).
- పిత్తం అంటే — శరీరంలో వేడి, మంట, ఆమ్లత, (తొందరగా చిరాకు , కోపం వచ్చే లక్షణాలు కూడా ఇందులో వస్తాయి).
స్నానం అయిపోయాక – మీకు ఇష్టమైన బట్టలు వేసుకోండి (మళ్ళి చెపుతున్నా! ఇష్టమైన, ఉతికిన బట్టలు మాత్రమే వేసుకోండి.). తర్వాత ఓ నాలుగు నిమిషాలు దేవుడికి దణ్ణం పెట్టుకోండి. ధూపదీపాలు వెలిగించండి. ఒక కొత్త Day start అయ్యిన feel వస్తుంది.
🙏 STEP 6: ఒక నిమిషం మౌనం లేదా ధ్యానం
ఇప్పటికే మన Phones notifications తో నిండిపోయి ఉంటాయిగా . ఏంపర్వాలేదు , వాటిని ఇంకొద్దిసేపు అలానే వదిలేయండి. కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం శ్వాస మీద దృష్టిపెట్టండి. Mind full clarity తో పని చేస్తుంది. మనసు గందరగోళాన్ని విడిచిపెడుతుంది. మీరు ధ్యానం చేయాలంటే “ఓం” మంత్రాన్ని మెల్లగా ఉచ్ఛరించండి. మన ఇంటి గోడలకే ఓ మంచి positive energy వస్తుంది. మీకు తెలుసా ? ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని 1: జరిగిన దానిమీద , 2: జరుగుతున్నా దానిమీద , 3: జరగబోయే దానిమీద … మనసును వెళ్లనివ్వకండి. ఇలా చెయ్యటం కష్టమే , కానీ ఇలా చేస్తే మన Brain restart అవుతుంది అని మన వేదాలు చెపుతున్నాయి .
🍲 STEP 7: Breakfast లో ఎం తినాలి ? (Ayurvedic Breakfast)
ఇది చాలా ముఖ్యమైన విషయం. మన శరీరం వాత, పిత్త, కఫ ధాతువుల మీద ఆధారపడుతుంది. అందరికి ఒకేలా ఉండదు , ఒకే Breakfast అందరికి set అవ్వదు.
వాత (వాతం) ఎక్కువవాళ్లు: అరటి, గోధుమ ఉప్మా, జీలకర్ర పాలు తీసుకోవటం మంచిది.
పిత్త(పిత్తం) ఎక్కువవాళ్లు: మెలన్స్, కొబ్బరి నీరు, తీపి ఆహారం ఎక్కువ కాకుండా తినాలి.
కఫ (కఫం)ఎక్కువవాళ్లు: వేడి ఆహారం, మిరియాల సూప్, ముదురు Millet వంటలు.
ఒక్కటే మాట – ఆకలైనప్పుడే తినండి. తిన్న తర్వాత భారం అనిపించకూడదు. మీరు తినే ఆహారం మిమ్మల్ని ఉత్తేజపరిచేలా ఉండాలి అంతేకాని మళ్ళీ నిద్ర వచ్చేలా ఉండకూడదు సుమా! . ఆరోగ్యంగా, తేలికగా, సంతోషంగా ఉండాలి అంటే ఇలాంటివి ఒక వారం రోజులైనా ట్రై చేసి చూడాలి గా అక్కా!
✅ చివరిగా ఒక చిన్న మాట!: 7 Days Ayurvedic Detox & Diet challenge
ఒక సారి మల్లి గుర్తుచేసుకుందాం .
- సూర్యోదయానికి ముందే లేవాలి.
- 250ML వేడినీళ్లు తాగాలి. నాలుకను బాగా శుభ్రం చేసుకోవాలి.
- Ayurvedic Drink Preparation
- సూర్య నమస్కారాలు , yoga లేదా walking.
- స్నానం ! (చాల ముఖ్యంగా మీ శరీర తత్త్వం తెలుసుకోండి . పిత్త ,కఫ చాల important.
- Silence.
- Ayurvedic Breakfast.
ఈ చిన్న మార్పులు మొదట్లో పెద్దగా అనిపించకపోవచ్చు. కానీ ఒక్కసారి ప్రారంభించిన తర్వాత మీరు రాత్రి పడుకునే సమయానికి ఒక్క కొత్త వ్యక్తిలా ఫీల్ అవుతారు.మన శరీరం, మనసు ఒక దేవాలయం అనేది మర్చిపోకండి . మార్పు అనేది ఒక్కసారిగా జరగదు – కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలకీ ఇదే మొదటి మెట్టు.
ప్రకృతితో కలిసిపోయి, మన పూర్వీకుల మార్గాన్ని అనుసరిస్తే –మనకి మాటిమాటికీ Doctor దగ్గరకి వెళ్ళవలసిన అవసరం ఉండదుగా . . మీరు ఒకసారి పాటిస్తే, ఇది అలవాటవుతుంది. అలవాటు అయితే – ఇది జీవనశైలి అవుతుంది. ఆ జీవనశైలి మీ జీవితాన్ని మొత్తాన్ని మార్చేస్తుంది అని నా అభిప్రాయం . మరిన్ని ayurvedic detox మరియు ఇతర వేదాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవటానికి infopinky.com ను BOOKMARK చేసుకోండి.
ఇట్లు,
మీ చెల్లి, మీ పక్కింటి అక్క, మీ మంచి కోరుకునే ఒక శ్రేయోభిలాషి!
✨ ఓం శాంతిః శాంతిః శాంతిః ✨
What is the best breakfast for Ayurveda? / ఆయుర్వేదంలో మంచి అండ్ బెస్ట్ అల్పాహారం ఏది?
వేడిగా ఉండాలి, తేలికగా జీర్ణం అవ్వాలి: ఉదా: జీలకర్రతో నెయ్యతో వేయించిన ఓట్స్.
Like spiced oats or whole-grain porridge with a bit of ghee, a warm, readily digestible breakfast.
What should we eat to lose weight in Ayurveda? / ఆయుర్వేదం ప్రకారం బరువు తగ్గటానికి ఎంతినాలి ?
చల్లారిన వంటలు, త్వరగా జీర్ణం అయ్యే వంటలు , గోధుమ, దాలిమా, ముడి ధాన్యాలు, ఎర్రపప్పు తో వండిన కిచిడి , మిరియాల పాలు , మసాలా తక్కువగా ఉండాలి.
Avoid heavy, cold, processed foods; light, whole-grain meals include spiced soups, millet pancakes, or moong dal khichdi.
1 thought on “మీకు తెలియని 5 ఆయుర్వేద రహస్యాలు – 7 Day Diet Challenge | Ayurvedic Detox |”
Comments are closed.